Ganesh Temples: దర్శనంతోనే దోషాలు తొలగించే ఈ 5 గణపతి ఆలయాలు.. జోడీ మేకర్‌గా ఫేమస్ ఈ గుడి

గణేశుడు జ్ఞానానికి అధిపతి. భారతదేశంలో గణేశుడికి సంబంధించిన అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లోని గణేషుడిని దర్శనంతోనే కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఈ రోజు గణేశుడికి సంబంధించిన ప్రముఖ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి, పూజ  ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.. 

Ganesh Temples: దర్శనంతోనే దోషాలు తొలగించే ఈ 5 గణపతి ఆలయాలు.. జోడీ మేకర్‌గా ఫేమస్ ఈ గుడి
Ganesh Temple
Follow us
Surya Kala

|

Updated on: Jun 22, 2023 | 10:19 AM

హిందూ సనాతన ధర్మంలో ఆదిపూజ్యుడు విఘ్నలకధిపతి గణేశుడు. ఏ భక్తుడైనా ముందుగా గణపతిని నిష్టతో, భక్తితో పూజిస్తే శుభాలు జరుగుతాయి.. జీవితం సుఖమయం అవుతుంది. గణపతిని ఆరాధించడం ద్వారా జీవితంలో వచ్చే అన్ని అడ్డంకులు తొలగి సుఖ సంపదలు కలుగుతాయని విశ్వాసం. జీవితంలోని ప్రతి రంగంలోనూ ఆశించిన విజయం లభిస్తుంది. గణేశుడు జ్ఞానానికి అధిపతి. భారతదేశంలో గణేశుడికి సంబంధించిన అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లోని గణేషుడిని దర్శనంతోనే కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఈ రోజు గణేశుడికి సంబంధించిన ప్రముఖ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి, పూజ  ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం..

సిద్ధి వినాయక దేవాలయం (ముంబై) ముంబయిలోని సిద్ధివినాయక దేవాలయం దేశంలోని ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. ఒక భక్తుడు సిద్ధివినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత అతడిపై అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం. గణపతి ఆశీస్సులతో ఎటువంటి సమస్యలైనా క్షణాల్లో పరిష్కారమవుతాయి. సిద్ధి వినాయక దేవాలయాన్ని సామాన్యులు మాత్రమే కాదు.. బాలీవుడ్ , టీవీ పరిశ్రమకు చెందిన పెద్ద ప్రముఖులు దర్శించుకుంటారు. తమ కోరికను గణపయ్యకు చెప్పుకోవడానికి చెప్పులు లేకుండా ఆలయానికి చేరుకుంటారు. ఈ ఆలయం దేశంలోని గొప్ప గణపతి దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. భారీ సంఖ్యలో భక్తులు కానుకలు సమర్పిస్తారు.

దగ్దుసేత్ హల్వాయి మందిర్ (పుణె) పూణేలోని సుందర్ నగర్‌లోని గణపతికి కి చెందిన దగ్దుసేత్ హల్వాయి ఆలయం అద్భుతాలతో నిండి ఉంది.  ఏడాది పొడవునా భక్తుల రద్దీ ఉంటుంది. ఈ ఆలయాన్ని దగ్దుసేత్ హల్వాయి నిర్మించాడని అప్పటి నుంచి ఈ పేరుతోనే ప్రసిద్ధిగాంచింది. బంగారంతో చేసిన గణపతి  విగ్రహాన్ని దర్శనంతోనే అన్ని బాధలు తొలగిపోయి కోరికలు కూడా తీరుతాయని నమ్మకం.

ఇవి కూడా చదవండి

మోతీ డోంగ్రీ ఆలయం (జైపూర్) ఈ గణపతి  ఆలయం రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని చాంద్‌పోల్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ వెలసిన గణపతిపై భక్తులకు చాలా నమ్మకం ఉంది. మూంగ్ దాల్ లడ్డూలు నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయని విశ్వాసం. మోతీ డోంగ్రీ ఆలయంలో విగ్రహం అత్యంత పురాతనమైనదని 800 ఏళ్ల నాటి గణపతి  విగ్రహం అని ప్రసిద్ధి. కొత్త వాహనాలకు ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో కొత్త వాహనాన్ని పూజిస్తే ప్రమాదాలు జరగవని విశ్వాసం.

ఖజ్రానా గణేష్ ఆలయం (ఇండోర్) మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న ఖజ్రానా గణపతి ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ గణపతి తన భార్య సిద్ధి, బుద్ధిలతో కొలువై ఉన్నాడు. ఈ ఆలయాన్ని మహారాణి అహిత్యవాయి హోల్కర్ నిర్మించారు. ఎవరైతే ఈ ఆలయాన్ని సందర్శిస్తారో ఆ భక్తుల బాధలను తొలగి సక్సెస్ అందిస్తాడని విశ్వాసం. ఖజ్రానా ఆలయంలో ఏడాది పొడవునా భక్తుల రద్దీ ఉంటుంది. గజాననునికి భారీ సంఖ్యలో నైవేద్యాలు సమర్పిస్తారు.

ఇష్కియా గణేష్ ఆలయం (జోధ్‌పూర్) ఇక్కడ ఆలయంలోగణపతికి పూజలు చేస్తే పెళ్లి జరుగుతుందని విశ్వాసం. ఈ గణేశ దేవాలయం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నగరంలో ఉంది. ఈ ఆలయంలో గణపతికి పూజలు చేసి తమ కోర్కెలు తీర్చమని పెళ్లికాని యువతీ యువకుల కోరితే వివాహం కుదురుతుందని విశ్వాసం. దీంతో భారీ సంఖ్యలో ప్రేమికులు ఇక్కడకు చేరుకుంటారు. ప్రేమ పేరుతో దరఖాస్తులు ఇస్తారు. అందుకనే ఇక్కడ కొలువైన గణపతిని జోడి మేకర్ అని కూడా అంటారు. అందుకే ఈ ఆలయానికి ఇష్కియా గణేష్ ఆలయం అని పేరు పెట్టారు. బుధవారాల్లో ఈ ఆలయంలో ప్రేమ జంటల జాతర జరుగుతుందా అన్న విధంగా జంటలు చేరుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).