Inter Exams: నేటి యువతకు ఆదర్శం ఈ రిటైర్ ఆర్మీ జవాన్.. 74 ఏళ్ల వయసులో ఇంటర్ ఉత్తీర్ణత .. డిగ్రీ కోసం రెడీ..

74 ఏళ్ల వృద్ధుడు చదువుకోవాలనే కోరికను తీర్చుకోవడానికి ముందుకు అడిగేశారు. ఇంటర్ ను పూర్తి చేశారు ఈ రిటైర్ మిలటరీ జవాన్.  డిగ్రీ చదువుకోవడానికి రెడీ అవుతూ అందరితోనూ ప్రశంసలను అందుకుంటున్న ఇంటర్ విద్యార్థి పేరు కల్లా నాగ్ శెట్టి.. 

Inter Exams: నేటి యువతకు ఆదర్శం ఈ రిటైర్ ఆర్మీ జవాన్.. 74 ఏళ్ల వయసులో ఇంటర్ ఉత్తీర్ణత .. డిగ్రీ కోసం రెడీ..
K Nag Shetty
Follow us

|

Updated on: May 31, 2023 | 12:07 PM

వయసు ఒక నెంబర్ మాత్రమే.. కృషి పట్టుదల ఉంటే చాలు అనుకున్నది సాధించడానికి అని నిరూపిస్తున్న వారు ఎందరో ఉన్నారు. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా 74 ఏళ్ల వృద్ధుడు చదువుకోవాలనే కోరికను తీర్చుకోవడానికి ముందుకు అడిగేశారు. ఇంటర్ ను పూర్తి చేశారు ఈ రిటైర్ మిలటరీ జవాన్.  డిగ్రీ చదువుకోవడానికి రెడీ అవుతూ అందరితోనూ ప్రశంసలను అందుకుంటున్న ఇంటర్ విద్యార్థి పేరు కల్లా నాగ్ శెట్టి..

హైదరాబాద్‌లో ఉప్పుగూడ శివాజీనగర్‌ నివాసి. కల్లా నాగ్ శెట్టి స్వస్థలం బీదర్‌ జిల్లా. 1949లో జన్మించిన ఆయన ఎస్‌ఎస్‌ఎల్‌సీ (మెట్రిక్యులేషన్‌) వరకు అక్కడే చదివారు. అయితే పేదరికంతో చదువు ముందుకు సాగలేదు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగం కోసం ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి హాజరై ఆర్మీలో సిపాయిగా ఉద్యోగంలో చేరారు.

1971 ఇండో పాక్‌ యుద్ధం,  1984 ఆపరేషన్‌ బ్లూస్టార్‌లో పాల్గొన్నారు. శ్రీలంకకు ఆర్మీ నుంచి శాంతి సేన సభ్యుడిగా వెళ్లి తన సేవలను అందించారు. 21 ఏళ్లు ఆర్మీలో వివిధ సేవలను అందించిన నాగ్ శెట్టి జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌గా రిటైర్ అయ్యారు. తర్వాత 21 ఏళ్లు ప్రైవేట్ సంస్థల్లో పనిచేశారు. పూర్తీ స్తాయిలో ఉద్యోగం నుంచి రైటర్ అయినా శెట్టికి మళ్ళీ ఆగిపోయిన తన చదువు గుర్తుకొచ్చింది. మళ్ళీ చదువుకోవాలని భావించి రాష్ట్ర ఇంటర్ బోర్డు కు తన కోరిక చెప్పి.. అనుమతులు తెచ్చుకున్నారు. వెంటనే సైదాబాద్‌లోని గోకుల్‌ జూనియర్‌ కాలేజీలో సీఈసీలో అడ్మిషన్‌ తీసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో ఇంటర్ పరీక్షలు రాసి ఏకంగా 77.04 పర్సంటేజీతో ఇంటర్‌ లో ఉత్తీర్ణత సాధించారు. ఇప్పుడు డిగ్రీలో చేరడానికి అప్లికేషన్ కూడా పెట్టారు. చదువుకోవాలంటే ఆసక్తి ఉండాలి కానీ వయసు అడ్డుకాదని నేటి తరానికి ఆదర్శానికి నిలుస్తున్న శెట్టి తనకు చదుకునే అవకాశం కల్పించిన తెలంగాణ సర్కార్ కు థాంక్స్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..