AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: వేసవి కోసం పాకిస్థాన్ కొత్త ఆవిష్కరణ.. వీడియో చూశాక ఎవరికైనా ఆసూయ కలగాల్సిందే..

Pakistan: వేసవి కారణంగా దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఎండలతోనే పడలేకపోతుంటే వడగాల్పులు కూడా. పైగా కరెంట్ సమస్య. పోనీ కరెంట్ ఉన్న కాసేపైనా ఏసీ పెట్టుకుందామంటే అందరికీ అంత స్థోమత ఉండదు. ఈ క్రమంలో ఇంట్లో..

Watch Video: వేసవి కోసం పాకిస్థాన్ కొత్త ఆవిష్కరణ.. వీడియో చూశాక ఎవరికైనా ఆసూయ కలగాల్సిందే..
Viral Video Visuals
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jun 19, 2023 | 5:05 PM

Share

Pakistan: వేసవి కారణంగా దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఎండలతోనే పడలేకపోతుంటే వడగాల్పులు కూడా. పైగా కరెంట్ సమస్య. పోనీ కరెంట్ ఉన్న కాసేపైనా ఏసీ పెట్టుకుందామంటే అందరికీ అంత స్థోమత ఉండదు. ఈ క్రమంలో ఇంట్లో ఉందామంటే గాలి రాదు, బయట కూర్చుందామంటే వేడి గాలులు, ఎండలు. ఇదీ దాదాపుగా భారత్‌లోని ప్రతి ఊర్లో ఉన్న పరిస్థితి. అయితే ఈ పరిస్థితుల బారి నుంచి తప్పించుకోవడానికి పాకిస్థాన్ ప్రజలు ఓ వినూత్నమైన ఆవిష్కరణ చేశారు. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పాకిస్థాన్‌కి చెందిన కొందరు ఓ పోల్‌కి గాడిదను కట్టేసి తిరిగేలా చేశారు. ఇంకా ఆ పోల్‌కి పైన అడ్డంగా కర్రను కట్టి దాని రెండు చివరల్లో ఫాన్ రెక్కల్లాంటి తెరచాపలను కట్టారు. ఇక ఆ గాడిద పోల్ చుట్టూ తిరుగుతుంటే ఆ తెరచాపల నుంచి గాలి వస్తుంది. ఇలా కరెంట్ అవసరం లేకుండానే ప్రశాంతమైన గాలిని పొందే ఆవిష్కరణను చేశారు పాకిస్థాన్ ప్రజలు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది. దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు..

ఇవి కూడా చదవండి

@Dsp080382Singh అనే ట్విట్టర ఐడీ నుంచి షేర్ అయిన ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎలా వస్తాయో కానీ ఇలాంటి ఐడియాలు.. భారత్‌కి మాత్రం చెప్పకూడదని పాకిస్థాన్‌కి చెందిన ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. దేశీ సైంటిస్టుల ఆవిష్కరణకు ఏ బహుమతి ఇచ్చినా తక్కువేనని, దీన్ని చూస్తే నాసా శాస్త్రవేత్తలు కూడా ఆసూయ పడతారని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. ‘ఇదో అద్భుతమైన అవిష్కరణ. ఇలాంటి ఆవిష్కరణ భారతదేశంలో ఎందుకు జరగలేదని బాధపడుతున్నా’ అంటూ ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలా వీడియోను చూసిన నెటిజన్లు తమ తమ స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..