Mercury Transit 2023: ఈ నెల 24న ఏర్పడనున్న బుధాదిత్యయోగం.. ఈ ఆరు రాశుల ఉద్యోగ, వ్యాపారస్తులు పట్టిందల్లా బంగారమే..
ఈ నెల 24వ తేదీన మిథున రాశిలోకి ప్రవేశించి అక్కడ సంచరించనున్నాడు. ఈ రాశి గమనంతో ఇప్పుడు బుధాదిత్య యోగం ఏర్పడనుంది. దీంతో అన్ని రాశుల్లో అనేక మార్పులు జరగనున్నాయి. కొన్ని రాశులపై మంచి ప్రభావం చూపించగా.. మరికొన్నింటిపై చెడు ప్రభావం చూపించనున్నది బుధాదిత్య యోగం. ఈ నేపథ్యంలో బుధుని గమనంలో మార్పు కారణంగా శుభ సమయం ప్రారంభమయ్యే రాశుల గురించి తెలుసుకుందాం..
నవ గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూనే ఉంటాయి. ఈ గ్రహ సంచారానికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రాముఖ్యత ఉంది. నవగ్రహాల్లో ఒకటైన బుధుడుని శుభప్రదంగా భావిస్తారు. జూన్ 7న వృషభ రాశిలోకి ప్రవేశించిన బుధుడు .. ఈ నెల 24వ తేదీన మిథున రాశిలోకి ప్రవేశించి అక్కడ సంచరించనున్నాడు. ఇప్పటికే ఇక్కడ ఉన్న సూర్యుడి తో ఈ రాశి గమనంతో సూర్య-బుధ సంయోగం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడనుంది. దీంతో అన్ని రాశుల్లో అనేక మార్పులు జరగనున్నాయి. కొన్ని రాశులపై మంచి ప్రభావం చూపించగా.. మరికొన్నింటిపై చెడు ప్రభావం చూపించనున్నది బుధాదిత్య యోగం. ఈ నేపథ్యంలో బుధుని గమనంలో మార్పు కారణంగా శుభ సమయం ప్రారంభమయ్యే రాశుల గురించి తెలుసుకుందాం..
మేషరాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు బుధాదిత్య యోగంతో ఆత్మవిశ్వాసం నెలకొంటుంది. అంతేకాదు ఉద్యోగులకు అనుకూల సమయం. పై అధికారులతో ప్రశంసలను అందుకుంటారు. ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు.
వృషభం రాశి: ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు తాము పెట్టిన పెట్టుబడులతో భారీ లాభాలను ఆర్జిస్తారు. ఆర్ధికంగా బలపడతారు. అయితే సోమరి తనం వదిలి పనిచేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఆహార విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.. లేదంటే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది.
మిథున రాశి: ఈ రాశిలోనే బుధుడు అడుగు పెట్టి బుధాదిత్య యోగం ఏర్పడనున్న నేపథ్యంలో వీరు పట్టిందల్లా బంగారమే. అనేక ఆర్ధిక, సామజిక ప్రయోజనాలు పొందుతారు. ఖర్చులు అదుపులో పెట్టుకుంటే.. ఆర్ధికంగా అదనపు ప్రయోజనాలు.. డబ్బులు నాలుగు విధాలుగా వచ్చే అవకాశం ఉంది.
కర్కాటక రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు కొత్త వాహనాలు చేయాలనే ప్రయత్నం చేస్తుంటే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు శుభఫలితాలు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్ధికంగా శుభఫలితాలను పొందుతారు.
సింహ రాశి: బుధాదిత్యయోగం వలన ఈ రాశివారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు సంతోషం కలిగించే వార్తను వినే అవకాశం ఉంది. ఉద్యోగప్రయత్నం చేస్తున్న నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటర్వ్యూలో విజయం సాధించే అవకాశాలున్నాయి.
తుల రాశి: ఈ రాశి వారికీ బుధాదిత్య రాజయోగం శుభ ఫలితాలను ఇస్తుంది. చేపట్టిన పనిలో అదృష్టం కలిసి వస్తుంది. ఆటంకాలతో ఆగిన పనులు మళ్ళీ పట్టాలు ఎక్కుతాయి. కెరీర్ లో సక్సెస్ అందుకునే అవకాశాలున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. పుణ్యక్షేత్రాలకు ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారమే.. ఆర్ధికంగా అనుకోని విధంగా లాభాలను అందుకుంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).