Somu Veerraju: అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం.. ఏపీ ప్రభుత్వంపై సోము వీర్రాజు ఫైర్..

Andhra Pradesh BJP: జగన్ సర్కారే టార్గెట్‌గా దూకుడు పెంచేసింది ఏపీ బీజేపీ. జాతీయ నేతలు నడ్డా, అమిత్‌షా మీటింగుల తర్వాత రాష్ట్ర నేతల్లో కొత్త జోష్‌ కనిపిస్తోంది. ఇక్కడ జరిగేది పరిపాలన కాదు వ్యాపారం అంటూ నయా స్టేట్‌మెంట్ ఇచ్చారు బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.

Somu Veerraju: అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం.. ఏపీ ప్రభుత్వంపై సోము వీర్రాజు ఫైర్..
Ap Bjp
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 18, 2023 | 9:45 PM

Andhra Pradesh BJP: జగన్ సర్కారే టార్గెట్‌గా దూకుడు పెంచేసింది ఏపీ బీజేపీ. జాతీయ నేతలు నడ్డా, అమిత్‌షా మీటింగుల తర్వాత రాష్ట్ర నేతల్లో కొత్త జోష్‌ కనిపిస్తోంది. ఇక్కడ జరిగేది పరిపాలన కాదు వ్యాపారం అంటూ నయా స్టేట్‌మెంట్ ఇచ్చారు బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ కూడా విసిరారు. ఏపీ కమలం పార్టీ ఏలూరులో కదం తొక్కింది. ప్రధానిగా మోదీ తొమ్మిదేళ్ల పాలనా ఫలాల్ని ప్రజలకు వివరించడమే లక్ష్యంగా మహాజన సంపర్క్ అభియాన్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది బీజేపీ. ఇందులో భాగంగా ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కమలం పార్టీ నేతలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఓట్లు వెయ్యకపోయినా బీజేపీ జనం పక్షమే నిలబడుతుందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఆంధ్రప్రదేశ్‌ని అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పం మోదీకి మాత్రమే ఉందన్నారు. రాష్ట్రంలో రాక్షసుల పాలన నడుస్తోందని, వీళ్ల అవినీతిని నిరూపించడానికి బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పారు.

మోదీ అభివృద్ధిలో దూసుకుపోతుంటే, జగన్ మాత్రం రాష్ట్రాన్ని అప్పులకుప్పలా మారుస్తున్నారంటూ స్టేట్‌మెంట్లలో పదును పెంచారు. వైసీపీ ఎంపీలెవరూ రాష్ట్ర శ్రేయస్సు గురించి ఆలోచించరని, సొంత లాభాలకే పాటుపడతారని విమర్శించారు ఎంపీ సుజనాచౌదరి.

ఇవి కూడా చదవండి

ఈ తొమ్మిదేళ్లలో మోదీ 8 లక్షల 16 వేల కోట్లతో అనేక కార్యక్రమాల ద్వారా ఏపీ ప్రజలకు దగ్గరయ్యారని చెప్పారు బీజేపీ నేతలు. ఒక్క మిస్డ్‌ కాల్ ఇస్తే చాలు మోదీ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ఫోన్‌లోనే వస్తాయన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..