AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravindra Jadeja: జడేజా క్రష్ ఎవరో తెలుసా..? పబ్లిక్‌గా చెప్పేసిన జడ్డూ భాయ్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

Ravindra Jadeja: ప్రపంచ క్రికెట్‌లో టాప్ ఆల్‌రౌండర్స్‌ లిస్టులో తప్పక ఉండే పేరు రవీంద్ర జడేజా. భారత్ జట్టును ఎన్నో సందర్భాల్లో తన ఒంటరి పోరాటంతో గెలిపించిన జడేజా ఇప్పుడు టెస్ట్ క్రికెట్‌లో నెం.1 ఆల్‌రౌండర్‌. అయితే ఐపీఎల్ 2023..

Ravindra Jadeja: జడేజా క్రష్ ఎవరో తెలుసా..? పబ్లిక్‌గా చెప్పేసిన జడ్డూ భాయ్.. వైరల్ అవుతున్న ఫోటోలు..
Ravindra Jadeja
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jun 19, 2023 | 4:25 PM

Share

Ravindra Jadeja: ప్రపంచ క్రికెట్‌లో టాప్ ఆల్‌రౌండర్స్‌ లిస్టులో తప్పక ఉండే పేరు రవీంద్ర జడేజా. భారత్ జట్టును ఎన్నో సందర్భాల్లో తన ఒంటరి పోరాటంతో గెలిపించిన జడేజా ఇప్పుడు టెస్ట్ క్రికెట్‌లో నెం.1 ఆల్‌రౌండర్‌. అయితే ఐపీఎల్ 2023 ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ని ఒంటి చేత్తో గెలిపించిన జడేజాకు సంబంధించిన పోస్ట్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అవును, స్వతహాగానే గుర్రాలను ప్రేమించే జడేజా తన గుర్రంతో కలిసి దిగిన మూడు ఫోటోలను షేర్ చేశాడు. ‘ఫరెవర్ క్రష్’ అనే క్యాప్షన్ కూడా తన పోస్ట్‌కి జోడించాడు జడేజా.

వైరల్ అవుతున్న తాజా పోస్ట్

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న తాజా ఫోటోలలో జడేజా బ్లూ కలర్ ట్రాక్, రెడ్ టీషర్ట్ ధరించి తన గుర్రాన్ని పట్టుకుని నిలుచున్నాడు. అయితే జడేజా తన గుర్రంతో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేయడం ఇదే తొలిసారి కాదు. గతేడాది జూన్‌లో కూడా జడేజా ఇదే తరహాలో ‘టు ఇండియన్ మేల్’ అంటూ 3 ఫోటోలను షేర్ చేశాడు.

గతేడాది పోస్ట్

కాగా, ఇటీవల జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో జడేజా 4 వికెట్లు పడగొట్టడంతో పాటు 48 పరుగులు చేశాడు. ఇంకా ఆ మ్యాచ్‌లో తీసిన వికెట్ల ద్వారా టీమిండియా మాజీ బిషన్ సింగ్ బేడీని అధిగమించి టెస్ట్ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన రైట్ ఆర్మ్ స్పిన్నర్‌గా నిలిచాడు. ఇంకా ఐపీఎల్‌ కంటే ముందు జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా జడ్డూ ఆల్‌రౌండర్‌గా మెరిసి.. అశ్విన్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

స్కై వివాదంలో ఊహించని ట్విస్ట్..నటిపై రూ.100కోట్ల పరువునష్టం దావా
స్కై వివాదంలో ఊహించని ట్విస్ట్..నటిపై రూ.100కోట్ల పరువునష్టం దావా
టైగర్‌ సఫారీలో జీప్‌లో పర్యాటకులు..కళ్ళెదుట ఆ సీన్ చూసి షాక్‌
టైగర్‌ సఫారీలో జీప్‌లో పర్యాటకులు..కళ్ళెదుట ఆ సీన్ చూసి షాక్‌
కృష్ణవంశీ సినిమాలో సీన్ లా... మంచు వారి ఇంట భోగీ సెలబ్రేషన్స్
కృష్ణవంశీ సినిమాలో సీన్ లా... మంచు వారి ఇంట భోగీ సెలబ్రేషన్స్
టెస్టుల్లో ఫస్ట్ ఓవర్‌లోనే హ్యాట్రిక్.. ఈ టీమిండియా బౌలర్.!
టెస్టుల్లో ఫస్ట్ ఓవర్‌లోనే హ్యాట్రిక్.. ఈ టీమిండియా బౌలర్.!
ప్రాణాలు తీస్తున్న రాకాసి దారం.. దొరికితే డైరెక్ట్‌గా మర్డర్ కేసే
ప్రాణాలు తీస్తున్న రాకాసి దారం.. దొరికితే డైరెక్ట్‌గా మర్డర్ కేసే
ఇక పై అలాంటి సినిమాలు చేయను..
ఇక పై అలాంటి సినిమాలు చేయను..
పండగ పూట దారుణం.. మాంజా తప్పించబోయి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి!
పండగ పూట దారుణం.. మాంజా తప్పించబోయి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి!
చుట్టపుచూపుగా వచ్చిన కొత్త అల్లుడు దారుణ హత్య!
చుట్టపుచూపుగా వచ్చిన కొత్త అల్లుడు దారుణ హత్య!
మేకలోని ఈ పార్ట్ తింటే.. మీ హెల్త్‌కు ఇక ఢోకా లేనట్టే..
మేకలోని ఈ పార్ట్ తింటే.. మీ హెల్త్‌కు ఇక ఢోకా లేనట్టే..
రాకెట్‌ ప్రయోగం విఫలమైతే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు?
రాకెట్‌ ప్రయోగం విఫలమైతే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు?