Horoscope Today: కొత్త ఉద్యోగ ప్రయత్నాలలో వారు శుభ వార్త వింటారు.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు..

Rashi Phalalu(21 June): భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. దీన్ని తెలుసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా జ్యోతిష్య శాస్త్రాన్ని ఎంచుకుంటారు. ఈ రోజు ఏ రాశివారికి ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి? కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి?  12 రాశుల వారి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోండి.

Horoscope Today: కొత్త ఉద్యోగ ప్రయత్నాలలో వారు శుభ వార్త వింటారు.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు..
Horoscope 21st June 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Jun 21, 2023 | 5:30 AM

Rashi Phalalu(21 June): భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. దీన్ని తెలుసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా జ్యోతిష్య శాస్త్రాన్ని ఎంచుకుంటారు. ఈ రోజు ఏ రాశివారికి ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి? కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి?  12 రాశుల వారి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోండి.

  1. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడటం జరుగుతుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు వంటి వృత్తి నిపుణులకు బాగా డిమాండ్ పెరుగు తుంది. వ్యాపారంలో మంచి లాభాలు చవి చూస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది. పిల్లలలో పురోగతి కనిపిస్తుంది. దాంపత్య జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా కొనసాగుతుంది.
  2. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది కానీ అనుకోని ఖర్చులు మీద పడే అవకాశం ఉంది. అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందుతుంది. ఉద్యోగ జీవితంలో పని భారం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా బాగా ఒత్తిడి ఉంటుంది. కొత్త ప్రయత్నాలు, కొత్త ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి. శుభకార్యాల మీద ఖర్చు చేయడం జరుగుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలిస్తుంది.
  3. మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగంలో లక్ష్యాలు పెరిగినప్పటికీ సహచరుల సహకారంతో సకాలంలో పూర్తి చేయడం జరుగు తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయితే, ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. ఆదాయంలో మెరుగుదల కనిపిస్తోంది. అదనపు ఆదాయం మార్గాలు అందుబాటులోకి వస్తాయి. సంతానపరంగా ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలలో శుభ వార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
  4. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఆశించిన శుభవార్తలు అందుతాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు. ఆదాయపరంగా కుటుంబంలో అభివృద్ధి కనిపిస్తుంది. కుటుంబానికి సంబంధించి ఒకటి రెండు ముఖ్యమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎదిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో బాగా శ్రమ ఒత్తిడి ఉన్నప్పటికీ చివరికి అవి ఆశించిన ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. త్వరలో ఇంట్లో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): పట్టుదలగా కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఆదాయంలో మెరుగుదల కనిపిస్తోంది. అనవసర ఖర్చులకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం చాలావరకు సహక రిస్తుంది. స్నేహితులతో విలాస కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడు తుంది. తల్లితండ్రుల సహకారం పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఏర్పడు తుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగి పోతాయి. పిల్లల నుంచి శుభవార్త వింటారు.
  7. కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులకు డోకా ఉండదు. వృత్తి వ్యాపారాలలో ఒత్తిడి, శ్రమ ఉన్నప్పటికీ పట్టుదలగా ముందుకు వెళ్లడం జరుగుతుంది. కుటుంబంలో పిల్లల విషయంలో ఒకటి రెండు సమస్యలు చికాకు పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం చాలా వరకు హ్యాపీగా, సాఫీగా సాగి పోతుంది. సహచరుల నుంచి సహాయ సహకా రాలు అందుతాయి. ఒకరిద్దరు స్నేహితులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. బంధు వర్గంలో పెళ్లి నిశ్చయం అయ్యే అవకాశం ఉంది.
  8. తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వృత్తి, వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ఉద్యోగంలో పని భారం పెరిగినప్పటికీ దానివల్ల సానుకూల ప్రయోజనాలు అనుభవానికి వస్తాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయం వల్ల భవిష్యత్తులో చాలావరకు మంచి జరుగుతుంది. పెళ్లికి సంబంధించి ఒక అనుకోని శుభవార్త వింటారు. ఆదాయం పెరుగుతుంది. ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది.
  9. వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): కుటుంబ పరిస్థితి, ఆదాయ పరిస్థితి చాలా వరకు మెరుగ్గానే ఉంటుంది కానీ ఉద్యోగంలో ఒత్తిడి, వేధింపులు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. గృహ వాహన సంబంధమైన ఒకటి రెండు సమస్యలు పరిష్కారం అవుతాయి. మనసులోని కోరిక ఒకటి అనుకోకుండా నెరవేరుతుంది. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.
  10. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఈ రాశి వారికి అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది. ఆదాయంలో ఆశించిన దాని కంటే ఎక్కువగా మెరుగుదల కనిపిస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. వృత్తి వ్యాపారంలో సంపాదన వృద్ధి చెందు తుంది. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించి ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాల వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.
  11. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): కొత్త ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి మెరుగుదల వంటి విషయాలలో మీ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సామ రస్యంగా సాగిపోతుంది. అనుకున్న పనులు అను కున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ మాట చెల్లు బాటు అవుతుంది. ఏ విషయంలోనూ తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వాగ్వాదాలు పెట్టుకోవద్దు. వృత్తి వ్యాపారాలలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి.
  12. కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. స్నేహితుల వల్ల డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో శ్రమ ఒత్తిడి పెరగటం, సహచరులు నింద వేయటం వంటివి జరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఎవరి దగ్గరా నోరు జారడం మంచిది కాదు.
  13. మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఈ రోజు అంతా చాలా వరకు బిజీగా సాగి పోతుంది. అనేక పనులు ఒకేసారి చక్క పెట్టాల్సి వస్తుంది. బంధువులు స్నేహితుల నుంచి కొన్ని ముఖ్యమైన పనులు సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగంలో పురోగతి సాధించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందు సాగుతాయి. ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టడం, ఆహార, విహారాల్లో జాగ్రత్తగా పాటించడం మంచిది. పిల్లలు అభివృద్ధి చెందుతారు. శుభ వార్తలు వింటారు. సమయం అనేక విధాలుగా అనుకూలంగా ఉంది.

నోట్: ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..

గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా