Telangana: ఫాదర్స్‌ డే రోజున దారుణం.. భార్యపై కోపంతో కూతురిని మంటల్లో తోసేసిన తండ్రి.. చికిత్స పొందుతూ బాలిక మృతి

చేయి పట్టి మనల్ని నడిపించిన నాన్నశ్రమను, త్యాగాలను గుర్తు చేసుకుంటూ అందరూ ఫాదర్స్‌ డేను ఘనంగా జరుపుకుంటున్నారు. తండ్రితో తమకున్న మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వారికి ఫాదర్స్‌ డే విషెస్‌ చెబుతున్నారు. అయితే ఫాదర్స్‌ డే రోజునే ఒక దారుణం చోటుచేసుకుంది.

Telangana: ఫాదర్స్‌ డే రోజున దారుణం.. భార్యపై కోపంతో కూతురిని మంటల్లో తోసేసిన తండ్రి.. చికిత్స పొందుతూ బాలిక మృతి
Representative Image
Follow us
Basha Shek

|

Updated on: Jun 18, 2023 | 10:10 AM

చేయి పట్టి మనల్ని నడిపించిన నాన్నశ్రమను, త్యాగాలను గుర్తు చేసుకుంటూ అందరూ ఫాదర్స్‌ డేను ఘనంగా జరుపుకుంటున్నారు. తండ్రితో తమకున్న మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వారికి ఫాదర్స్‌ డే విషెస్‌ చెబుతున్నారు. అయితే ఫాదర్స్‌ డే రోజునే ఒక దారుణం చోటుచేసుకుంది. చేయి పట్టి నడక నేర్పించాల్సిన నాన్న కూతురిని మంటల్లో తోసేశాడు. నిజామాబాద్‌ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుటుంబ కలహాలతో కూతురిని మంటల్లో తోసేశాడో తండ్రి. ఈ దారుణ ఘటన నిజమాబాద్ జిల్లా బాల్కొండ మండలం బుస్సా పూర్‌లో చోటు చేసుకుంది. నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడిన బాలిక.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. భార్య మరొకరితో సన్నిహితంగా ఉంటుందని కక్ష పెంచుకున్న నిందితుడు కాశిరాం.. గత నెలలో భార్య ఉంటున్న ఇంటికి వచ్చి.. బట్టలకు నిప్పు పెట్టి, అదే మంటల్లో కుతూరును తోసేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. నిజామాబాద్‌ జిల్లా బుస్సాపూర్‌ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆర్మూర్‌ ఏసీపీ ప్రభాకర్‌రావు చెప్పిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీడీ కాలనీకి చెందిన కడమంచి కాశీరాం, పోసాని దంపతులు. ఈ దంపతులకు సితారి సమ్మక్క (10), సితారి సారక్క (9) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరు చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని నెలల క్రితం కాశీరాం దంపతులు బుస్సాపూర్‌ గ్రామానికి వలస వచ్చారు .అయితే అదే రోజు భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో పోసాని చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్లిపోయింది. తీవ్ర కోపోద్రిక్తుడైన కాశీరాం ఇంటికి నిప్పు పెట్టాడు. మొదట పిల్లల దుస్తులను వేసిన అతను ఆ తర్వాత చిన్న కూతురు సారక్కను కూడా తోసేశాడు. పెద్ద కుమార్తె మాత్రం పారిపోయి ప్రాణాలు దక్కించుకుంది. బాలిక పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు గమనించి చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ బాలిక మృతిచెందింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!