AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఇదెక్కడి డిజైన్‌రా సామీ..! యువకుడి ముఖంపై స్పెక్స్ట్ టాటూ.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?

Watch Video: చాలా మందికి టాటూ వేయించుకోవడం అనేది ఓ ప్యాషన్. ఒక్కో టాటూ డిజైన్‌కి ఒక్కో నేపథ్యం, ఆర్థం ఉంటాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలోని టాటూకి అర్థం చెప్పడం ఎవరికీ సాధ్యం ..

Watch Video: ఇదెక్కడి డిజైన్‌రా సామీ..! యువకుడి ముఖంపై స్పెక్స్ట్ టాటూ.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Unusual Tattoo Visuals
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jun 20, 2023 | 3:23 PM

Share

Watch Video: చాలా మందికి టాటూ వేయించుకోవడం అనేది ఓ ప్యాషన్. ఒక్కో టాటూ డిజైన్‌కి ఒక్కో నేపథ్యం, ఆర్థం ఉంటాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలోని టాటూకి అర్థం చెప్పడం ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు. ఇంకా మీలో ఆశ్చర్యాన్ని కూడా కలిగించవచ్చు. ఎందుకంటే వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి తన కళ్లపై కళ్లజోడు టాటూను వేయించుకున్నాడు. స్పెక్స్ట్ పెట్టుకున్నవారు ఎలా అయితే కనిపిస్తారో.. అలాగే కనిపించేలా అతను చెక్కించుకున్నాడు. ఇంకా టాటూ చెక్కించుకున్న తర్వాత తన కళ్లజోడు పెట్టుకున్నాడు. కళ్లజోడు ఉన్న వ్యక్తి మళ్లీ అదే టాటూ ఎందుకు వేయించుకున్నాడని నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

@Bornakang అనే ట్విట్టర్ హ్యాండిల్‌తో షేర్ అయిన ఈ వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు. ఆ వీడియోలో ముందుగా కళ్లజోడు ఫ్రేమ్‌లా తన కళ్లపై డిజైన్ చేయించుకున్నాడు. ఆ తర్వాత టాటూ చెక్కించాడు. ఆ తర్వాత తన రియల్ స్పెక్ట్స్ పెట్టుకున్నాడు. దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో కానీ వీరంతా మనల్ని నవ్వించడానికే పుట్టిన కారణజన్ములని, అలాంటి టాటూ వేసుకున్న వ్యక్తిని మొదటిసారి చూస్తున్నానని, కంటిపై టాటూ అతనిది గట్టి గుండె అని రాసుకొస్తున్నారు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు 13 మిలియన్ల వీక్షణలు, 48 వేలకు పైగా లైకులు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..