Geyser Using Tips: మీరు గీజర్‌ను ఉపయోగిస్తున్నారా? పేలే ప్రమాదం ఉంది.. వీటిని తప్పక పాటించండి..!

ఇంట్లో గీజర్ పేలి నవ దంపతులు మృతి.. గీజర్ పేలి ఒకరికి గాయలు.. ఇలాంటి వార్తలు మనం చాలా చూశాం. కారణం గీజర్‌పై సరైన అవగాహన లేకపోవడం. చలికాలంలో గీజర్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేయడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Geyser Using Tips: మీరు గీజర్‌ను ఉపయోగిస్తున్నారా? పేలే ప్రమాదం ఉంది.. వీటిని తప్పక పాటించండి..!
Geyser
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Jun 20, 2023 | 3:18 PM

ఇంట్లో గీజర్ పేలి నవ దంపతులు మృతి.. గీజర్ పేలి ఒకరికి గాయలు.. ఇలాంటి వార్తలు మనం చాలా చూశాం. కారణం గీజర్‌పై సరైన అవగాహన లేకపోవడం. చలికాలంలో గీజర్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేయడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ కారణంగానే.. ప్రజలు గీజర్‌ను ఉపయోగిస్తారు. అయితే, గీజర్‌ వినియోగంపై అవగాహన లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మరి వాటిని ఎలా నివారించాలో ఇవాళ మనం తెలుసుకుందాం..

ఈ కారణాల వల్ల గీజర్ పేలే ప్రమాదం ఉంది..

గీజర్ పేలుడు సంభవించడానికి ప్రధాన కారణం అది ఎక్కువ సమయం ఆన్‌లో ఉంచడమే. చాలాసార్లు ప్రజలు గీజర్ ఆన్ చేసి ఆఫ్ చేయడం మరిచిపోతారు. దాంతో బాగా వేడెక్కిన తరువాత గీజర్ పేలే అవకాశం ఉంది. అలాగే బాయిలర్‌పై ఒత్తడి, లీకేజీ సమస్య కారణంగా కూడా పేలే అవకాశం ఉంది. లీకైన గీజర్ కారణంగా విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం కూడా ఉంది.

గీజర్లలో 5 రకాలు..

గీజర్లలో 5 రకాలు ఉన్నాయి. వీటిలో ఎలక్ట్రిక్ గీజర్, గ్యాస్ గీజర్, ట్యాంక్ వాటర్ గీజర్, హైబ్రిడ్ గీజర్, సోలార్ గీజర్ ఉన్నాయి. అయితే చాలా ఇళ్లలో ఎలక్ట్రిక్, గ్యాస్ గీజర్లను మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఎలక్ట్రిక్ గీజర్‌లో, నీటిని కాపర్ కాయిల్ ద్వారా వేడి చేస్తారు. అది విద్యుత్తుతో నడుస్తుంది. గ్యాస్ గీజర్ LPGతో నడుస్తుంది. అయితే, ఈ గీజర్ కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తుంది. వెంటిలేషన్ అవసరం.

ఇవి కూడా చదవండి

గీజర్ ప్రమాదాలను ఇలా నివారించండి..

మంచి కంపెనీలకు చెందిన గీజర్లను వినియోగించాలి. కంపెనీ ఇంజనీర్ ద్వారా దానిని ఫిట్టింగ్ చేయించాలి. అలాగే ప్రతి సంవత్సరం ఎలక్ట్రిక్ గీజర్‌ను సర్వీస్ చేయిస్తుండాలి. ఇలా గీజర్ పేలుడు ప్రమాదాన్ని తగ్గించొచ్చు.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
Horoscope Today: ఆ రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
ఎల్‌కే అద్వానీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
ఎల్‌కే అద్వానీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
పిఠాపురంలో 3 ఎకరాలు కొన్నా.. ఇక నుంచి ఇదే నా ఇల్లు
పిఠాపురంలో 3 ఎకరాలు కొన్నా.. ఇక నుంచి ఇదే నా ఇల్లు
కల్కి పార్ట్ 2లో ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసిన నాగ్ అశ్విన్..
కల్కి పార్ట్ 2లో ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసిన నాగ్ అశ్విన్..
గ్యాస్‌ నొప్పిని చిటికెలో మాయం చేసే అద్భుత చిట్కా..
గ్యాస్‌ నొప్పిని చిటికెలో మాయం చేసే అద్భుత చిట్కా..
పవన్ కళ్యాణ్ సినిమాతో తెలుగులో ఎంట్రీ.. వరుస హిట్స్ అందుకున్న తార
పవన్ కళ్యాణ్ సినిమాతో తెలుగులో ఎంట్రీ.. వరుస హిట్స్ అందుకున్న తార
శ్రీపాద వల్లభుడి సాక్షిగా ప్రజలకు రుణపడి ఉంటాః పవన్
శ్రీపాద వల్లభుడి సాక్షిగా ప్రజలకు రుణపడి ఉంటాః పవన్
రోజూ ఓ కప్పు కాఫీ తాగితే.. అమేజింగ్ అంతే! ఆ సమస్యకు అమృతం లాంటిది
రోజూ ఓ కప్పు కాఫీ తాగితే.. అమేజింగ్ అంతే! ఆ సమస్యకు అమృతం లాంటిది
వందేభారత్‌ వర్షపు నీరు..వీడియో వైరల్‌.. రైల్వే ఏం చెప్పిందంటే..
వందేభారత్‌ వర్షపు నీరు..వీడియో వైరల్‌.. రైల్వే ఏం చెప్పిందంటే..
ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా! కారణం ఇదే..
ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా! కారణం ఇదే..