CM KCR: గులాబీ దళపతి సరికొత్త రికార్డు.. ఆ ఘనత సాధించిన తొలి తెలుగు సీఎంగా..

ఒకప్పుడు.. అతను చెప్పే మాటలను ఎవరూ అంతగా పట్టించుకునే వారు కాదు.. ఏకంగా అప్పట్లో అధికార పార్టీకి ఎదురు తిరిగి.. సొంత పార్టీనే స్థాపించాడు.. తెలంగాణ వెనకబాటుతనాన్ని ప్రజలకు వివరించాడు.. నీళ్లు, నిధులు, నియామకాలు.. అంటూ మలిదశ తెలంగాణ ఉద్యమానికి నాంది పలికాడు..

CM KCR: గులాబీ దళపతి సరికొత్త రికార్డు.. ఆ ఘనత సాధించిన తొలి తెలుగు సీఎంగా..
Cm Kcr
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 31, 2023 | 12:29 PM

ఒకప్పుడు.. అతను చెప్పే మాటలను ఎవరూ అంతగా పట్టించుకునే వారు కాదు.. ఏకంగా అప్పట్లో అధికార పార్టీకి ఎదురు తిరిగి.. సొంత పార్టీనే స్థాపించాడు.. తెలంగాణ వెనకబాటుతనాన్ని ప్రజలకు వివరించాడు.. నీళ్లు, నిధులు, నియామకాలు.. అంటూ మలిదశ తెలంగాణ ఉద్యమానికి నాంది పలికాడు.. ప్రజలతో మమేకమై స్వరాష్ట్రం కోసం పోరాడాడు.. తెలంగాణ ఆత్మగౌరవం చాటిచెప్పి.. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను సుసాధ్యం చేసి చూపించి చరిత్రలో నిలిచిపోయాడు.. అతడే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ దేశాన్నే తనవైపు చూసేలా పథకాలను అమలు చేస్తున్నారు. జూన్‌ 2తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు పూర్తయి.. పదో వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ.. దశాబ్ధి ఉత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఏకంగా 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రెండు సార్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం కేసీఆర్ మరో రికార్డు సొంతం చేసుకోనుండటం విశేషం.. ఎందుకంటే.. ఏకబిగిన 9 ఏండ్ల పాటు పాలించిన తెలుగు సీఎంగా కేసీఆర్‌ జూన్‌ 2తో రికార్డు సాధించనున్నారు. ఇప్పటివరకు మొత్తం 24 మంది తెలుగు సీఎంలలో ఎవరికీ దక్కని కీర్తిని.. సీఎం కేసీఆర్ సొంతం చేసుకున్నారు.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. 2014 జూన్‌ 2న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2018 డిసెంబర్‌ 13న రెండోసారి ప్రమాణం చేశారు. అయితే.. 2023 జూన్‌ 2తో తొమ్మిదేండ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకోనున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న వేళ గులాబీ దళపతి సీఎం కేసీఆర్‌ కు మరో ఖ్యాతి దక్కడం రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. తెలంగాణను ఏకధాటిగా తొమ్మిది సంవత్సరాలు సీఎంగా పాలించడంతోపాటు కేసీఆర్‌.. తొలి తెలుగు వ్యక్తిగా చరిత్ర సృష్టించడం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక తెలుగు నాయకుడు ఒక రాష్ర్టానికి, నిరంతరాయంగా, ఏకబిగిన అత్యధికకాలం 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఇదే మొదటి సారి కావడంతో పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అంతకుముందు ఉమ్మడి రాష్ట్రానికి (ఆంధ్రప్రదేశ్‌) సీఎంలుగా పనిచేసిన తెలుగువారిలో అత్యధిక కాలం పదవిలో ఉన్న రికార్డు టీడీపీ నేత చంద్రబాబు నాయుడు పేరిట ఉంది. ఆయన మూడు విడతల్లో మొత్తం 13 ఏళ్ల 247 రోజుల పాటు సీఎంగా ఉన్నారు. అయితే ఆయన ఏకబిగిన ముఖ్యమంత్రిగా కొనసాగింది మాత్రం 8 ఏండ్ల 256 రోజులు మాత్రమే.. 2004లో ఓడిపోయిన చంద్రబాబు.. పదేళ్ల తర్వాత అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత.. 2014లో ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా ఎన్నికయ్యారు. రెండు వేర్వేరు రాష్ర్టాలకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే, తెలుగు వ్యక్తిగా అత్యధిక కాలం.. ఉమ్మడి రాష్ట్రానికి 8 ఏళ్ల 256 రోజులపాటు చంద్రబాబు సీఎంగా ఉన్న రికార్డును.. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధిగమించారు.

ఇవి కూడా చదవండి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానందరెడ్డి 7 సంవత్సరాల 221 రోజులు, నారా చంద్రబాబు నాయుడు 8ఏళ్ల 256 రోజులు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 5ఏళ్ల 111 రోజులు పదవిలో కొనసాగారు. వీరందరి కంటే ఎక్కువగా కేసీఆర్‌ అత్యధిక కాలం.. ఏకబిగిన పాలించిన వ్యక్తిగా రికార్డును సొంతం చేసుకోనున్నారు.

అయితే, జూన్‌ 2తో సీఎం కేసీఆర్‌ తొమ్మిది ఏళ్ల పాలనను పూర్తిచేసుకోని రికార్డును సొంతం చేసుకోవడం.. ఇంకా తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు ప్రారంభం అవుతుండటం.. గులాబీ శ్రేణుల్లో పండుగ లాంటి వాతావరణం నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..