Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pop Star: పాప్ స్టార్‌పై కట్టలుతెంచుకున్న అభిమానం.. ‘ఫన్నీగా ఉంది’ అంటున్న విన్నీ ఏమనాలి, సన్నాసి అనాలా..?

Babe Rexha: పబ్లిక్ డ్యాన్స్, మ్యూజిక్ కన్సర్ట్ అంటే ఓంతో హడావిడి ఉంటుంది. చూడడానికి వచ్చిన ప్రేక్షకులు తమ ఫోన్లతో ఫ్లాష్ లైట్‌లు వేయడం, వీడియోలు తీయడం, పక్కనే ఉన్న ఫ్రెండ్స్‌తో కలిసి చిందులేయడం వంటివెన్నో చేస్తుంటారు. అయితే అలా చూడడానికి వచ్చిన..

Pop Star: పాప్ స్టార్‌పై కట్టలుతెంచుకున్న అభిమానం.. ‘ఫన్నీగా ఉంది’ అంటున్న విన్నీ ఏమనాలి, సన్నాసి అనాలా..?
Nicolas Malvagna; Babe Rexha
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 21, 2023 | 3:52 PM

Babe Rexha: పబ్లిక్ డ్యాన్స్, మ్యూజిక్ కన్సర్ట్ అంటే ఓంతో హడావిడి ఉంటుంది. చూడడానికి వచ్చిన ప్రేక్షకులు తమ ఫోన్లతో ఫ్లాష్ లైట్‌లు వేయడం, వీడియోలు తీయడం, పక్కనే ఉన్న ఫ్రెండ్స్‌తో కలిసి చిందులేయడం వంటివెన్నో చేస్తుంటారు. అయితే అలా చూడడానికి వచ్చిన నికోలస్ మాల్వాగ్నా అనే ఓ ప్రేక్షకుడు హద్దు మీరాడు. న్యూయార్క్‌లోని ఓ పబ్లిక్ కాన్సర్ట్‌లో పాల్గొన్న బేబ్ రెక్సా పాట పాడుతుండగా.. ఆమెపై ఫోన్‌ని విసిరాడు మాల్వాగ్నా. ఆ ఫోన్ ఆమె ముఖంపై బలంగా తగలడంతో రెక్సా అక్కడే కుప్పకూలిపోయింది. అక్కడే ఉన్న సహాయక బృందం వెంటనే అతన్ని అందుపులోకి తీసుకోవడంతో పాటు బేబ్ రెక్సాని హాస్పిటల్‌కి తీసుకెళ్ళారు .

అనంతరం న్యూయార్క్ సిటీ పోలీసులు మాల్వాగ్నాని అరెస్ట్ చేశారు. ఇంకా బేబ్ రెక్సాపై దాడిచేసినందుకు గానూ అతనిపై 5 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. అయితే రెక్సాపై దాడికి గల కారణం ఏమిటని అతన్ని ఆడగ్గా ‘కాన్సర్ట్ ముగిసిన తర్వాత ఆమెపై దాడి చేయాలనుకున్నాను. ఎందుకంటే ఆమె చూడడానికి చాలా ఫన్నీగా ఉంది’ అని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

దాడికి సంబంధించిన వీడియో..

  మాల్వాగ్నాని గుర్తించి అదుపులోకి తీసుకోవడం..

బేబ్ రెక్సా..

View this post on Instagram

A post shared by Bebe Rexha (@beberexha)

కాగా, రెక్సాపై సదరు ప్రేక్షకుడు మాల్వాగ్నా తన ఫోన్ విసరడానికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి నేరస్థులను విడిచిపెట్టకుండా సరైన రీతిలో శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మాల్వాగ్నా చేసిన తప్పు వల్ల రెక్సా గాయపడడంతో పాటు వేలాది మంది ప్రేక్షకులు నిరాశకు గురయ్యారని, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..