Andhra Pradesh: ఏపీలో ఒంటిపూట బడుల గడువు పెంపు.. ఎప్పటివరకంటే

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. వడగాల్పుల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24వరకు పాఠశాలలో ఒంటిపూట బడులు పొడగిస్తున్నట్లు ప్రకటించింది.

Andhra Pradesh: ఏపీలో ఒంటిపూట బడుల గడువు పెంపు.. ఎప్పటివరకంటే
School
Follow us
Aravind B

|

Updated on: Jun 18, 2023 | 9:47 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. వడగాల్పుల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24వరకు పాఠశాలలో ఒంటిపూట బడులు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు మాత్రమే ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధించాలని సూచించింది. అలాగే ఉదయం 8.30 గంటల నుంచి 9 గంటల వరకు రాగిజావా పంపిణీ చేయాలని తెలిపింది. ఇక చివరగా ఉదయం 11.30 గంటల నుంచి 12.00 గంటల వరకు మధ్యాహ్న భోజనం ఉంటుందని స్పష్టం చేసింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..