Horoscope Today(22 June): వారిని కొందరు మిత్రులు తప్పుదోవ పట్టించే అవకాశం.. 12 రాశుల వారికి గురువారం రాశిఫలాలు..

Rashi Phalalu(22 June): భవిష్యత్తులో తమ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి  ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. దీన్ని తెలుసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరిస్తారు. ఈ రోజు ఏ రాశివారికి ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి? కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి?  12 రాశుల వారి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోండి.

Horoscope Today(22 June): వారిని కొందరు మిత్రులు తప్పుదోవ పట్టించే అవకాశం.. 12 రాశుల వారికి గురువారం రాశిఫలాలు..
Horoscope 22nd June 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Jun 22, 2023 | 6:00 AM

Rashi Phalalu(22 June): భవిష్యత్తులో తమ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి  ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. దీన్ని తెలుసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరిస్తారు. ఈ రోజు ఏ రాశివారికి ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి? కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి?  12 రాశుల వారి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోండి.

  1. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగ పరంగా ఒకటి రెండు చిన్న చిన్న చిరాకులు ఉన్నప్పటికీ మొత్తం మీద రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. డబ్బు ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. కుటుంబ సమస్యలు తగ్గు ముఖం పట్టి సామరస్య వాతావరణం నెలకొం టుంది. ఆరోగ్యం చాలావరకు పరవాలేదు అని పిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇల్లు లేదా స్థలం కొనడానికి సంబంధించి ప్రయత్నాలు ప్రారంభించడానికి అవ కాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు.
  2. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆర్థిక పరిస్థితి చాలా వరకు బాగుంటుంది. ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ప్రత్యేక బాధ్యతలను చేపట్టవలసి వస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించడం అవసరం. కుటుంబ జీవితంలో సుఖసంతోషాలు వెల్లి విరుస్తాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు. బంధుమిత్రులతో విందులో పాల్గొంటారు.
  3. మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): లాభ స్థానం, ధన స్థానం బాగా బలంగా ఉన్నందువల్ల ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగ జీవితం చాలా వరకు సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగంలో మార్పును ఆశిస్తున్న వారు శుభవార్త వినడం జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఒకటి రెండు సమస్యలు ఉన్నప్పటికీ మొత్తం మీద దాంపత్య జీవితం అన్యోన్యంగా కొనసాగుతుంది. వ్యక్తిగత జీవితం కొద్దిగా పురోగతికి చెందుతుంది.
  4. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యక్తిగత సమస్య ఒకటి అతి కష్టం మీద పరిష్కారం అవుతుంది. అష్టమ శని కారణంగా ఆరోగ్యం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. తరచూ శివాలయానికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. కుటుంబ జీవితం మెరుగ్గా ఉంటుంది. విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. మిత్రులు కొందరు సమస్యలు సృష్టిస్తారు.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): భాగ్య స్థానంలో గురువు, లాభ స్థానంలో రవి ఉండటం వల్ల జీవితం సుఖప్రదంగా మారు తుంది. ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా, ఆశాజనకంగా సాగి పోతుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడు తుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. కొందరు మిత్రులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ప్రతిష్ట దెబ్బ తినకుండా చూసుకోవాలి.
  7. కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగు తాయి. విలాస జీవితం గడిపే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి, ధన వృద్ధికి అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించి ఒకటి రెండు ముఖ్యమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. తోబుట్టువులతో సయోధ్య పెరుగుతుంది. ఉద్యోగ జీవితం సామాన్యంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా పురోగతి ఉంటుంది. ఉద్యోగం మారటానికి చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
  8. తుల (చిత్త, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగం, ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటాయి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు బాగా బిజీ అయిపోతారు. కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. ఐటీ రంగం వారు సొంతగా వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబపరంగా పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే సూచనలున్నాయి.
  9. వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): అనుకోకుండా కొద్దిగా అదృష్టం కలిసి వస్తుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ముఖ్య మైన అవసరాలు గడిచిపోతాయి. ప్రస్తుతానికి ఇతరులకు సహాయం చేసే ఉద్దేశం పెట్టుకోవద్దు. వాగ్దానాలు చేయడానికి, హామీలు ఉండటానికి ఇది ఏ మాత్రం అనుకూల సమయం కాదు. ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు ఉంటూనే ఉంటాయి. సహచరులు బాగా ఇబ్బంది పెడ తారు. వృత్తి వ్యాపారాలు ఒక మోస్తరుగా సాగి పోతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగానే ఉంటుంది.
  10. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): అన్ని విధాలా సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు, కొత్త ఉద్యోగానికి, ఉద్యోగంలో మార్పునకు ప్రయత్నాలు ప్రారం భించడం చాలా మంచిది. వివాహ ప్రయత్నాలు కూడా విజయవంతం అయ్యే అవకాశం ఉంది. వృత్తి నిపుణులు పురోగతి చెందడానికి మార్గం సుగమం అవుతుంది. ఏ చిన్న ప్రయత్నం చేసి నప్పటికీ అది తప్పకుండా సఫలం అవుతుంది. ఆరోగ్యం చాలావరకు పరవాలేదు. దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది.
  11. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ముఖ్యమైన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. గౌరవ అభిమానాలు పెరుగు తాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఖర్చు చేస్తూ ఉండటం మంచిది. వృత్తి రంగంలో ఉన్నవారు ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. తరచూ శివాలయా నికి వెళ్ళటం వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.
  12. కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): కుటుంబ పరంగా మధ్య మధ్య సమస్యలు లేదా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించుకోగలుగుతారు. కోపతాపాలను అదుపులో ఉంచుకోవడం మంచిది. ఆర్థిక పరి స్థితి నిలకడగా ఉంటుంది. పొదుపు సూత్రాలు పాటిస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ జీవితంలో పని భారం బాగా పెరుగు తుంది. వృత్తి వ్యాపారాల్లో అధిక శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యులను సంప్రదించడం మంచిది.
  13. మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. చిన్న చిన్న సమస్యలకు ఆందోళన చెందకుండా మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్లడం మంచిది. కొద్ది ప్రయత్నంతో తప్పకుండా వ్యక్తిగత సమ స్యలు, కుటుంబ సమస్యలు పరిష్కారం అవు తాయి. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగి పోతుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయితే, ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది.

నోట్: ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు