Viral Video: స్ట్రాబెర్రీలతో చికెన్ బిర్యానీ.. అడ్రెస్ పెట్టు అంతు చూస్తామంటున్న నెటిజన్లు..!
ఏ దేశానికి చెందిన వ్యక్తి అయినా ఒక్కసారి హైదరాబాద్ ధమ్ బిర్యానీ టేస్ట్ రుచి చూపిస్తే చాలు.. జీవితాంతం గులామ్ అవుతాడు. అంతటి టేస్ట్ హైదరాబాద్ బిర్యానీ సొంతం. అందుకే.. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ సైతం తమ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? అంటే క్షణం ఆలస్యం చేయకుండా హైదరాబాద్ బిర్యానీ టకీమని చెప్పేస్తారు.
ఏ దేశానికి చెందిన వ్యక్తి అయినా ఒక్కసారి హైదరాబాద్ ధమ్ బిర్యానీ టేస్ట్ రుచి చూపిస్తే చాలు.. జీవితాంతం గులామ్ అవుతాడు. అంతటి టేస్ట్ హైదరాబాద్ బిర్యానీ సొంతం. అందుకే.. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ సైతం తమ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? అంటే క్షణం ఆలస్యం చేయకుండా హైదరాబాద్ బిర్యానీ టకీమని చెప్పేస్తారు. కానీ, కొందురుంటారు సామీ.. అసలు బిర్యానీ అంటేనే భయపడేలా చేస్తారు. తాజాగా ఓ బ్రిటీష్ వ్యక్తి చేసిన బిర్యానీ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అంతేకాదు.. బిర్యానీ ప్రియులను హడలెత్తిస్తోంది. బాబోయ్ బ్రిటీషోళ్లతో బిర్యానీ జీవితంలో చేయించొద్దని అంటున్నారు. మరి అంతలా ఏం చేశారు? ఎందుకలా ప్రజలు రియాక్ట్ అవుతున్నారు? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా చికెన్ బిర్యానీని చికెన్, బాస్మతీ రైస్, మాంచి మసాలు, ఇతర వస్తువులను కలిపి చేస్తారు. అలా చేస్తేనే అసలైన మజా వస్తుంది. బిర్యానీ తిన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ, బ్రిటన్‌కు చెందిన ఓ చెఫ్.. చికెన్ బిర్యానీ చేసిన విధానం చూసి.. బాబోయ్ ఇంకెప్పుడూ బ్రిటన్ వారితో బిర్యానీ చేయించొద్దని అంటున్నారు. అతను గ్యాస్‌పై వంటపాత్ర పెట్టి.. అందులో నీరు పోశాడు. ఆ వెంటనే చికెన్ పీస్ వేశాడు. ఆ తరువాత టేస్ట్ కోసం ఉల్లిపాయు, స్ట్రాబెర్రీలను వేశాడు. కాసేపటికి రైస్ వేసి, పసుపు వేశాడు. ఇక బిర్యానీ రెడీ అన్నాడు. టేస్టీగా ఉందంటూ లాగేశాడు.
ఈ బిర్యానీ మేకింగ్‌కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేయగా.. అది చూసిన నెటిజన్లు అతన్ని ఓసారి ఇటు పట్టుకురామ్మ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొందరైతే అడ్రస్ పెట్టు.. అంతు చూస్తా అంటూ కన్నెర్ర చేస్తున్నారు. ఛీ బిర్యానీని పాడు చేశావ్ కద సామీ అంటూ మరికొందరు.. ఇలా బిర్యానీ ప్రియులు ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. నిజమే కదా.. ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన భిర్యానీని, ఇలా స్ట్రాబెర్రీలతో చేసి యాక్ అనిపించాడు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..