Duleep Trophy: జట్టులో ప్లేస్‌తోపాటు కెప్టెన్‌గా ఆఫర్.. కట్‌చేస్తే.. టీం నుంచి తప్పుకున్న టీమిండియా ప్లేయర్..

Ishan Kishan, Duleep Trophy 2023: ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ 2023లో టీమిండియాతో భాగమైన భారత యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ దులీప్ ట్రోఫీ నుంచి వైదొలిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Duleep Trophy: జట్టులో ప్లేస్‌తోపాటు కెప్టెన్‌గా ఆఫర్.. కట్‌చేస్తే.. టీం నుంచి తప్పుకున్న టీమిండియా ప్లేయర్..
Ishan Kishan Dulip Trophy
Follow us

|

Updated on: Jun 15, 2023 | 3:58 PM

జూన్ 28 నుంచి ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీతో భారత దేశవాళీ టోర్నమెంట్ సీజన్ ప్రారంభమవుతుంది. వచ్చే నెలలో భారత్‌, వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో చాలామంది యువ ఆటగాళ్లకు ఈ దేశవాళీ టోర్నీ కీలకమైనదని భావిస్తున్నారు. ఈ టోర్నీలో మంచి ప్రదర్శన చేస్తే భారత టెస్టు జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియాలో భాగమైన భారత యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ మాత్రం దులీప్ ట్రోఫీ నుంచి వైదొలగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈస్ట్ జోన్ జట్టు కెప్టెన్‌గా కిషన్‌ను ఎంపిక చేయాలని నిర్ణయించారు.

అయితే కిషన్ ఎలాంటి గాయం లేకుండా మొత్తం టోర్నీ నుంచి వైదొలగడం పలు అనుమానాలకు తెరలేసింది. ఎందుకంటే, ఈ దేశవాళీ టూర్‌లో కిషన్ అద్భుత ప్రదర్శన కనబరిస్తే వెస్టిండీస్ పర్యటనలో ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకునే అవకాశాలున్నాయి.

ప్రస్తుతం టీమ్ ఇండియాలో వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న కేఎస్ భరత్ ఇప్పటి వరకు ఆడిన ఐదు టెస్టుల్లో బ్యాట్‌తో ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాడు. ఆ విధంగా కిషన్ కరీబియన్‌లో అరంగేట్రం చేసే అన్ని అవకాశాలు ఉన్నాయి.

ఇషాన్‌ను జట్టులోకి ఎంపిక చేసి కెప్టెన్సీ అప్పగించనున్నట్లు జోన్ సెలక్షన్ కమిటీ కన్వీనర్ దేబాశిష్ చక్రవర్తి ప్లాన్ చేశారు. ఆ తర్వాత దేబాశిష్ ఇషాన్‌తో మాట్లాడి దేశవాళీ టోర్నీలో ఆడాలని కూడా కోరాడు. కానీ, ఇషాన్ అందుకు నిరాకరించాడని, దులీప్ ట్రోఫీలో ఆడనని చెప్పాడంట.

దులీప్ ట్రోఫీలో ఆడేందుకు కిషన్ నిరాకరించడంతో, అభిమన్యు ఈశ్వరన్ ఈస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్‌గా నియమితులయ్యారు. ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడిన ర్యాన్ పరాగ్, ముఖేష్ కుమార్, షాబాజ్ అహ్మద్, అభిషేక్ పోరెల్ వంటి ఆటగాళ్లు కూడా జట్టులో ఉన్నారు.

ఈస్ట్ జోన్ జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), శంతను మిశ్రా, సుదీప్ ఘరామి, ర్యాన్ పరాగ్, ఎ. మజుందార్, బిపిన్ సౌరభ్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), కె కుషాగ్రా (వికెట్ కీపర్), ఎస్ నదీమ్ (వైస్ కెప్టెన్), షాబాజ్ అహ్మద్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్, అనుకుల్ రాయ్, ఎం మురా సింగ్, ఇషాన్ పోరెల్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..