PM Modi America Tour: ప్రధాని మోడీ అమెరికా పర్యటనతో ప్రవాసాంధ్రుల్లో ఉత్సాహం.. ఐక్యతా మార్చ్ నిర్వహణ
ప్రవాసభారతీయుడు బన్సాలీ మాట్లాడుతూ "ప్రధాని మోడీకి మద్దతు" ఇచ్చేందుకు తాను కూడా ఏక్తా మార్చ్‌లో పాల్గొన్నానని చెప్పారు. భారతీయులతో కనెక్ట్ అవ్వడం గొప్ప అనుభూతిని కలిగిస్తోందని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన మనందరికీ గర్వకారణమని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రధాని మోడీ పర్యటనపై భారతీయ సంతతికి చెందిన ప్రజల్లో చాలా ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే మోడీ పర్యటనకు సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాకు ఇంకా వెళ్లకుండానే.. ప్రధాని మోడీకి ఘనస్వాగతం పలికేందుకు ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ ప్రజలు ఆదివారం వాషింగ్టన్‌లో ఐక్యతా మార్చ్‌ను చేపట్టారు.
వార్తా సంస్థ ANI పోస్ట్ చేసిన వీడియోలో.. భారతీయ-అమెరికన్ కమ్యూనిటీ ప్రజలు మార్చ్ సందర్భంగా ‘మోడీ మోడీ’, ‘వందేమాతరం’, ‘వందే అమెరికా’ నినాదాలు చేశారు. మార్చ్‌లో పాల్గొన్న ప్రజలు ‘హర హర మోడీ’ పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్క వాషింగ్టన్ లో మాత్రమే కాదు.. అమెరికాలోని 20 పెద్ద నగరాల్లో ఐక్యత మార్చ్ నిర్వహించారు.
ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీకి చెందిన రమేష్ ఆనం రెడ్డి మాట్లాడుతూ..ప్రధాని మోడీ అమెరికా పర్యటన పై తాము అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. “వాషింగ్టన్ DC, మేరీల్యాండ్ చుట్టుపక్కల నగరాల్లో నివసిస్తున్న భారతీయ ప్రవాసులం అంతా ఇక్కడ సమావేశమై ‘యూనిటీ డే’ జరుపుకున్నాము. ప్రధాని మోడీ త్వరలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో సమావేశం కానున్నారు. ఇది మనందరికీ గర్వకారణం అని .. గర్వించదగిన గొప్ప క్షణం అని పేర్కొన్నారు.
భారతదేశం, అమెరికాల మధ్య సంబంధాలు త్వరగతిన పురోగిస్తున్నాయని.. ఒకరినొకరు సాయం చేసుకుంటున్నారో తాము అందరికీ చెప్పాలనుకుంటున్నామని తెలిపారు. భారత ప్రధాని కారణంగా ఈ వ్యత్యాసం తగ్గుతూ వస్తోందని భావిస్తున్నానని వెల్లడించారు. చాలా మంది భారతీయులు ఇక్కడకు వస్తున్నారు.. ప్రధాన స్రవంతి అమెరికన్ ప్రజలకు కూడా చేరాలని వారు కోరుకుంటున్నారు. ఐక్యతా యాత్రలో పాల్గొనాలని తాము భావించినట్లు అందుకే ఇక్కడికి వచ్చాం’’ అన్నారు.
ప్రధాని మోడీ పర్యటన జూన్ 21 నుంచి ప్రారంభం
మరో ప్రవాసభారతీయుడు బన్సాలీ మాట్లాడుతూ “ప్రధాని మోడీకి మద్దతు” ఇచ్చేందుకు తాను కూడా ఏక్తా మార్చ్‌లో పాల్గొన్నానని చెప్పారు. భారతీయులతో కనెక్ట్ అవ్వడం గొప్ప అనుభూతిని కలిగిస్తోందని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన మనందరికీ గర్వకారణమని అన్నారు.
#WATCH | Indian American diaspora holds Unity rally in Washington, welcoming Prime Minister Narendra Modi for his upcoming visit to the United States. pic.twitter.com/8S1FU8oo4m
— ANI (@ANI) June 18, 2023
అమెరికా అధ్యక్షుడు బిడెన్ ప్రథమ మహిళ జిల్ బిడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 21 బుధవారం నుంచి జూన్ 24 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. మోడీ జూన్ 22 గురువారం అమెరికా అగ్రనేత బైడెన్ ఇచ్చే విందుకు హాజరుకానున్నారు. అంతేకాదు కాంగ్రెస్ ఉమ్మడి సమావేశంలో ప్రసంగించనున్నారు. జూన్ 23న వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్‌లో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..