Viveka Murder Case: ఎంపీ అవినాష్‌కి బిగ్ రిలీఫ్.. ముందస్తు బెయిల్ ఇచ్చిన తెలంగాణ హైకోర్ట్..
తెలంగాణ హైకోర్టులో ఏపీ ఎంపీ అవినాష్ రెడ్డి బిగ్ రిలీఫ్ లభించింది. ఆయన అభ్యర్థనను మన్నించిన కోర్టు.. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
తెలంగాణ హైకోర్టులో ఏపీ ఎంపీ అవినాష్ రెడ్డి బిగ్ రిలీఫ్ లభించింది. వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నఅవినాష్ అభ్యర్థనను మన్నించిన హైకోర్టు.. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నందున తనపై కఠిన చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని, తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తెలంగాణ హైకోర్టును ఈ నెల 17న ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బుధవారం వరకు ఆయన్ను అరెస్ట్ చేయొద్దని శనివారం మధ్యంతర తీర్పులు ఇచ్చిన హైకోర్టు.. ఈ రోజు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
కాగా, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో భాగంగా.. సీబీఐ ఎదుట అవినాష్ రెడ్డి ఇప్పటికే 7 సార్లు హాజరయ్యారు. అయితే తల్లి అనారోగ్యం కారణంగా ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరు కాలేదు. సీబీఐ విచారణలో ఇప్పటిదాకా తాను సహకరిస్తూ వస్తున్న విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. తన తల్లి బాగోగులు చూసుకోవడం కోసం గడువు కోరుతూ సీబీఐకి విజ్ఞప్తి లేఖ రాశారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలతో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు తాజాగా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..