- Telugu News Photo Gallery Spiritual photos Astro Tips: do not do these six things on tuesday according to astrology
Astro Tips on Tuesday: మంగళవారం ఈ 6 పనులు చేస్తే కుజుడి ఆగ్రహంతో ఆర్ధిక కష్టాలు, ,కుటుంబంలో కలతలు మీ సొంతం..
వాయు పుత్రుడు హనుమంతుడు తన భక్తులను సమస్య నుండి రక్షిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మానవునికి అన్ని శారీరక బాధలు తొలగిపోతాయి. ప్రతిరోజూ తెలిసి లేదా తెలియక చేసే పనులు అతని జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం కొన్ని చేయకూడని పనులున్నాయి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అంతేకాదు అంగారకుడి అశుభ ప్రభావం జీవితంపై కూడా పడుతుంది. ఎందుకంటే మంగళవారం అంగారకుడి రోజు. ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేసే మంగళవారం నాడు ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకుందాం..
Updated on: Jun 20, 2023 | 9:34 AM

బిడ్డను ప్రభావితం చేస్తుంది: జ్యోతిష్యం ప్రకారం మంగళవారం రోజున రుణ లావాదేవీలు చేయకూడదు. మంగళవారం డబ్బు లావాదేవీలు చేయడం అశుభం. ఈ రోజు తీసుకున్న రుణం.. తిరిగి చెల్లించడం కష్టం. అంతేకాదు ఇచ్చిన డబ్బును తిరిగి పొందడం కష్టం అవుతుంది.

కుటుంబ జీవితంపై ప్రభావం: మంగళవారం పొరపాటున కూడా మాంసం, మద్యం సేవించకూడదు. జ్యోతిషశాస్త్రంలో అంగారక గ్రహాన్ని ఉగ్ర రూపంగా అభివర్ణించారు. అటువంటి పరిస్థితిలో మాంసం, మద్యం తీసుకుంటే వారిలో దూకుడు పెరుగుతుంది. ప్రతికూల ప్రభావం ఆ వ్యక్తుల కుటుంబం, సామాజిక జీవితంపై కనిపించడం ప్రారంభమవుతుంది.

అశుభ ప్రభావాలను ఇచ్చే కుజుడు: మంగళవారాలలో ఎర్రని వస్త్రాలు ధరించాలి. ఎరుపు రంగులో ఉన్న వస్తువులను దానం చేయాలి. అయితే మంగళవారం నల్లని దుస్తులు ధరించరాదు. ఇలా చేయడం వలన శనీశ్వరుడి ప్రభావం పెరుగుతుంది. శనీశ్వరుడితో కుజుడు కలయిక చాలా అశుభం.. బాధాకరమైనదిగా పరిగణించబడుతుంది. ఇది మానసిక, శారీరక బాధల పెరుగుదలకు దారితీస్తుంది

ఆర్థిక నష్టం సంభవిస్తుంది: మీరు కొత్త పనిని ప్రారంభించబోతున్నట్లయితే.. మీరు మంగళవారం ప్రారంభించవచ్చు. అయితే మంగళవారం పెట్టుబడి పెట్టడం శుభప్రదం కాదు. మంగళవారం నుంచి పెట్టుబడులు ప్రారంభిస్తే అనుకోని కారణాలు.. ఆటంకాలు ఏర్పడి పథకం విజయవంతం కాకపోవడం లేదా డబ్బు నష్టం వాటిల్లుతుందని విశ్వాసం.

ప్రతికూల శక్తులు: మంగళవారం పదునైన కత్తి, ఫోర్క్, కత్తెర వంటి వాటిని కొనకండి లేదా ఇతరులకు ఇవ్వకండి. జ్యోతిషశాస్త్రంలో అంగారక గ్రహం రక్తం, యుద్ధానికి కారణం. ఇలాంటి పదునైన వస్తువుల కొనుగోలు కుటుంబంలో అసమ్మతిని పెంచుతుంది.

మంగళవారం రోజున జుట్టు కత్తిరించడం లేదా షేవింగ్ చేయకూడదు. అలాగే గోళ్లు కొరకడం మానుకోవాలి. ఇలా చేయడం వలన మీ మెదడు ప్రభావితం అవుతుందని విశ్వాసం. సంపద, తెలివితేటలను కోల్పోతారు. శాస్త్రాల ప్రకారం, మంగళవారం రోజున జుట్టు కత్తిరించుకోవడం ఆయుస్సు తగ్గుతుందని విశ్వాసం.





























