JD Chakravarthy:స్పెషల్ కషాయమంటూ విషం తాగించారు.. చనిపోతాననుకున్నా.. జేడీ చక్రవర్తి షాకింగ్‌ కామెంట్స్

నాగార్జున శివ సినిమాలో విలన్‌గా వెండితెరకు పరిచయమైన జేడీ ఆ తర్వాత హీరోగా సక్సెస్‌ అయ్యాడు. మనీ, మనీమనీ, గులాబి, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా, అనగనగా ఒక రోజు, నవ్వుతూ బతకాలిరా, ప్రేమకు స్వాగతం, హోమం వంటి హిట్‌ సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు.

JD Chakravarthy:స్పెషల్ కషాయమంటూ విషం తాగించారు.. చనిపోతాననుకున్నా.. జేడీ చక్రవర్తి షాకింగ్‌ కామెంట్స్
Jd Chakravarthy
Follow us
Basha Shek

|

Updated on: Jun 17, 2023 | 7:53 PM

విలన్‌, హీరో, నిర్మాత, డైరెక్టర్‌, మ్యూజిక్‌ కంపోజర్‌.. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు జేడీ చక్రవర్తి. నాగార్జున శివ సినిమాలో విలన్‌గా వెండితెరకు పరిచయమైన జేడీ ఆ తర్వాత హీరోగా సక్సెస్‌ అయ్యాడు. మనీ, మనీమనీ, గులాబి, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా, అనగనగా ఒక రోజు, నవ్వుతూ బతకాలిరా, ప్రేమకు స్వాగతం, హోమం వంటి హిట్‌ సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు. ఆతర్వాత పలు సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా స్పెషల్‌ రోల్స్‌తో మెప్పించాడు. త్వరలో జేడీ నటించిన దయ సినిమా డైరెక్టుగా ఓటీటీలో రిలీజవుతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన తన పర్సనల్ లైఫ్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇందులో భాగంగా తనపై విషప్రయోగం జరిగిందంటూ సంచలన కామెంట్లు చేశాడు. ప్రస్తుతం జేడీ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

‘కొన్ని నెలల క్రితం ఊపిరి తీసుకోవడంలో సమస్యలు ఎదురయ్యాయి. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్‌ ఎందుకొచ్చాయో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నాకు డ్రగ్స్‌, సిగరెట్లు వంటి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. అయినా బ్రీతింగ్ సమస్యలు రావడంతో చాలామంది వైద్యులను కలిశాను. నా స్నేహితుడు ఉత్తేజ్ సహాయంతో పలు దేశాల్లోని డాక్టర్లను కలిశాను. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. డాక్టర్లు బతకడం కష్టమే అని చేతులెత్తేశారు. ఇదే సమయంలో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమా నిర్మాత శేషురెడ్డి నాకు అండగా నిలిచారు. అతను నా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. లాయర్‌గా పలు సమస్యల నుంచి కాపాడాడు. నాగార్జున అనే డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లాడు. ఆయన నాకు కొన్ని మెడికల్‌ టెస్టులు చేశారు. అప్పుడే తెలిసింది నాకు 8 నెలలుగా స్లో పాయిజన్‌ ఇస్తున్నారని. నేను నిత్యం తాగే కషాయంలో దీనిని కలుపుతున్నట్లు తెలిసింది. అయితే నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు గనుక నా శరీరం స్లో పాయిజన్‌ను తట్టుకుంది’ అని సంచలన వ్యాఖ్యలు చేశాడు జేడీ చక్రవర్తి. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు
Horoscope Today: వారికి ఖర్చులు పెరిగే అవకాశం..
Horoscope Today: వారికి ఖర్చులు పెరిగే అవకాశం..