- Telugu News Photo Gallery Adding Sprouts to your diet will give you incredible benefits including heart health
Health Tips: మొలకెత్తిన విత్తనాలు తింటున్నారా..? అయితే ఈ విషయాలను కూడా తెలుసుకోండి..
స్పోర్ట్స్ ఆడేవారు, బరువు తగ్గాలనుకునేవారు మొలకెత్తిన విత్తనాలు లేదా స్ప్రౌట్స్‌ని తినడాన్ని మీరు గమనించే ఉంటారు. వీటిని తినడ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలిస్తే మీరు కూడా వదలకుండా అనునిత్యం తీసుకుంటారు. ఈ కారణంగానే ఇవి గుండెకు, శరీర ఆరోగ్యానికి కూడా ఉపయోగకరమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో మొలకెత్తిన విత్తనాలతో ప్రయోజనాలేమిటో ఇప్పుడు చూద్దాం..
Updated on: Jun 17, 2023 | 6:20 AM

మొలకెత్తిన గింజలను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని పోషకాలు.. ముఖ్యంగా ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ సరిగ్గా ఉంటే సంపూర్ణ శరీరం ఆరోగ్యం ఉన్నట్లేనని నిపుణులు చెబుతున్నారు.

మొలకెత్తిన గింజలలో పుష్కలంగా ఉండే ప్రోటీన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, ఫోలేట్, విటమిన్ సి, విటమిన్ కె వంటి పలు రకాల పోషకాలు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు కూడా శరీరానికి చాలా అవసరమైనవి.

గుండె ఆరోగ్యం: మొలకెత్తిన గింజలను నిత్యం తీసుకోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

బరువు తగ్గడం: అధిక బరువుతో బాధపడేవారికి కూడా మొలకెత్తిన విత్తనాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ముందుగా చెప్పుకున్నట్లుగా వీటిని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఇంకా మీరు తొందరగా ఆకలి వేయదు. అంతేకాక శరీరంలోని కొవ్వును కరిగించే శక్తి వీటికి ఉంది. అందుకు అథ్లెట్స్ తమ డైట్‌లో భాగంగా వీటిని తీసుకుంటారు.

రోగ నిరోధక శక్తి: స్ప్రౌట్స్‌లో ఉండే విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయంగా ఉంటాయి. అలాగే రక్తంలో తెల్ల రక్త కణాల వృద్ధికి ఉపయోగకరంగా ఉంటాయి.




