Venus Transit 2023: సింహరాశిలోకి శుక్రుడు.. జూలైలో ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి కూడా ఉందా..!

Venus Transit 2023: సంస్కృతితో సంబంధం లేకుండా మానవ జీవితంలో జ్యోతిష్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల స్థితిగమనాలు మనపై పలు రకాలుగా ప్రభావం చూపుతాయి. అయితే ఈ ప్రభావాలు కొందరికీ వ్యతిరేకంగా, మరి కొందరికి సానుకూలంగా

Venus Transit 2023: సింహరాశిలోకి శుక్రుడు.. జూలైలో ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి కూడా ఉందా..!
Venus Transit 2023
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 21, 2023 | 2:24 PM

Venus Transit 2023: సంస్కృతితో సంబంధం లేకుండా మానవ జీవితంలో జ్యోతిష్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల స్థితిగమనాలు మనపై పలు రకాలుగా ప్రభావం చూపుతాయి. అయితే ఈ ప్రభావాలు కొందరికీ వ్యతిరేకంగా, మరి కొందరికి సానుకూలంగా ఉంటాయి. ఈ క్రమంలోనే జూలై 7న శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించాడు. ఫలితంగా రాశిచక్రమంలోని కొన్ని రాశులవారికి అధిక మొత్తంలో ధనప్రాప్తి, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ రాశులేమిటో ఇప్పుడు చూద్దాం..

తులారాశి: శుక్రుని సింహరాశి సంచారం తులరాశి జాతకం కలిగినవారికి ఎంతో లాభదాయకంగా ఉంది. ఈ సమయంలో మీరు ఆర్థిక లాభంతో పాటు కీర్త ప్రతిష్టలను సంపాదించుకుంటారు. సమాజంలో మీరు గుర్తింపును కూడా పొందుతారు.

వృషభ రాశి: సింహరాశిలో శుక్రుని సంచారం వృషభ రాశివారికి కూడా మంచిగా ఉంటుంది. ఈ తరుణంలో మీరు కష్టానికి తగిన ఫలితం, సంతాన ప్రాప్తిని పొందుతారు. అయితే మీ భాగస్వామితో గొడవలు పడేందుకు అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

కుంభ రాశి: సింహరాశిలో శుక్రుని ప్రవేశం కుంభరాశి వారికి కలిసి వస్తుంది. ఐశ్వరానికి కారకుడైన శుక్రుడు ఈ సమయంలో మీకు వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో ఆశీస్సులను అందించనున్నాడు. ఫలితంగా మీ భాగస్వామితో గతంలో కలిగిన మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. అంతేకాక ఈ సమయంలో ప్రేమికులు వివాహం వైపుగా అడుగులు వేస్తారు. క్రీడాకారులకు ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పుకోవాలి.

గమనిక: ఇందులో పేర్కొన్న అంశాలు పాఠకులు ఆసక్తి మేరకు వివిధ కథనాల నుంచి సేకరించి ఇవ్వడమైంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..