Vijay Thalapathy: చిన్నారి ఇచ్చిన గిఫ్ట్ చూసి ఎమోషనల్ అయిన విజయ్ దళపతి.. వీడియో వైరల్..
తమిళనాడు రాష్ట్రంలో 10,12 తరగతులలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రామ్ కు విజయ్ ముఖ్య అతిథిగా పాల్గొని.. అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు, సర్టిఫికేట్స్ అందజేశారు. రాష్ట్రస్థాయిలో 600/600 సాధించిన ఓ అమ్మాయికి విజయ్ డైమండ్ నెక్లెస్ బహుమతిగా అందజేశారు. అయితే ఈ కార్యక్రమంలో విజయ్ ఓ చిన్నారి ఇచ్చిన బహుమతి చూసి ఆశ్చర్యపోయారు.

దళపతి విజయ్ సినిమాల కోసం సౌత్ అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. గతంలో బీస్ట్ సినిమాతో అలరించిన విజయ్… ఇప్పుడు లియో చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. శనివారం ఉదయం చెన్నైలోని నీలాంగరైలోని ఆర్కే కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన విజయ్ పీపుల్స్ మూమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. తమిళనాడు రాష్ట్రంలో 10,12 తరగతులలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రామ్ కు విజయ్ ముఖ్య అతిథిగా పాల్గొని.. అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు, సర్టిఫికేట్స్ అందజేశారు. రాష్ట్రస్థాయిలో 600/600 సాధించిన ఓ అమ్మాయికి విజయ్ డైమండ్ నెక్లెస్ బహుమతిగా అందజేశారు. అయితే ఈ కార్యక్రమంలో విజయ్ ఓ చిన్నారి ఇచ్చిన బహుమతి చూసి ఆశ్చర్యపోయారు.
ఈ ప్రోగ్రామ్ లో విజయ్ పక్కనే ఓ వికలాంగ విద్యార్థి కూర్చున్నాడు. ఆ తర్వాత అతను ఒక పెయింటింగ్ బహుమతిగా ఇచ్చాడు. అది చూసిన విజయ్ ఆనందంతో ఆ విద్యార్థికి హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఈ కార్యక్రమంలో విజయ్ మాట్లాడుతూ..హీరో ధనుష్ నటించిన అసురన్ చిత్రంలోని డైలాగ్ చెప్పారు. మన వద్ద ఉన్న వ్యవసాయ భూములు లాక్కుంటారు.. డబ్బుంటే లాక్కుంటారు.. కానీ చదువు మాత్రం ఎప్పటికీ తీసుకోలేరని అన్నారు విజయ్.




విజయ్ మాట్లాడుతూ.. “మీరు ఇప్పటివరకు మీ ఇళ్లలో మీ తల్లిదండ్రులు నిర్దేశించిన మార్గదర్శకత్వంలో పెరిగారు. ఇప్పుడు మీరు ఉన్నత చదువుల కోసం హాస్టళ్లకు వెళ్తారు. అక్కడ మీ స్వేచ్చను.. స్వీయ క్రమశిక్షణతో నిర్వహించాలి. అలాగని మీరు జీవితాన్ని ఆస్వాదించవద్దని నేను చెప్పను. జీవితాన్ని కూడా ఆనందించాలి. జీవితంలో ఆనందం చాలా ముఖ్యం” అని అన్నారు.
Actor Vijay meets exam toppers of Class 10 and 12 board in Chennai ahead of political foray#ITVideo #Vijay #Chennai | @Shilpa1308 @SnehaMordani pic.twitter.com/igv07mKkfe
— IndiaToday (@IndiaToday) June 17, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.