Ashes 2023: ‘అతనే కారణం’.. ఆసీస్ వికెట్ కీపర్‌పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ప్రశంసల జల్లు..

ENG vs AUS: ఇంగ్లాండ్ వేదికగా యాషెస్‌‌ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఆసీస్ తరఫున తొలి ఇన్సింగ్స్‌లో 66 పరుగులు చేసిన కంగారుల వికెట్ కీపర్ ఆలెక్స్ క్యారీపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ప్రశంసల వర్షం..

Ashes 2023: ‘అతనే కారణం’.. ఆసీస్ వికెట్ కీపర్‌పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ప్రశంసల జల్లు..
Eoin Morgan On Alex Carey
Follow us

|

Updated on: Jun 19, 2023 | 4:27 PM

ENG vs AUS: ఇంగ్లాండ్ వేదికగా యాషెస్‌‌ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఆసీస్ తరఫున తొలి ఇన్సింగ్స్‌లో 66 పరుగులు చేసిన కంగారుల వికెట్ కీపర్ ఆలెక్స్ క్యారీపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 393/8 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా.. ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(141), ఆలెక్స్ క్యారీ(66) టాప్ స్కోరర్లుగా ఆసీస్ స్కోర్‌ ఆ మాత్రం పెరిగేలా చేశారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాంగ్ మాజీ మోర్గాన్ మాట్లాడుతూ ‘‘ఇది (శనివారం) ఆస్ట్రేలియా రోజు అనుకుంటున్నాను. ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొవడానికి నేను ఇష్టపడతాను. అందుకు క్యారీనే కారణం. ఈ వికెట్‌పై ఆస్ట్రేలియన్ ప్లేయర్లు కొన్ని పరుగులు చేయాలని ఆశించారు. కానీ అది ఖవాజా, కారీ నుంచి సాధ్యమైంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

అయితే శనివారం క్యారీ క్రీజులోకి రాకముందు ఆసీస్ 67 పరుగులకే డేవిడ్ వార్నర్(9), మార్నస్ లాబుషెన్(0), స్టీవ్ స్మిత్‌(16)ల వికెట్లను కోల్పోయింది. అనంతరం వచ్చిన ట్రావిస్ హెడ్(50).. ఉస్మాన్ ఖావాజాతో కలిసి నాల్గో వికెట్‌కి మెరుగైన భాగస్వామ్యం అందించి 148 పరుగులు వద్ద పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే వచ్చిన ఆలెక్స్ క్యారీ శనివారం ఆట ముగిసేసరికి 52 (80)* పరుగులు చేయగా, ఖవాజా ఇంగ్లాండ్‌పై తన తొలి టెస్ట్ సెంచరీని సాధించాడు.

కాగా, ప్రస్తుతం 4వ రోజు ఆట జరుగుతోంది. ఆదివారమే తమ రెండో ఇన్నింగ్ ప్రారభించిన ఇంగ్లాండ్ టీమ్.. 18 ఓవర్ల ఆట ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. ఇక క్రీజులో జో రూట్(34), హ్యరీ బ్రూక్(1) ఉన్నారు. వీరిద్దరి కంటే ముందు ఓపెనర్లుగా వచ్చిన జాక్ క్రాలే(7), డెన్ డక్కెట్(19).. వన్‌డౌన్ బ్యాట్స్‌మ్యాన్ ఒల్లీ పోప్(14) పరుగులకే వెనుదిరిగారు. ఇక ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ కమ్మిన్స్ 2, స్కాట్ బోలాండ్ 1 వికెట్ తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎన్‌పీఎస్‌ ఖాతాదారులకు గుడ్‌ న్యూస్‌..ఆ మినహాయింపుతో అదిరే లాభాలు

మత్స్యకారుల వలకు బాహుబలి చేప.. వీడియో చూస్తే షేకవ్వాల్సిందే..

ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?

సమయం లేదు మిత్రమా.. గడువు సమీపిస్తోంది.. జూలై 31 చివరి అవకాశం..

నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్! టాలీవుడ్ హీరో మంచి మనసు

తిరుమల నడకమార్గంలో భక్తుడిని కాటేసిన పాము

'చిరుత' టికెట్స్ దొరక్కపోతే .. పిఠాపురం వెళ్లి బెనిఫిట్ షో చూశా'

గుడ్డు మాంసాహారమా.. శాకాహారమా.. సైన్స్ సమాధానం ఇదే..

భారత్ మహిళా ఆర్చర్లపై భారీ అంచనాలు.. మ్యాచ్ టైమింగ్స్ ఎప్పుడంటే

ఒలింపిక్స్‌లో భారత్‌ బోణి.. ఎయిర్‌ పిస్టల్ విభాగంలో మనుకి కాంస్యం
ఒలింపిక్స్‌లో భారత్‌ బోణి.. ఎయిర్‌ పిస్టల్ విభాగంలో మనుకి కాంస్యం
ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్! టాలీవుడ్ హీరో మంచి మనసు
నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్! టాలీవుడ్ హీరో మంచి మనసు
లైగర్ అప్పుల నుంచి ఎట్టకేలకు పూరీకి విముక్తి.!

ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ

విజయ్‌ దేవరకొండ సినిమాను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన రష్మిక.!

తాగిన మైకంలో పాముతో ఆటలు.. కాటేసిన సర్పం.! తర్వాత ఏమైందంటే..!

స్క్రీన్ షాట్స్ తో సహా నటుడి నీచపు గుట్టును బటయపెట్టిన సింగర్.?

తగ్గిన బంగారం ధరలు ఎన్నాళ్లు ఇలాగే ఉంటాయి.? నిపుణుల మాటేంటి.!

బిగ్‌బాస్‌లోకి జనసేన వీర మహిళ? ఊహించని విధంగా సాగనున్న బిగ్ బాస్8

పేరు మార్చుకున్న పూరీ కొడుకు.. మరి ఇలా అయినా హిట్టు వచ్చేనా.?