TS SI, Constable Results 2023: తెలంగాణ ఎస్సై, కానిస్టేబుళ్ల తుది ఫలితాలు వెల్లడి.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు అవకాశం

తెలంగాణ ఎస్సై, ఏఎస్సై, కానిస్టేబుల్‌ నియామకాలకు సంబంధించి తుది ఫలితాలు మంగళవారం (మే 30) తెలంగాణ స్టేట్‌ లెవెల్‌ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ప్రకటించింది. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ మొత్తం 8 విభాగాల్లో తుది రాతపరీక్షలు..

TS SI, Constable Results 2023: తెలంగాణ ఎస్సై, కానిస్టేబుళ్ల తుది ఫలితాలు వెల్లడి.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు అవకాశం
Telangana Police Results 2023
Follow us
Srilakshmi C

|

Updated on: May 31, 2023 | 1:03 PM

తెలంగాణ ఎస్సై, ఏఎస్సై, కానిస్టేబుల్‌ నియామకాలకు సంబంధించి తుది ఫలితాలు మంగళవారం (మే 30) తెలంగాణ స్టేట్‌ లెవెల్‌ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ప్రకటించింది. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ మొత్తం 8 విభాగాల్లో తుది రాతపరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వీటిల్లో మొత్తం 84.06 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డు వెల్లడించింది. మొత్తం 1,79,459 మంది అభ్యర్థులకుగాను 1,50,852 మంది ఎంపికైనట్లు తెల్పింది. అభ్యర్థుల సమాధానపత్రాల ఓఎంఆర్‌ షీట్లతోపాటు, తుది ఆన్సర్‌ ‘కీ’లను కూడా అధికారిక వెబ్‌సైట్‌ లో అందుబాటులో ఉంచనున్నట్లు బోర్డు ఛైర్మన్‌ వివి శ్రీనివాసరావు ప్రకటించారు. సమాధానపత్రాల మూల్యాంకనంలో ఎటువంటి తప్పులు దొర్లకుండా పటిష్ఠమైన విధానాలను అనుసరించినట్లు ఆయన స్పష్టంచేశారు. అయినా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు అవకాశం కల్పించామన్నారు.

ఒక్కో సమాధానపత్రాన్ని పునఃపరిశీలించేందుకు ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.2వేలు, ఇతర అభ్యర్థులు రూ.3వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు. జూన్‌ 1 ఉదయం 8 గంటల నుంచి జూన్‌ 3వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఆన్‌లైన్‌లో రుసుం చెల్లించే అవకాశం ఉంటుందన్నారు. ఒక్కో సమాధానపత్రం పునఃమూల్యాంకనానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. తుది రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువీకరణపత్రాల పరిశీలన అనంతరమే ఫైనల్‌ మెరిట్‌ లిస్టు ప్రకటిస్తామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..