AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thursday Astro Tips: దాంపత్యజీవితంలో వివాదాల… నివారణ కోసం గురువారం చేయాల్సిన దానాలు ఏమిటంటే..

ఐశ్వర్యం, వైవాహిక జీవితం, పిల్లలకు కూడా గురువును కారకంగా పరిగణిస్తారు. హిందూ గ్రంథాల్లో బృహస్పతి సంపద, శ్రేయస్సు కు కారకంగా పరిగణించబడుతుంది. విశ్వాసం ప్రకారం గురువారం రోజున శ్రీ మహా విష్ణువును నియమ నిబంధనలతో పూజిస్తే ఆ మనిషి జీవితం ఆనందంతో నిండి ఉంటుంది.

Thursday Astro Tips: దాంపత్యజీవితంలో వివాదాల... నివారణ కోసం గురువారం చేయాల్సిన దానాలు ఏమిటంటే..
Thursday Puja Tips
Surya Kala
|

Updated on: Jun 22, 2023 | 7:28 AM

Share

నవ గ్రహాల్లో ఒకటి బృహస్పతి. ఎవరి జాతకంలోనైనా బృహస్పతి ఒక శుభ, ముఖ్యమైన గ్రహంగా జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. బృహస్పతిని దేవతల గురువు అని కూడా అంటారు. గృహ సమస్యలు, మానసిక ఒత్తిడులు వంటి సమస్యల నుంచి బయటపడాలంటే గురువారం రోజున బృహస్పతిని పూజించడం వల్ల సంతోషం, శాంతి లభిస్తుంది. అంతే కాదు ఎవరి జాతకంలో బృహస్పతి చెడుగా ఉంటే.. ఆ వ్యక్తి తన జీవితంలో ఎప్పటికీ పురోగతి సాధించలేడు. ఐశ్వర్యం, వైవాహిక జీవితం, పిల్లలకు కూడా గురువును కారకంగా పరిగణిస్తారు. హిందూ గ్రంథాల్లో బృహస్పతి సంపద, శ్రేయస్సు కు కారకంగా పరిగణించబడుతుంది. విశ్వాసం ప్రకారం గురువారం రోజున శ్రీ మహా విష్ణువును నియమ నిబంధనలతో పూజిస్తే ఆ మనిషి జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. అందుకే జీవితంలో కోరుకున్న కోరికలు నెరవేరాలంటే కొన్ని గురు నివారణ చర్యలు తీసుకోవాలి.

గురువారం చేయాల్సిన పరిహారాలు.. 

బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి.. గురువారం ఉపవాసం ఉండాలి. అరటి మొక్కకు నీరు సమర్పించి పూజించండి. ఇలా చేయడం వల్ల పెళ్లిలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. వివాహం చేసుకుంటే మీ వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు.

ఇవి కూడా చదవండి

చేయాల్సిన దానాలు..  

గురువారం రోజున పసుపు బట్టలు, పసుపు పండ్లు, కుంకుమ, పసుపు చందనం లేదా పసుపు దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల గురువు బలవంతుడు కావడం వల్ల ఆరోగ్యం, ఆనందం పెరుగుతాయి. దీంతో పాటు ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటుంది.

పఠించాల్సిన మంత్రాలు..

జ్యోతిష్య శాస్త్రంలో పూజానంతరం మంత్రోచ్ఛారణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. మంత్రాలను పఠించడం గొప్ప శక్తిని కలిగి ఉంటుంది. సాధకుల కోరికలు నెరవేరతాయి. కనుక గురువును ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి గురువారం ఈ మంత్రాలలో దేనినైనా జపించండి.

1. ఓం నారాయణాయ విద్మహే. వాసుదేవాయ ధీమహి. తన్నో విష్ణు ప్రచోదయాత్.

2. ఓం నమః శ్రీ వాసుదేవాయ.

3. ఓం బృమ్ బృహస్పతయే నమః ।

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).