AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OYO Rooms: వారికి ఓయో శుభవార్త.. ఇకపై డబ్బులు లేకపోయినా రూమ్ బుక్ చేసుకోవచ్చు.. ఎలా అంటే..?

OYO Rooms: ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్ల కోసం ‘పే లేటర్’ సదుపాయాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అంటే మనకు ఏ వస్తువు కావాలో దాన్ని కొనుగోలు చేసి.. డబ్బులు నిర్ణీత వ్యవధిలో చెల్లించడం. ఇప్పుడు అదే సదుపాయాన్ని ఓయో సంస్థ కూడా తీసుకొచ్చింది. దూర ప్రయాణాలు చేసేవారికి..

OYO Rooms: వారికి ఓయో శుభవార్త.. ఇకపై డబ్బులు లేకపోయినా రూమ్ బుక్ చేసుకోవచ్చు.. ఎలా అంటే..?
OYO Rooms
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jun 17, 2023 | 3:34 AM

Share

OYO Rooms: ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్ల కోసం ‘పే లేటర్’ సదుపాయాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అంటే మనకు ఏ వస్తువు కావాలో దాన్ని కొనుగోలు చేసి.. డబ్బులు నిర్ణీత వ్యవధిలో చెల్లించడం. ఇప్పుడు అదే సదుపాయాన్ని ఓయో సంస్థ కూడా తీసుకొచ్చింది. దూర ప్రయాణాలు చేసేవారికి ఈ ఫెసిలిటీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ అభిప్రాయపడుతోంది. ఓయో సంస్థ ప్రవేశ పెట్టిన ఈ సదుపాయం పేరు ‘స్టే నౌ, పే లేటర్’. ఈ ఫీచర్ తరచూ ప్రయాణం చేసేవారికి ఉపయోగకరంగా ఉండడంతో పాటు.. తక్షణ కాలంలో కొంతమేర ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని ఓయో గ్లోబల్ సీఓఓ అభినవ్ సిన్హా పేర్కొన్నారు.

అయితే కస్టమర్లు ఈ ‘స్టే నౌ, పే లేటర్’ ద్వారా గరిష్ఠంగా 5 వేల రూపాయల వరకు క్రెడిట్ లిమిట్ రూపంలో వాడుకోవచ్చు. ఇంకా హోటల్ రూమ్‌లో స్టే చేసిన 15 రోజుల తర్వాత బిల్ పే చేసుకోవచ్చు. ఈ ఫీచర్ కోసం ఓయో యాప్​హోం స్క్రీన్​లో కనిపించే ‘ఎస్ఎన్‌పీఎల్’ ఫీచర్​ని యాక్సెస్​ చేసి, అవసరాలకు తగినట్టుగా ప్లాన్​ చేసుకోవాలి.

ఇంకా ఈ ఫీచర్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇలా రూమ్ బుక్ చేసుకునేవారికి 65 శాతం డిస్కౌంట్‌తో పాటు 50 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా వర్తిస్తోంది. కాగా, స్టే చేసిన 15 రోజుల లోపు రూమ్ బిల్ చెల్లించకపోతే బిల్లు మొత్తంపై వడ్డీతో పాటు రూ.250 లేట్ ఫీజ్‌ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి