AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priya Bhavani Shankar: టెడ్డీ బేర్స్, పువ్వులు కొనొద్దు.. బాయ్ ఫ్రెండ్‏కు కండీషన్స్ పెట్టిన హీరోయిన్..

ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తోన్న ఇండియన్ 2 చిత్రంలో నటిస్తుంది. అలాగే హరి దర్శకత్వంలో విశాల్ 34వ చిత్రం, డిమాంటే కాలనీ 2, అరణ్మనై 4తోపాటు.. దాదాపు అరడజను చిత్రాల్లో నటిస్తుంది. ఇక వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ నటించనున్న దళపతి 68 చిత్రంలోనూ ఈ భామను ఎంపిక చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అిదే కాకుండా.. తాజాగా విడుదలైన బొమ్మై చిత్రంలోనూ నటించింది.

Priya Bhavani Shankar: టెడ్డీ బేర్స్, పువ్వులు కొనొద్దు.. బాయ్ ఫ్రెండ్‏కు కండీషన్స్ పెట్టిన హీరోయిన్..
Priya Bhavani Shankar
Rajitha Chanti
|

Updated on: Jun 16, 2023 | 5:26 PM

Share

తమిళ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో ప్రియా భవానీ శంకర్ ఒకరు. టెలివిజన్ లోకి న్యూస్ రీడర్‏గా అడుగుపెట్టిన ఆమె.. ఆ తర్వాత సినీపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళంలో మేయాదమాన్ సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది ప్రియా భవానీ శంకర్. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. మాఫియా, రాక్షసుడు, ఏనుగు వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తోన్న ఇండియన్ 2 చిత్రంలో నటిస్తుంది. అలాగే హరి దర్శకత్వంలో విశాల్ 34వ చిత్రం, డిమాంటే కాలనీ 2, అరణ్మనై 4తోపాటు.. దాదాపు అరడజను చిత్రాల్లో నటిస్తుంది. ఇక వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ నటించనున్న దళపతి 68 చిత్రంలోనూ ఈ భామను ఎంపిక చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదే కాకుండా.. తాజాగా విడుదలైన బొమ్మై చిత్రంలోనూ నటించింది. ఇందులో ఎస్ జే సూర్య కథానాయకుడిగా నటించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియా ఆసక్తికర విషయాలను పంచుకుంది. చిన్నప్పుడు మీరు ఎలాంటి బొమ్మలతో ఆడుకున్నారని యాంకర్ అడగ్గా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది.

“నేను చిన్నతనంలో ఎప్పుడూ సరిగ్గా బొమ్మలతో ఆడుకోలేదు. 18 ఏళ్ల వయసులోనే ప్రేమలో పడిపోయాను. అప్పుడు నా బాయ్ ఫ్రెండ్ (రాజవేల్) ఏదైనా బహుమతి ఇస్తానంటే డబ్బులు ఖర్చు చేయవద్దు అని చెప్పేదానిని. అలాగే చాలా మంది అమ్మాయిలు ఇష్టపడే టెడ్డీ బేర్ ను నేను ఎప్పుడూ కొనలేదు. అలాగే పువ్వులు కూడా నా చేతికి రాకముందే వాడిపోతాయి. కాబట్టి నేను వాటిని కొనోద్దు అని చెప్పాను. కేవలం మేమిద్దరం తినడానికి.. వేర్వేరు ఆహారాలు కొనడానికి మాత్రమే డబ్బులు ఖర్చు చేసేవాళ్లం” అంటూ చెప్పుకొచ్చింది ప్రియా.

ఇవి కూడా చదవండి

అయితే ప్రియా చేసిన కామెంట్స్ పై అబ్బాయిలు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ అయితే డబ్బులు ఖర్చు లేదంటున్నారు నెటిజన్స్. అలాగే ఇటీవల సినీరంగంలో జరుగుతున్న లైంగిక వేధింపులపై ప్రియా ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇలాంటివి కేవలం సినిమా రంగంలోనే కాకుండా ప్రతి రంగంలోనూ జరుగుతున్నాయని.. మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని అలాంటి వారు ధైర్యంగా బయటకు చెప్పాలన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్
ఇంటి కోసం ఉద్యోగులకు EPFO సపోర్ట్‌..!
ఇంటి కోసం ఉద్యోగులకు EPFO సపోర్ట్‌..!
రోహిత్ శర్మ వైరల్ వీడియో వెనుక ఉన్న అసలు కామెడీ మ్యాటర్ ఇదీ
రోహిత్ శర్మ వైరల్ వీడియో వెనుక ఉన్న అసలు కామెడీ మ్యాటర్ ఇదీ
యంగ్​ హీరో సినిమా కోసం రంగంలోకి జూనియర్​ ఎన్టీఆర్!
యంగ్​ హీరో సినిమా కోసం రంగంలోకి జూనియర్​ ఎన్టీఆర్!