Wrestlers’ Protest: పొలిటికల్‌ టర్న్‌ తీసుకున్న రెజ్లర్ల ఆందోళన.. కాంగ్రెస్ హస్తం ఉందన్న బబితా ఫోగట్..

రెజ్లర్ల ఆందోళన వ్యవహారంపై రాజకీయ రగడ రాజుకుంది. ఢిల్లీలో ఆందోళన చేసిన పహిల్వాన్ల వెనుక కాంగ్రెస్‌ హస్తముందని మరో రెజ్లర్‌ బబితా ఫోగట్‌ ఆరోపించారు. అయితే స్వయంగా బీజేపీ నేత అయిన బబిత తమకు అండగా లేకుండా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం దారుణమన్నారు సాక్షిమాలిక్‌.

Wrestlers' Protest: పొలిటికల్‌ టర్న్‌ తీసుకున్న రెజ్లర్ల ఆందోళన.. కాంగ్రెస్ హస్తం ఉందన్న బబితా ఫోగట్..
Sakshi Malik and Babita Phogat
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 18, 2023 | 10:17 PM

రెజ్లర్ల ఆందోళన వ్యవహారంపై రాజకీయ రగడ రాజుకుంది. ఢిల్లీలో ఆందోళన చేసిన పహిల్వాన్ల వెనుక కాంగ్రెస్‌ హస్తముందని మరో రెజ్లర్‌ బబితా ఫోగట్‌ ఆరోపించారు. అయితే స్వయంగా బీజేపీ నేత అయిన బబిత తమకు అండగా లేకుండా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం దారుణమన్నారు సాక్షిమాలిక్‌. అవును, చాలా కాలంగా న్యాయం చేయండంటూ పోరాటం సాగిస్తున్న రెజ్లర్ల వ్యవహారం పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. రెజ్లింగ్ ఫెడరేషన్‌ చీఫ్‌ బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సాక్షిమాలిక్‌తో మరో రెజ్లర్‌ బబితా ఫోగట్‌ మాటలయుద్దానికి దిగారు. బ్రిజ్‌భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు చార్జిషీటు నమోదు చేసిన తరువాత ఈ వ్యవహారం మరింత ముదిరింది.

ఆరోపణల్లో నిజం లేదన్న సాక్షిమాలిక్‌..

జంతర్‌మంతర్‌ దగ్గర తమ ఆందోళనల వెనుక కాంగ్రెస్‌ పార్టీ హస్తముందన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు సాక్షిమాలిక్‌. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌లో 90 శాతం మందికి 10-12 ఏళ్లుగా ఈ లైంగిక వేధింపులు జరుగుతున్నాయని తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు. రెజ్లర్లలో ఐక్యత లేకపోయినా కొంతమంది మాత్రం నిరసన తెలుపడానికి ముందుకు వచ్చారని, దీక్ష చేయడానికి అనుమతి తీసుకుంది కూడా బీజేపీ నాయకులైన బబితా ఫోగట్, తీరథ్ రాణాలేనని తెలిపారు సాక్షి మాలిక్‌ భర్త సత్యవర్త్ కడియాన్. అంతేకాదు అనుమతి లేఖను కూడా చూపించారు.

లేఖ చూసి నవ్వు వస్తోందన్న బబిత..

అయితే ఈ వీడియోకు మరో రెజ్లర్‌ బబితా ఫోగట్ ట్విట్టర్లో ఘాటుగానే కౌంటర్‌ ఇచ్చారు. సాక్షి మాలిక్‌ చూపించిన లేఖ చూసి తనకు నవ్వు వస్తోందని. లెటర్‌లో ఎక్కడ తన సంతకం లేదన్నారు బబితా ఫోగట్‌. తోటి రెజ్లర్లపై తనకు ప్రేమ, గౌరవం ఉందన్నారు బబితా ఫోగట్‌. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ,అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లాలని సూచించినట్టు తెలిపారు. కాని రెజ్లర్లు మాత్రం కాంగ్రెస్ లీడర్లు ప్రియాంకా గాంధీ, రేప్ కేసుల్లో నిందితులైన దీపేందర్ హుడాలను ఆశ్రయించారని ఆరోపించారు. ఇక కొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవం రోజు రెజ్లర్లు ఆందోళన చేయడాన్ని తప్పుపట్టారు బబితా ఫోగట్. గంగానదిలో పతకాలను విసిరేస్తామని చెప్పడం చూస్తుంటే ఇదంతా కాంగ్రెస్ నాయకులు ఆడిస్తున్న ఆటని అందరికీ అర్ధమవుతోందని అన్నారు.

ఇవి కూడా చదవండి

అయితే బబితకు మరోసారి సాక్షి మాలిక్ గట్టిగ కౌంటర్ ఇచ్చారు. సహచరులంతా ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే మీరు మాత్రం ప్రభుత్వం ఒడిలో చల్లగా సేదదీరుతున్నారని, మీ స్వప్రయోజనాల కోసం సహచరులకు ఎటువంటి సాయం చేయకపోగా ఇలా హేళన చేయడం సరికాదని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..