Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personality Test: మీరు గురువారం పుట్టారా? మీలో దాగి ఉన్న వ్యక్తిత్వ లక్షణాలు, తగిన కెరీర్‌ల గురించి తెలుసుకోండి..

గురువారం జన్మించిన వ్యక్తులు జీవితంపై సానుకూల దృక్పథం కలిగి ఉంటారు. ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఇతరులతో ఈజీగా కలిసిపోతారు. హాస్యచతురతను కలిగి ఉంటారు. ఇతరులను నవ్విస్తూ.. తాము సంతోషపడతారు. స్నేహితులు, సహోద్యోగులలో ప్రముఖులుగా నిలుస్తారు. దాతృత్వ గుణం కలిగి ఉంటారు.

Personality Test: మీరు గురువారం పుట్టారా? మీలో దాగి ఉన్న వ్యక్తిత్వ లక్షణాలు, తగిన కెరీర్‌ల గురించి తెలుసుకోండి..
Thursday Born People
Follow us
Surya Kala

|

Updated on: Jun 22, 2023 | 9:01 AM

జ్యోతిషశాస్త్రం ప్రకారం గురువారం జన్మించిన వ్యక్తులు బృహస్పతి ప్రభావంతో కొన్ని ప్రత్యేక వ్యక్తిత్వ లక్షణాలను కలిగి ఉంటారని నమ్ముతారు. బృహస్పతి అదృష్టం, ఐశ్వర్యం, వైవాహిక జీవితం, పిల్లలకు, సంపద లకు కారకంగా పరిగణించబడుతున్నాడు. గురువారం జన్మించిన వ్యక్తులు అదృష్టవంతులు,  ఆశావాద వ్యక్తులు అని అంటారు. అంతేకాదు ఎప్పుడూ సానుకూల దృక్పధం, అవుట్‌ గోయింగ్ స్వభావం,  సాహసం, ప్రేమను కలిగి ఉంటారు. కొన్ని సమయాల్లో ఎన్ని అవకాశాలున్నా బలమైన నిర్ణయంతో ముందుకు వెళ్తారు. ఇతరులతో సంబంధాలను కలిగి ఉండడంలో మాత్రమే కాదు న్యాయం చేయడంలో కూడా వీరు లోతైన జ్ఞానాన్ని కలిగి ఉంటారు.

గురువారం జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వ లక్షణాలు..

గురువారం జన్మించిన వ్యక్తులు జీవితంపై సానుకూల దృక్పథం కలిగి ఉంటారు. ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఇతరులతో ఈజీగా కలిసిపోతారు. హాస్యచతురతను కలిగి ఉంటారు. ఇతరులను నవ్విస్తూ.. తాము సంతోషపడతారు. స్నేహితులు, సహోద్యోగులలో ప్రముఖులుగా నిలుస్తారు. దాతృత్వ గుణం కలిగి ఉంటారు. సాహస నేచర్ ను కలిగి ఉంటారు. రిస్క్ తీసుకోవడానికి భయపడరు. తరచుగా ప్రయాణాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తారు. కొత్త అనుభవాలను ఇష్టపడతారు. తమ పరిధులను విస్తృతం చేసుకోవడానికి ఎల్లప్పుడూ మార్గాలను అన్వేషిస్తారు.

ఇవి కూడా చదవండి

ప్రేమ, సంబంధాలలో వ్యక్తిత్వం.. 

గురువారం జన్మించిన వ్యక్తులు నమ్మకమైన, అంకితమైన భాగస్వాములుగా చెప్పబడతారు.  నిజాయితీ,  నమ్మకానికి విలువ ఇస్తారు. బలమైన, ఆరోగ్యకరమైన సంబంధాన్ని కొనసాగించడానికి ఇష్టపడతారు. అంతేకాదు శృంగారభరితంగా ఉంటారు. దయ కలిగిన వ్యక్తులు. గురువారం జన్మించిన వ్యక్తులు నైతికతకు విలువ ఇస్తారు. న్యాయాన్ని విశ్వసిస్తారు. తమ వ్యవహారాలను నిజాయితీగా, సూటిగా నెరపడానికి ఆసక్తిని చూపిస్తారు.

కెరీర్‌లో విషయంలో ..

గురువారం జన్మించిన వ్యక్తులు అత్యంత తెలివితేటలు కలిగి ఉంటారు. ప్రేమ మూర్తులు. సహజమైన ఉత్సుకతను కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ కొత్త జ్ఞానాన్ని, అనుభవాలను కోరుకుంటారు.  త్వరగా నేర్చుకుంటారు. సమాచారాన్ని గ్రహించడంలో, భిన్నమైన ఆలోచనల మధ్య సంబంధాలను ఏర్పరచుకోవడంలో ప్రతిభను కలిగి ఉంటారు.

గురువారం జన్మించిన వారి బలహీనత..

వీరి ఆశావాద స్వభావం ఉన్నప్పటికీ.. గురువారం-జన్మించిన వ్యక్తులు అతిగా తినడాన్నీ ఇష్టపడతారు.  సహజమైన ఆనందాన్ని కలిగి ఉంటారు. ఆహారం, విలాసాలు కొన్నిసార్లు వ్యసనంగా మారవచ్చు లేదా కంపల్సివ్ ప్రవర్తనతో సమస్యలకు దారి తీయవచ్చు.

గురువారం జన్మించిన వారి కెరీర్..

గురువారం జన్మించిన వ్యక్తులు సహజమైన ప్రేమను కలిగి ఉంటారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఉత్సుకతను కలిగి ఉంటారు. విద్యలో, ఉద్యోగంలో రాణిస్తారు. సాహసోపేతమైన స్ఫూర్తితో .. కొత్త అనుభవాల పట్ల ప్రేమతో, వారు తమ అనుభవాలను ఇతరులతో పంచుకుంటూ, ప్రయాణ రచనలో వృత్తిని ఆస్వాదిస్తారు. సేల్స్ లేదా మార్కెటింగ్‌లో కెరీర్‌కు బాగా సరిపోతారు. ఆశావాద, రిస్క్ తీసుకునే స్వభావం కలిగి ఉంటారు. దీంతో  గురువారం జన్మించిన వ్యక్తులు వ్యవస్థాపకత, సొంత వ్యాపారాలను ప్రారంభించడం పట్ల సహజమైన మొగ్గును కలిగి ఉంటారు.

గురువారం జన్మించిన వ్యక్తులు ఆనందాన్ని ఇష్టపడతారు. బలమైన నైతికత, న్యాయంతో.. కౌన్సెలింగ్ లేదా సామాజిక సేవలో వృత్తిని ఆకర్షించవచ్చు. సాధారణ వ్యక్తిత్వ లక్షణాల ఆధారంగా.. కొన్ని వృత్తులు వీరికి సరిపోతాయి. టీచర్, రచయిత, వ్యాపారవేత్త, చెఫ్, కౌన్సిలర్, లాయర్, జర్నలిస్ట్ ,అథ్లెట్, పబ్లిక్ స్పీకర్, సంగీతకారుడు, ఫోటోగ్రాఫర్, ఫ్యాషన్ డిజైనర్, పర్యావరణవేత్త,ఇంజనీర్,ఇంటీరియర్ డిజైనర్, మనస్తత్వవేత్త, ఆర్థిక సలహాదారు వంటికి బెస్ట్ కెరీర్ అషన్స్ ని చెప్పవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).