Vastu Tips: ఇంట్లో ఆర్థిక సమస్యలా..? అయితే గడియారం, వాచ్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..
Vastu Tips: ప్రస్తుత కాలంలో చాలా మంది తమకు ఆదాయ మార్గాలు, మంచి ఉద్యోగం ఉన్నా.. నిత్యం ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటారు. అందుకు ఇంట్లో ఏర్పడిన వాస్తు దోషాలే కారణమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అవును, ఇంట్లోని వస్తువులు అవి ఉండవలసిన స్థానంలో..
Vastu Tips: ప్రస్తుత కాలంలో చాలా మంది తమకు ఆదాయ మార్గాలు, మంచి ఉద్యోగం ఉన్నా.. నిత్యం ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటారు. అందుకు ఇంట్లో ఏర్పడిన వాస్తు దోషాలే కారణమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అవును, ఇంట్లోని వస్తువులు అవి ఉండవలసిన స్థానంలో, దిశలో ఉండకపోతే దాన్ని వాస్తు దోషం అంటారు. ఇంట్లో ఆర్థిక సమస్యలు, నిత్యం అనారోగ్యం, గొడవలు ఉండడానికి కూడా వాస్తు దోషాలే కారణమట. అయితే అన్ని వస్తువుల కంటే గడియారం, వాచ్ విషయంలో వాస్తు పాటించడం తప్పనిసరి అని, అవే మనల్ని ప్రధానంగా ప్రభావితం చేస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. అంటే ఆర్థిక సమస్యలను తొలగించుకోవడానికి గడియారం, వాచ్ విషయంలో వాస్తు నియమాలు పాటిస్తే సరిపోతుంది. మరి వాటి విషయంలో ఏయే నియమాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
గడియారం దిశ: వాస్తు ప్రకారమే గడియారాన్ని పెట్టుకోవడం మంచిది. ఇంటికి తూర్పు లేదా పడమర దిశలో గడియారం ఉంటే మంచిదని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. అలాగే దక్షిణ దిక్కులో గడియాన్ని అస్సలు పెట్టకూడదంట. ఎందుకంటే ఆ దిశలో గడియారం ఉంటే ఆర్థిక సంక్షోభం, వృధా ఖర్చులు వెంటాయడతాయి. కాబట్టి గడియారాన్ని తూర్పు లేదా పశ్చిమ దిశలోనే పెట్టండి.
గడియారానికి సరైన స్థలం: చాలా మంది గది తలుపుకు గడియారం పెడతారు. కానీ అది ఇంటికి మంచిది కాదు. తలుపులపై ఉండే దుమ్ము, దూళీలోనే గడియారం ఉంటే అది ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది. అలాగే మంచం లేదా బెడ్డింగ్ పైన కూడా అంటే పడుకునేవారి తలకు పైన కూడా గడియారం ఉండకూడదు. వాస్తు ప్రకారం గడియారం ప్రధాన ద్వారానికి పైన అలాగే మంచానికి ఎదుట ఉండాలి. మంచంపై పడుకున్నవారికి గడియారం కనిపించేలా ఉండాలి.
ఎలాంటి వాచ్ ధరించాలి..?: టెక్నాలజీ పెరిగిన క్రమంలో మార్కెట్‌లోకి డిజిటల్ వాచ్‌లు వచ్చాయి. కానీ అవి మంచిది కాదు. ముల్లు కదులుతున్న వాచ్ నిరంతరం మారుతున్న కాలానికి, జీవితానికి సూచన. కాబట్టి కనీసం గంటలు, నిముషాల ముల్లు ఉన్న వాచ్‌నే ధరించండి. అది మీ ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది.
వాచ్, గడియారం డిజైన్: మార్కెట్లో అనేక డిజైన్ల వాచ్‌లు ఉన్నాయి. అయితే గుండ్రని వాచ్ ధరించడం, గడియారం ఇంట్లో ఉండడం మంచిదని వాస్తు చెబుతోంది. వాస్తు శాస్త్రం ప్రకారం తెలుపు, క్రీమ్. లేత ఆకుపచ్చ, లేత బూడిద రంగుల్లో గడియారం ఉండడం ఇంటికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా శ్రేయస్కరం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).