AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khammam: బైక్‌ను ఢీ కొట్టిన కారు.. భర్తతో కలిసి సినిమాకి వెళ్తూ మృతి చెందిన నవ వధువు

సరదాగా సినిమా చూద్దామని భావించిన ఈ దంపతులు రాత్రి ద్విచక్ర వాహనం బుల్లెట్‌పై సినిమా చూసేందుకు మధిరకి బయలుదేరారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న కారు వీరి బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో  సంధ్య తీవ్రంగా గాయపడింది.

Khammam: బైక్‌ను ఢీ కొట్టిన కారు.. భర్తతో కలిసి సినిమాకి వెళ్తూ మృతి చెందిన నవ వధువు
Road Accident
Surya Kala
|

Updated on: Jun 18, 2023 | 9:59 AM

Share

ఇటీవలే వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. ఎన్నో కలలు కన్న తన వైవాహిక జీవితాన్ని పండించుకోడానికి అత్తింట్లో అడుగుపెట్టింది. భర్త, అత్తమామలు అందమైన కుటుంబం అంతా బాగానే ఉంది అనుకునే సమయంలో విధి.. ఆ యువతిని మృత్యు రూపంలో వెక్కిరించింది. ప్రమాద రూపంలో ప్రాణాలను మింగేసింది. సరదాగా భర్తతో కలసి సినిమాకు వెళ్తూ ప్రమాదానికి గురై ప్రాణాలను పోగొట్టుకుంది నవ వధువు.  కారు ప్రమాదంలో గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాధ ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఖమ్మం పట్టణ శివారు టేకులపల్లి కి చెందిన సంధ్యకు ఐదు నెలల క్రితమే పెళ్లి అయింది. సంధ్య తన  భర్తతో కలిసి నందిగామ మండలం కొంతమత్కూరులోని బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడ సరదాగా సినిమా చూద్దామని భావించిన ఈ దంపతులు రాత్రి ద్విచక్ర వాహనం బుల్లెట్‌పై సినిమా చూసేందుకు మధిరకి బయలుదేరారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న కారు వీరి బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో  సంధ్య తీవ్రంగా గాయపడింది. తలకి బలమైన గాయం కావడంతో సంఘటనా స్థలంలోనే ఆమె మృతి చెందింది. సంధ్య భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. ఐదు నెలల క్రితమే పెళ్ళై కొత్త జీవితాన్ని మొదలు పెట్టిన సంధ్య.. ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో ఇరు కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో