Weight Loss: బరువు తగ్గించుకునేందుకు అతిగా వ్యాయామం చేసింది.. చివరికి
చాలామంది అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. జిమ్‌కు వెళ్తూ.. వ్యాయామాలు చేస్తూ కసరత్తులు చేస్తుంటారు. అయితే సరైన ఆహార నియమాలు పాటించకుంటే ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంటుంది.
చాలామంది అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. జిమ్‌కు వెళ్తూ.. వ్యాయామాలు చేస్తూ కసరత్తులు చేస్తుంటారు. అయితే సరైన ఆహార నియమాలు పాటించకుంటే ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంటుంది. తాజాగా చైనాకి చెందిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ బరువు తగ్గించుకునేందుకు అనేక కసరత్తులు చేసి చివరికి ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే కుయ్‌హువా అనే మహిళ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. అయితే ఆమె దాదాపు 156 కిలోల బరువు ఉంటుంది. ఇటీవల ఆమె తీవ్రంగా వ్యాయాలు చేస్తున్న వీడియోలు షేర్ చేసింది. అలాగే 100 కిలోలు తగ్గించుకునేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నానని తన ఫాలోవర్లకి చెప్పింది.
అయితే కుయ్‌హువా పలు బరువు తగ్గే క్యాంపులలో చేరింది. మొదటి రెండు నెలల్లోనే ఏకంగా 27 కిలోలు తగ్గింది. ఆమె చనిపోయే రెండు రోజుల ముందు షాంగ్జీ ప్రావిన్స్‌లోని వెయిట్ లాస్ క్యాంపుకి వెళ్లింది. అక్కడ నిర్వాహకులు పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని… అలాగే విశ్రాంతి, ఆరోగ్యకరమైన వ్యాయామం చేయాలంటూ సూచినస్తామని తెలిపారు. అయితే కుయ్‌హువా మాత్రం ఓ వైపు తీవ్రంగా వ్యాయమాలు చేస్తూ డైటింగ్ పేరిట సరిగ్గా ఆహారం తీసుకోలేకదని చెప్పారు. ఆమె మృతి చెందిన తర్వాత తన కుటుంబానికి ఆ క్యాంపు నిర్వాహకులు పరిహారం కూడా అందించినట్లు స్థానిక మీడియా కథనాలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె మరణంపై స్థానిక అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..