- Telugu News Photo Gallery Spiritual photos Chanakya Niti: Never Do these Mistakes in life or else you will lose respect in Society and it stops your Personal development
Chanakya Niti: విజయాన్ని దూరం చేసే 5 తప్పులు.. ఎన్నటికీ చేయొద్దంటున్న చాణక్య..
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు రాజకీయ, పాలన, ఆర్థిక శాస్త్రాలలో గొప్ప జ్ఞాని. అయితే ఆయన జ్ఞానం ఆ అంశాల వరకే పరిమితం కాలేదు. సామాజిక అంశాలకు సంబంధించిన నీతి సూత్రలను కూడా బోధించాడు. ఇంకా వ్యక్తి తన జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కొవాలి, విజయం కోసం ఎలాంటి మార్పులు అవసరమనే విషయాలను కూడా చర్చించాడు.
Updated on: Jun 19, 2023 | 6:50 PM

దేశంపై దాడి: మన దేశం లేదా ఒక ప్రాంతంపై మరొక ప్రాంతం దాడి చేస్తే అటువంటి పరిస్థితిని ఎదుర్కోవడం అసాధ్యం అయితే.. అక్కడి నుండి పారిపోవడమే మంచిదని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఇలాంటి దాడులతో స్థానికుల జీవితం నరకప్రాయంగా మారుతుంది. తిండి, పానియాలకు కొరత ఏర్పడి.. ఇబ్బంది పడతారు. ఒకొక్కసారి ఒకరిపై ఒకరు యుద్ధానికి కూడా దిగే పరిస్థితి కూడా నెలకొంటుంది.

జ్ఞానాన్ని పెంపొందించుకోవడం: ఆచార్య చాణక్యుడు జ్ఞానం ప్రాముఖ్యతను గురించి నీతి శాస్త్రంలో ప్రస్తావించాడు. మనిషి నిరంతరం నేర్చుకోవడం.. నైపుణ్యం పెంపొందించుకోవడం.. అభివృద్ధి చెందే వాటిపై పెట్టుబడి పెట్టడంపై గురించి చెప్పాడు. మీరు ఎంచుకున్న రంగంలో నైపుణ్యాన్ని పొందండి. ఈ నిర్ణయం మిమ్మల్ని విజయాన్ని కొత్త శిఖరానికి చేరుకోవడంలో సహాయకరంగా ఉంటుంది. విజయం సాధించాలంటే జ్ఞానానికి ప్రత్యామ్నాయం లేదు.

వ్యసనాలు, దుర్గుణాల్లో మునిగిపోవడం: జూదం, అతిగా మద్యపానం లేదా మాదకద్రవ్యాల వినియోగం వంటి వ్యసనాలు, దుర్గుణాలు మనిషి ఆర్ధిక ఎదుగుదలకు అడ్డంకులని చాణక్యుడు హెచ్చరించాడు. ఈ అలవాట్లు ఒక వ్యక్తి ఆర్థిక వనరులను హరించి, దరిద్రంలో ఉండేలా చేస్తాయి.

కరువు పరిస్థితి: ఏదైనా ప్రాంతంలో లేదా రాష్ట్రంలో కరువు ఉంటే అక్కడ నివసించడంలో అర్థం లేదని చాణక్య నీతి చెబుతుంది. అలాంటి ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లడం మంచిది. కరువు పీడిత ప్రాంతంలో నివసించడం వల్ల కుటుంబ జీవితం ప్రమాదంలో పడుతుంది.

స్త్రీ సమాజ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని.. సమాజాన్ని నిర్మించగలదని.. అదే సమయంలో నాశనం చేయగలదని చెప్పాడు. మహిళకు విద్య చాలా అవసరం.. చదువుకున్న మహిళలు తన కుటుంబాన్ని, సమాజాన్ని మంచి స్థాయిలో నిలుపుతారు. కనుక స్త్రీలకు చదువు తప్పని సరి అని తెలిపాడు.

సంపదను ప్రదర్శించండి: ఆచార్య చాణక్యుడు తన విధానాలలో ఒక వ్యక్తి తన సంపదను ఎప్పుడూ ప్రదర్శించకూడదని నొక్కి చెప్పాడు. మీ దగ్గర ఉన్న డబ్బు గురించి గోప్యత పాటించాలని ఎవరితోనూ పంచుకోకూడదని పేర్కొన్నాడు. ఇలా చేయడం వల్ల మీ డబ్బుపై ఇతరుల చెడు దృష్టి పడే అవకాశం ఉంది.




