Ind vs Pak: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆసియా కప్‌లో 3సార్లు ఢీకొట్టనున్న భారత్-పాకిస్థాన్ జట్లు.. ఇదిగో పూర్తి వివరాలు..
Asia Cup 2023: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), ఏసీసీ ఆసియా కప్-2023 తేదీలను విడుదల చేసింది. ఈ టోర్నీ ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 17 వరకు జరగనుంది. ఈ టోర్నీ పాకిస్థాన్, శ్రీలంకలో జరగనుంది. అలాగే భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఎప్పుడా అని ఎదురుచూసే అభిమానులకు కూడా శుభవార్త వచ్చింది.
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్ వర్సెస్ పాకిస్తాన్ పోరుకు రంగం సిద్ధమైంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసియా కప్-2023 తేదీలను ప్రకటించింది. ఈ టోర్నీ ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 17 వరకు పాకిస్థాన్, శ్రీలంకలో జరగనుంది. దీంతో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే అభిమానులకు కూడా గుడ్ న్యూస్ వచ్చింది. తాజాగా ఆసియా కప్‌లో రెండు జట్లూ చాలా బలమైన జట్లుగా బరిలోకి దిగనున్నాయి. అయితే, ఈ ఆసియా కప్‌లో మాత్రం రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు జరగవచ్చని తెలుస్తోంది.
ఆసియా కప్ 2023 ఫార్మాట్‌ను పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజించిన సంగతి తెలిసిందే. మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో నాలుగు మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో, తొమ్మిది మ్యాచ్‌లు శ్రీలంకలో జరగనున్నాయి.
భారత్ వర్సెస్ పాక్ పోరు 3 సార్లు..
ఈ ఆసియాకప్‌లో భారత్, పాకిస్థాన్‌లు తలపడడం దాదాపు ఖాయమని తెలింది. అయితే పూర్తి షెడ్యూల్ విడుదల చేయని పీసీబీ.. కేవలం తేదీలను మాత్రమే ప్రకటించింది. భారత్, పాకిస్థాన్‌లను ఒకే గ్రూప్‌లో ఉండడంతో.. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగడం ఖాయంగా మారింది. లీగ్ రౌండ్ తర్వాత ఒక్కో గ్రూపు నుంచి రెండు జట్లు సూపర్-4 దశకు చేరుకుంటాయి. ఈ దశలో టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్స్ ఆడనున్నాయి. భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉండడంతో ఒక మ్యాచ్ తప్పక ఉంటుంది. ఆ తర్వాత రెండు జట్లూ సూపర్-4లోకి వస్తే.. ఇరు జట్లు మరోసారి తలపడనున్నాయి.
Dates and venues have been finalised for the Asia Cup 2023! The tournament will be held from 31st August to 17th September in a hybrid model – with 4 matches being held in Pakistan and the rest in Sri Lanka! https://t.co/bvkfSSAp9w#AsiaCup #ACC
— AsianCricketCouncil (@ACCMedia1) June 15, 2023
గత ఆసియా కప్ షెడ్యూల్ ప్రకారం సూపర్-4లో చేరిన జట్టు ప్రతి జట్టుతో మ్యాచ్‌లు ఆడుతుంది. అంటే సూపర్-4లో భారత్, పాకిస్థాన్ టీంలు వస్తే ఇక్కడ మ్యాచ్ కచ్చితంగా జరుగుతుంది. ఆ తర్వాత ఈ రెండు జట్లూ సూపర్-4లో టాప్-2లో కొనసాగితే ఫైనల్స్‌కు చేరుకోవడంతోపాటు ఈ ఆసియా కప్‌లో ఈ జట్లు ముచ్చటగా మూడోసారి తలపడనున్నాయి.
ఈసారైనా భారత్ సత్తా చాటేనా?
గతసారి ఆసియా కప్‌లో భారత్ ఫైనల్ చేరలేకపోయింది. ఈ జట్టు సూపర్-4లోనే నిష్క్రమించింది. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఆసియా కప్‌ను టీమిండియా దక్కించుకోవాలని కోరుకుంటుంది. ఈ ఆసియా కప్ నుంచి, భారత్‌పాటు ఇతర జట్లన్నీ ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో జరిగే ప్రపంచకప్‌కు సిద్ధమవుతాయి. గతేడాది, బాబర్ అజామ్ సారథ్యంలోని ఈ జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ శ్రీలంక చేతిలో ఓడిపోయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..