AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: ధోనిని కెప్టెన్ చేయడానికి వెనుక కారణం ఇదే.. అసలు విషయం చెప్పేసిన భారత్ మాజీ సెలెక్టర్..

MS Dhoni: టీమిండియా ఓ ఐసీసీ ట్రోఫీని గెలిచి దాదాపుగా పదేళ్లు అవుతోంది. చివరిసారిగా ధోని సారథ్యంలో టీమిండియా 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఆ తర్వాత టీమిండియా 4 ఐసీసీ టోర్నీ ఫైనల్స్ ఓడిపోయింది. ఇంకా సెమీ ఫైనల్‌లో ఓడి ఇంటి ..

MS Dhoni: ధోనిని కెప్టెన్ చేయడానికి వెనుక కారణం ఇదే.. అసలు విషయం చెప్పేసిన భారత్ మాజీ సెలెక్టర్..
MS Dhoni
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jun 20, 2023 | 4:02 PM

Share

MS Dhoni: టీమిండియా ఓ ఐసీసీ ట్రోఫీని గెలిచి దాదాపుగా పదేళ్లు అవుతోంది. చివరిసారిగా ధోని సారథ్యంలో టీమిండియా 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఆ తర్వాత టీమిండియా 4 ఐసీసీ టోర్నీ ఫైనల్స్ ఓడిపోయింది. ఇంకా సెమీ ఫైనల్‌లో ఓడి ఇంటి బాట పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ధోని సారథ్యంలో టీమిండియా 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీలను గెలిచింది. ధోని వారసుడిగా కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న విరాట్ కోహ్లీకి టీమిండియాను శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లగల సామర్థ్యం ఉన్నప్పటికీ అతను విఫలమయ్యాడు. కోహ్లీ తరహాలోనే రోహిత్ శర్మ కూడా టీమిండియాకు ఐసీసీ ట్రోఫీని అందించలేకపోయాడు.

ముఖ్యంగా ఈ నెలలోనే జరిగిన ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియాను నడిపించడంలో రోహిత్ పూర్తిగా విఫలమయ్యాడు. ముఖ్యంగా అశ్విన్ విషయంలో పెద్ద పొరపాటు చేశాడు. ద్వైపాక్షిక ఈవెంట్లలో విజయాలు సాధించినప్పటికీ, ICC ట్రోఫీ కోసం అన్వేషణ అంతుచిక్కని విధంగానే కొనసాగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంఎస్ ధోని లాంటి కెప్టెన్‌ను టీమిండియా మళ్లీ పొందలేకపోయింది. అయితే ఇటీవలి డబ్య్లూటీసీ ఫైనల్‌లో రోహిత సేన ఓటమి కెప్టెన్ భవితవ్యంపై అనుమానాలను పెంచింది. ఈ నేపథ్యంలో భారత మాజీ సెలెక్టర్ భూపిందర్ సింగ్ సీనియర్.. ధోనిని కెప్టెన్‌గా నియమించడానికి వెనుక ఉన్న కారణమేమిటో వెల్లడించాడు.

‘కెప్టెన్ అనేవాడిని జట్టు నుంచి నేరుగా ఎన్నుకోకుండా.. అతని బాడీ లాంగ్వేజ్, జట్టును ముందుండి నడిపించగల లక్షణం, నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం, ఇతరులతో కమ్యూనికేషన్ వంటి విషయాల్లో నైపుణ్యాలను చూసి ఎన్నుకుంటారు. ధోనిలో అలాంటి లక్షణాలను కెప్టెన్ కాకముందే ఎన్నో సార్లు కనబర్చాడు. మాకు మంచి స్పందన వచ్చింది’ అని భూపిందర్ సింగ్ తెలిపారు. కాగా, వచ్చే నెలలో టీమిండియా వెస్టిండీస్ టూర్‌కు వెళ్లనుంది. అక్కడ రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. అయితే రోహిత్ జట్టుకు నాయకత్వం వహించాలని భావిస్తున్నప్పటికీ, ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..