- Telugu News Photo Gallery Spiritual photos Vastu Shastra: Fallow These Vastu tips for healthy and Happy Family Life
Vastu Tips: మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ వాస్తు టిప్స్ తప్పక పాటించండి..
Vastu Tips: ఆరోగ్యకరమైన ఆరోగ్యానికి సరైన జీవనశైలి, మంచి ఆహారం అవసరం. దాంతోపాటుగా వాస్తు నియమాలను పాటించడం కూడా ప్రయోజనకరం అని చెబుతున్నారు వాస్తు పండితులు. కుటుంబ సభ్యులు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు వాస్తు టిప్స్ దోహదపడుతాయని అంటుననారు. వాస్తు నియమాలు పాటించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
Shiva Prajapati | Edited By: Narender Vaitla
Updated on: Jun 20, 2023 | 3:19 PM

Vastu Tips: ఆరోగ్యకరమైన ఆరోగ్యానికి సరైన జీవనశైలి, మంచి ఆహారం అవసరం. దాంతోపాటుగా వాస్తు నియమాలను పాటించడం కూడా ప్రయోజనకరం అని చెబుతున్నారు వాస్తు పండితులు. కుటుంబ సభ్యులు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు వాస్తు టిప్స్ దోహదపడుతాయని అంటుననారు. వాస్తు నియమాలు పాటించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

రేకి స్పటికం/ క్రిస్టల్ లోటస్ ఫ్లవర్: వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ప్రతికూల శక్తి ఉంటే అనారోగ్యంతో సహా అనేక సమస్యలు వస్తాయి. రేకి క్రిస్టల్/క్రిస్టల్ లోటస్ ఫ్లవర్ దీనికి ముఖ్యమైనదిగా పరిగణించబడింది. ఈ స్ఫటికాన్ని ఇంటి మధ్యలో ఉంచడం వల్ల ప్రతికూలత తగ్గుతుంది.

మెయిన్ డోర్: ఇంటి ప్రధాన ద్వారం దగ్గర మురికిగా ఉన్నా.. బురద ఉన్నా ఇంట్లోని వారు ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతుంటారు. మానసిక అనారోగ్యం, ఒత్తిడిని కూడా కలిగిస్తాయి.

ఇంటి మధ్యలో బరువైన వస్తువులు ఉంచొద్దు: వాస్తు శాస్త్రం ప్రకారం, బరువైన వస్తువులను ఇంటి మధ్యలో అస్సలు ఉంచొద్దు. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగెటీవ్ ఎనర్జీ పెరుగుతుంది. మహిళ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.

వంటగదిలో ఈ వస్తువులను ఉంచవద్దు: అనేక వ్యాధులకు వంటగదియే కారణం. వంటగది మురికిగా ఉంచొద్దు. అలాగే వంటగది పక్కనే బాత్రూమ్ అస్సలు ఉండొద్దు. వాస్తు శాస్త్రం ప్రకారం.. కిచెన్, బాత్రూమ్ సమీపంలో ఉన్న ఇళ్లలో వ్యాధులు ఎక్కువగా ఉంటాయి.

తులసి మొక్క: తులసి మొక్క వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. ఇంటికి సానుకూలతను పెంచుతుంది. ఇంటి ప్రతికూలత కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. తులసితో పాటు అలోవెరా, అరేకా ప్లాంట్, మనీ ప్లాంట్ వంటి మొక్కలు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి మేలు చేస్తాయి.