Pawan kalyan: అధికారంలోకి వచ్చాకా తరుముకుంటూ తీసుకెళ్తా.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. కాకినాడ ఎమ్మెల్యే ఒక క్రిమినల్ అంటూ మండిపడ్డారు. కత్తులతో, తుపాకులతో ఆయన దగ్గర యువకులు ఉంటారని చెప్తున్నారని ఆరోపించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. కాకినాడ ఎమ్మెల్యే ఒక క్రిమినల్ అంటూ మండిపడ్డారు. కత్తులతో, తుపాకులతో ఆయన దగ్గర యువకులు ఉంటారని చెప్తున్నారని ఆరోపించారు. ద్వారంపుడి వల్ల అనేక మంది నష్టపోయారని మండిపడ్డారు. ఆయన దోపిడి ఎక్కువైందని.. ముఖ్యమంత్రి అండ చూసుకోని రెచ్చిపోతున్నారని అన్నారు. కాకినాడలో మళ్లీ ద్వారంపుడి గెలవకుండా తానే చూసుకుంటానని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాకా ఎమ్మెల్యేను తరుముకుంటూ తీసుకెళ్తామని హెచ్చరించారు. అలాగే గతంలో కాకినాడలో జనసేన నాయకులు రాళ్ల దాడిలో గాయపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడికి తాను వస్తానని తెలిసి సెక్షన్ 144 అమలు చేశారని చెప్పారు.
అలాగే జనసేన పార్టీ ఆవిర్భావనికి యువతే కారణమన్నారు. 2009 నుంచే రాజకీయాల్లో ఉంటే వైసీపీని రానివ్వకుండా చేసేవాన్నని తెలిపారు. ఒక ఎంపీ కొడుకు, భార్యని కిడ్నాప్ చేస్తే లా అండ్ ఆర్డర్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళల్ని టార్గెట్ చేసి జుట్టు పట్టుకున్న ఘటన కలిచి వేసిందన్నారు. కులాల మధ్య చిచ్చు ఉండకుండా రాష్ట్రం క్షేమంగా, భద్రంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..