Metro Train: రైల్లో రచ్చరంబోలా.. పబ్లిక్‌గా ఆపని చేస్తూ దొరికిపోయిన లవర్స్.. తిట్టిపోస్తున్న నెటిజన్స్..
మెట్రోలందు ఢిల్లీ మెట్రో రైలు వేరయా.. అందులో జరిగే వేషాలన్నీ బూతులేనయా.. అవును మరి. ఈ మధ్య కాలంలో ఢిల్లీ మెట్రో పేరు మారుమోగినంతగా దేశంలోని ఏ మెట్రో ట్రైన్ పేరు వినిపించలేదు. కారణం.. ప్రేమికుల అరాచక పనులు, అశ్లీల పనులు.
మెట్రోలందు ఢిల్లీ మెట్రో రైలు వేరయా.. అందులో జరిగే వేషాలన్నీ బూతులేనయా.. అవును మరి. ఈ మధ్య కాలంలో ఢిల్లీ మెట్రో పేరు మారుమోగినంతగా దేశంలోని ఏ మెట్రో ట్రైన్ పేరు వినిపించలేదు. కారణం.. ప్రేమికుల అరాచక పనులు, అశ్లీల పనులు. ఢిల్లీలో మెట్రో పేరు వినిపిస్తే చాలు.. మళ్లీ ఏం జంట రెచ్చిపోయి.. ఏం పని చేసిందో అనే ఆలోచనే ముందుగా వస్తుంటుంది. అందుకు అనుగుణంగా మళ్లీ ఓ అశ్లీల ఘటన వెలుగు చూసింది. పబ్లిక్ ప్లేస్ అనే సోయి కూడా లేకుండా తెగబడ్డారు ప్రేమికులు. అందరు చూస్తుండగానే.. రెచ్చిపోయి రొమాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం..
ప్రయాణికులంతా మెట్రో ట్రైన్‌లో ప్రయాణిస్తున్నారు. ఇంతలో ఓ ప్రేమ జంటలు సీట్లో కూర్చొని రొమాన్స్ చేయడం మొదలుపెట్టారు. చుట్టూ జనాలు ఉన్నా అవేవీ లెక్క చేయలేదు. తమను అందరూ చూస్తున్నారన్న భయం కూడా లేకుండా ముద్దులు పెట్టుకున్నారు. అశ్లీలంగా ప్రవర్తించారు. అయితే, వీరి ‘ఏ’ సీన్ దృశ్యాలను ట్రైన్‌లో ట్రావెల్ చేస్తున్న కొందరు తమ ఫోన్‌లలో రికార్డ్ చేశారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు.. వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ మెట్రో ట్రైన్ అధికారులను ట్యాగ్ చేశారు.
కాగా, సోషల్ మీడియాలో వీడియో, ఫోటోలు పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అయ్యింది. ప్రేమికుల తీరుపై నెటజిన్లు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువతీ, యువకులు మితిమీరి ప్రవర్తిస్తున్నారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Kindly take action ASAP. pic.twitter.com/E0NPg11UUY
— Bhagat S Chingsubam (@Kokchao) June 18, 2023
ఢిల్లీ మెట్రో అధికారుల వార్నింగ్..
గతంలో కూడా ఇంతకు మించిన ఘటనలు ఢిల్లీ మెట్రో ట్రైన్‌లో చాలా చోటు చేసుకున్నాయి. బహిరంగంగా హస్తప్రయోగం చేసుకోవడం, లవర్స్ రొమాన్ చేయడం వంటివి వెలుగు చూసింది. ఈ చర్యలపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తి చేస్తూ ఢిల్లీ మెట్రో అధికారులకు అనేక ఫిర్యాదులు చేశారు. దాంతో స్పందించిన ఢిల్లీ మెట్రో అధికారులు.. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదంటూ ఒక ప్రకటన జారీ చేసింది. ప్రయాణికులు తమను తాము నియంత్రించుకోవాలని, ప్రజా రవాణాలు ఇలాంటి చర్యలకు పాల్పడటం చట్టవిరుద్ధం అని స్పష్టం చేశారు. ఎవరైనా ఇలాంటి పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అయితే, ఈ వార్నింగ్‌లకు లవర్స్ ఏమాత్రం బెదరడం లేదని తాజా ఘటనను చూస్తే అర్థం చేసుకోవచ్చు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..