Surya Gochar: రవి సంచార ప్రభావం.. వచ్చే నాలుగు మాసాల్లో వారి జీవితాల్లో కొత్త మార్పులు పక్కా..! మీ రాశికి ఎలా ఉంటుందంటే..

Surya Gochar 2023: ప్రస్తుతం మిధున రాశిలో సంచరిస్తున్న రవి మరో నాలుగు నెలలపాటు అంటే అక్టోబర్ 15వ తేదీ వరకు తన మిత్ర క్షేత్రాలలోనూ, స్వక్షేత్రంలోనూ సంచరించడం జరుగుతుంది. ఇది దాదాపు అన్ని రాశుల వారికి జీవితాలకు సంబంధించిన అన్ని విషయాలలోనూ చెప్పుకోదగ్గ మార్పులు తెచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు బాగా లబ్ధి పొందే అవకాశం ఉంది. ఏ ఏ రాశుల వారికి ఇది ఏ ఏ విధంగా ప్రయోజనం చేకూరుస్తుందో ఇక్కడ పరిశీలిద్దాం

Surya Gochar: రవి సంచార ప్రభావం.. వచ్చే నాలుగు మాసాల్లో వారి జీవితాల్లో కొత్త మార్పులు పక్కా..! మీ రాశికి ఎలా ఉంటుందంటే..
Surya Gochar 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 20, 2023 | 1:47 PM

Surya Gochar 2023: ప్రస్తుతం మిధున రాశిలో సంచరిస్తున్న రవి మరో నాలుగు నెలలపాటు అంటే అక్టోబర్ 15వ తేదీ వరకు తన మిత్ర క్షేత్రాలలోనూ, స్వక్షేత్రంలోనూ సంచరించడం జరుగుతుంది. ఇది దాదాపు అన్ని రాశుల వారికి జీవితాలకు సంబంధించిన అన్ని విషయాలలోనూ చెప్పుకోదగ్గ మార్పులు తెచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు బాగా లబ్ధి పొందే అవకాశం ఉంది. ఏ ఏ రాశుల వారికి ఇది ఏ ఏ విధంగా ప్రయోజనం చేకూరుస్తుందో ఇక్కడ పరిశీలిద్దాం.

  1. మేష రాశి: మేష రాశి వారికి రవి గ్రహం పంచమ స్థానం అధిపతి అయినందువల్ల అనేక శుభ పరిణామాలకు కారకుడయ్యే అవకాశం ఉంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వినడం జరుగుతుంది. ఈ రాశి వారి ఆలోచనలు, ప్రయత్నాలు సత్ఫలితాలను సాధిస్తాయి. కాలం వృధా చేయకుండా కొత్త కొత్త ప్రయత్నాలను చేపట్టడం చాలా మంచిది. కుటుంబ అభివృద్ధికి వ్యక్తిగత పురోగతికి సంబంధించి కొత్త ప్రణాళికలను రూపొందించుకొని వెంటనే అమలు చేయడం చాలా మంచిది.
  2. వృషభ రాశి: ఈ రాశి వారికి నాలుగో స్థాన అధిపతి అయిన రవి నాలుగైదు నెలలపాటు మిత్ర క్షేత్రాలలో సంచరిస్తున్నందువల్ల గృహ, వాహన ప్రయత్నాలు, కుటుంబ సంబంధమైన అభివృద్ధి ప్రయత్నాలు తప్పకుండా సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో కుటుంబంలో సుఖ సంతోషాలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో సానుకూల పరిస్థితులు, అభివృద్ధి అనుభవానికి వస్తాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. సామాజికంగా ఒక హోదా ఏర్పడుతుంది.
  3. మిథున రాశి: తృతీయ అధిపతి అయిన రవి గ్రహం అనుకూల సంచారం వల్ల, ముఖ్యమైన పనులు పూర్తి కావడం, మనసులోని కోరికలు నెరవేరటం వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం కావడం, శుభవార్తలు వినడం వంటివి జరిగే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆస్తి సంబంధమైన వివాదాలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. ఒక సంతృప్తికరమైన జీవితం అనుభవించడానికి వీలుంది.
  4. కర్కాటక రాశి: ధన స్థానాధిపతి అయిన రవి దాదాపు నాలుగు నెలల పాటు అనుకూలంగా ఉన్నందువల్ల ధనయోగం పట్టడం ఆకస్మిక ధన లాభం కుటుంబ వృద్ధి, మాట చెల్లుబాటు, దాంపత్య జీవితంలో అన్యోన్యత వంటివి తప్పకుండా అనుభవానికి రావడం జరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో డబ్బు వసూలు కావడం, మంచి పరిచయాలు ఏర్పడటం, కోర్టు కేసులు విజయవంతం కావడం వంటివి జరుగుతాయి. ఈ రాశి వారి సలహాలు సూచనలకు విలువ పెరుగుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహ రాశి: ఈ రాశికి అధిపతి అయిన రవి వల్ల కొన్ని శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపారంలో పెట్టుబడులు, సామాజిక సేవా కార్యక్రమాలు, రాజకీయ విజయాలు, అదనపు సంపాదన వంటివి తప్పకుండా అనుభవానికి వస్తాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా, ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అవి అతి తక్కువ సమయంలో మంచి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. వ్యక్తిగత పురోగతికి అవకాశం ఏర్పడుతుంది. ఉద్యోగ పరంగా అవకాశాలు కలిసి వస్తాయి.
  7. కన్యా రాశి: ఈ రాశి వారికి కూడా రవి సంచారం చాలా వరకు అనుకూలంగా ఉన్నందువల్ల విదేశాలలో ఉద్యోగం విదేశాలలో చదువులు, విదేశాలలో స్థిరత్వం వీసా సమస్యల పరిష్కారం, ఉన్నత విద్య, అదనపు సంపాదన, విలాస జీవితం, పిల్లల పురోగతి వంటివి తప్పకుండా చోటుచేసుకునే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరడం జరుగుతుంది. ఏదైనా ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది.
  8. తులా రాశి: ఈ రాశి వారికి రవి లాభాధిపతి అయినందువల్ల సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు ఏర్పడటం, ప్రభుత్వ ఉద్యోగం రావటం, రాజకీయాలలో ప్రవేశించడం, వ్యాపారంలో అభివృద్ధి, వృత్తి జీవితంలో పురోగతి వంటివి జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించడం ఉద్యోగులకు స్థిరత్వం లభించడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంది. ఆదాయం విషయంలో ఆలోచించవలసిన అవసరం ఉండకపోవచ్చు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.
  9. వృశ్చిక రాశి: ఈ రాశి వారికి రవిగ్రహం దశమాధిపతి అయి నందువల్ల, ఉద్యోగ పరంగా మంచి మార్పులు సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. నిరుద్యోగులకు స్థిరమైన ఉద్యోగం లభించవచ్చు. వివాహ ప్రయత్నాలు ఫలించ వచ్చు. గౌరవ మర్యాదలు పెరగడం జరుగు తుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. చిన్న ప్రయత్నంతో అధిక లాభాలను అధిక ప్రయోజనాలను అనుభవించే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం కావచ్చు.
  10. ధనూ రాశి: ఈ రాశికి భాగ్య స్థానాధిపతి అయిన రవి చాలావరకు అనుకూలంగా సంచరిస్తున్నందువల్ల ముఖ్యమైన పరిణామాలు కొన్ని చోటు చసుకునే అవకాశం ఉంది. జీవితం ఒక చక్కని మలుపు తీసుకుంటుంది. విదేశీయానానికి సంబంధించిన ఆటంకాలు, సమస్యలు పరిష్కారం అవుతాయి. వారసత్వంగా ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది. తల్లిదండ్రులతో కలిసి ఉండే అవకాశం ఉంది. విదేశాలలో ఉద్యోగం సంపాదించడం లేక చదువులకు సంబంధించి సీటు సంపాదించడం వంటివి జరిగే అవకాశం ఉంది.
  11. మకర రాశి: ఈ రాశి వారికి అష్టమాధిపతి అయిన రవి అనుకూలంగా సంచరిస్తున్నందువల్ల జీవిత భాగస్వామి విశేషంగా పురోగతి సాధించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి తరఫు నుంచి అదృష్టం పట్టడం లేదా ఆస్తి కలిసి రావటం లేదా మంచి ఉద్యోగంలో స్థిరపడటం వంటివి జరిగే సూచనలు ఉన్నాయి. భార్య లేక భర్త అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పక్షంలో ఈ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది.
  12. కుంభ రాశి: ఈ రాశి వారికి రవి గ్రహం ఏడవ స్థానానికి అధిపతి అయినందువల్ల వివాహ సంబంధమైన సమస్యలు పరిష్కారం కావడం వివాహం మూలకంగా అదృష్టం పట్టడం, వైవాహిక జీవితంలో అన్యోన్యత పెరగటం, విభేదాలు తగ్గటం వంటివి జరిగే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలపరంగా జీవిత భాగస్వామి విశేషంగా పురోగతి చెందడం జరుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు శుభవార్తలు వినే అవకాశం ఉంది. సంతానం లేని వారికి సంతానయోగం పట్టవచ్చు.
  13. మీన రాశి: ఈ రాశి వారికి ఆరవ స్థానాధిపతి అయిన రవి గ్రహం చాలా వరకు అనుకూలంగా సంచరిస్తున్న అందువల్ల ఇప్పటినుంచి అక్టోబర్ 16 లోగా ఆర్థిక అభివృద్ధి ఆర్థిక సమస్యల పరిష్కారం అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం కావడం, దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభించడం, అకస్మాత్తుగా ఆదాయం పెరగటం, శత్రువులు స్నేహితులుగా మారడం వంటివి జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. కోర్టు కేసు ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది.

నోట్: ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..