Khammam: మద్యం మత్తులో దర్జాగా హైవే పైకాళ్లు చాపి కూర్చున్న వ్యక్తి.. వాహనాలు తాకుతూ వెళ్తున్నా కదలని వైనం….
పగటి పూట బిక్షాటన చేస్తూ..రాత్రుళ్ళు ఫుల్ గా మందు కొడతాడు. ఆ వ్యక్తి రాత్రి మందు ఎక్కువై మత్తులో డివైడర్ కు ఆనుకుని రెండు కాళ్ళు చాపి దర్జాగా హైవే పై కూర్చున్నాడు. సృహలో లేకపోవడంతో కాళ్ళకు ఆనుకుని వందలాది వెహికిల్స్ వెళ్తున్న అతనికి స్పృహ లేదు.
తాగర అన్న.. తాగి ఊగ రా అన్నట్టు గా ఒక వ్యక్తి ఫుల్ గా తాగి నడి రోడ్డు మీదనే మద్యం మత్తులో కూర్చున్నాడు. వందలాది వాహనాలు రయ్.. రయ్..మంటు పోతున్నాయి కానీ అతన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. వెళ్ళే వాహనాలకు అడ్డుగా కాళ్ళు చాపి కూర్చోవడంతో బస్, లారీలు..చక్రాల కింద కాళ్ళు ఎక్కడ నలిగిపోతాయో అనే విషయం కూడా పట్టించుకోకుండా ఎవ్వరూ దారిన వారు వెళ్తున్నారు. ఇంత వరకు ఒకే.. అయితే అటుగా వెళ్ళే పోలీసులు కూడా కనీసం కన్నెత్తి చూడకుండా.. చూసి చూడనట్టు హైవే పెట్రోలింగ్ వెహికిల్ లో రయ్.. మంటు దూసుకు పోయారే.. కానీ మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి పోలీసులు కూడా వదిలేశారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి లోని ఆర్టీసీ బస్ స్టాండ్ కు ఇన్ గేట్ సమీపంలో మెయిన్ హైవే రోడ్డు పై రాత్రి చోటు చేసుకున్న సంఘటన ఇది. సత్తుపల్లి లో పగటి పూట బిక్షాటన చేస్తూ..రాత్రుళ్ళు ఫుల్ గా మందు కొడతాడు. ఆ వ్యక్తి రాత్రి మందు ఎక్కువై మత్తులో డివైడర్ కు ఆనుకుని రెండు కాళ్ళు చాపి దర్జాగా హైవే పై కూర్చున్నాడు. సృహలో లేకపోవడంతో కాళ్ళకు ఆనుకుని వందలాది వెహికిల్స్ వెళ్తున్న అతనికి స్పృహ లేదు. ఇంక ఆర్టీసీ బస్సులు మాత్రం డివైడర్ వద్ద ఆ యువకుడు కూర్చునే సరికి బస్ స్టాండ్ లోకి బస్ లు మలుపు తిప్పెందుకు ఇబ్బంది పడ్డారు. ఇదంతా బాగా నే ఉంది..
ఎలాంటి బాధ్యత లేదన్నట్టుగా సత్తుపల్లి పోలీసులు పోలీస్ వాహనం లో అక్కడే రయ్..రయ్..మంటు తిరుగుతున్నారు.. తమకు ఎందుకు అన్నట్లుగా.. రోడ్డు మధ్య ఉన్న అతని పట్టించుకుని కనీసం రోడ్డు పక్కకు కూడా తీసుకు వెళ్ళలేదు. మరో ఇద్దరు కానిస్టేబుల్స్ బైకు మీద వచ్చి చూసుకుంటూ తాపీగా మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి దగ్గరలోనే బైకు ఆపి ఎంచక్కా సెల్ ఫోన్ మాట్లాడుతూ.. టీ లు తాగుతున్నారు. ఈ దృశ్యాలు చూసిన కొందరు సమాజం పట్ల మరి బాధ్యత లేకుండా పోతోందని విమర్శిస్తున్నారు. నిర్లక్ష్యంగా రోడ్ల మీద వ్యవహరిస్తూ వాహన చోదకులు ఇబ్బందులు గురి చేస్తున్న వారి పై కొంచెం పోలీసులు కూడా దృష్టి సారించాలని కోరుతున్నారు.
Reporter: Narayana
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..