Miyawaki Forest: ఇంట్లో కూడా అడవిని పెంచవచ్చు.. జపాన్‌కు చెందిన మియావాకీ టెక్నిక్‌ను భారతీయులు తెలుసుకోవాలని కోరిన ప్రధాని మోడీ..

ఈ సాంకేతికతతో చెట్లను నాటడానికి..  మొదటగా ఎంపిక చేసుకున్న ప్రదేశంలోని వాతావరణానికి అనుగుణంగా మొక్కలను ఎంపిక చేస్తారు. అనంతరం విత్తనాలను నాటి మొక్కలను పెంచే ప్రయత్నం చేస్తారు. అయితే విత్తనాలు నాటడానికి ముందు మట్టిని ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకు ముందు నర్సరీలో ఏ మట్టిలో ఆ విత్తనాలు చెట్లు పెరిగాయో తెలుసుకోవాలి.

Miyawaki Forest: ఇంట్లో కూడా అడవిని పెంచవచ్చు.. జపాన్‌కు చెందిన మియావాకీ టెక్నిక్‌ను భారతీయులు తెలుసుకోవాలని కోరిన ప్రధాని మోడీ..
Miyawaki Technique
Follow us
Surya Kala

|

Updated on: Jun 19, 2023 | 8:21 AM

ఆదివారం నాటి మన్ కీ బాత్ 102వ ఎపిసోడ్‌లో ప్రధాని మోడీ “మియావాకీ టెక్నిక్” గురించి ప్రస్తావించారు. జపాన్ కు చెందిన ఈ టెక్నిక్ ద్వారా కేరళకు చెందిన ఉపాధ్యాయుడు రఫీ రాంనాథ్ ఈ సాంకేతికతను ఉపయోగించి 115 రకాలకు పైగా ‘విద్యావనం’ అనే మినీ ఫారెస్ట్‌ను రూపొందించారని ఆయన అన్నారు. ఈ టెక్నీక్ సహాయంతో హెర్బల్ గార్డెన్‌ను తయారు చేశారు. విద్యావనం రూపొందించి ప్రజల్లో చైతన్యం నింపారు. ఈ గార్డెన్ ను చూడడానికి సుదూర ప్రాంతాల ప్రజలు తరలివస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాదు లక్నో గురించి ప్రస్తావిస్తూ.. ఇక్కడ అలీగంజ్‌లో మియావాకి అడవిని సిద్ధం చేస్తున్నట్లు ప్రధాని మోడీ చెప్పారు. 60 చోట్ల పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు ప్రధాని మోడీ.

చాలా దేశాల్లో మియావాకీ టెక్నిక్‌ను భారీగా ఉపయోగిస్తున్నారని ప్రధాని మోడీ చెప్పారు. మియావాకీ టెక్నిక్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని.. భూమిని పచ్చని కాన్వాస్ గా మార్చేందుకు ప్రయత్నించాలని ప్రధాని మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో “మియావాకీ టెక్నిక్” అంటే ఏమిటి? దీనితో అడవిని ఎలా అభివృద్ధి చేయవచ్చో తెలుసుకుందాం..

మియావాకీ టెక్నిక్ అంటే ఏమిటంటే? 

ఇవి కూడా చదవండి

తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలను అడవిలా పెంచడానికి ఉత్తమ మార్గం మియావాకీ టెక్నిక్. ఈ పద్ధతిలో మొక్కలను పెంచడంవలన మొక్కలు త్వరగా పెరుగుతాయి. అంతేకాదు పచ్చదనంతో వనంలా దర్శనమిస్తూ కనులవిందు చేస్తాయి. ఇలా అడవిని పెంచే ఈ ప్రత్యేక పద్ధతిని జపాన్ వృక్షశాస్త్రజ్ఞుడు అకిరా మియావాకీ కనుగొన్నారు. కనుక ఈ టెక్నీక్ ను మియావాకీ అని పిలుస్తారు. చర్చిలు,దేవాలయాలు వంటి మతపరమైన ప్రదేశాలలో మొక్కలు వాటంతట అవే పెరుగుతాయని.. అందుకే అవి ఎక్కువ కాలం చెక్కుచెదరకుండా ఉంటాయని అకిరా గుర్తించాడు. ఇలాంటి ఆలోచనతో.. మియావాకీ టెక్నిక్‌కు పునాది పడిందన్నారు అకిరా మియావాకీ.

ఈ సాంకేతికతతో చెట్లను నాటడానికి..  మొదటగా ఎంపిక చేసుకున్న ప్రదేశంలోని వాతావరణానికి అనుగుణంగా మొక్కలను ఎంపిక చేస్తారు. అనంతరం విత్తనాలను నాటి మొక్కలను పెంచే ప్రయత్నం చేస్తారు. అయితే విత్తనాలు నాటడానికి ముందు మట్టిని ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకు ముందు నర్సరీలో ఏ మట్టిలో ఆ విత్తనాలు చెట్లు పెరిగాయో తెలుసుకోవాలి. అనంతరం అదే మట్టిని ఆ విత్తనాలు నాటి లేదా మొక్కలు నాటి అడవిని అభివృద్ధి చేయాలనుకున్న చోట ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేయడం వలన అప్పటి వరకూ ఆ చెట్లు ఏ నేలలో ఏ విధంగా పెరిగాయో అదే నెలలు ఆ చెట్లు అందుతాయి. ఈ పద్ధతిని అనుసరిస్తూ మొక్కలు పెంచుకోవడం మొదలు పెట్టి.. తక్కువ స్థలంలో లేదా ఇంటి తోటలోనే వనాన్ని పెంచుకోవచ్చు.

మొక్కలు నాటడానికి చేయాల్సిన పక్రియ ఏమిటంటే.. 

ఈ టెక్నిక్‌తో అడవిని నాటాల్సిన ప్రదేశంలో సేంద్రియ ఎరువు, పొట్టు, కొబ్బరి జూట్‌ను మట్టిలో కలపాలి. ఇలా చేయడం వలన భూసారం పెరుగుతుంది. మొక్క పెరుగుదల బాగుంటుంది. మొక్క విత్తనాల ఉత్పత్తి  పెరుగుతుంది. ఎరువు వేసిన తర్వాత అర అడుగు దూరంలో మొక్కలు నాటాల్సి ఉంటుంది. మూడు రకాల మొక్కలను నాటడం ఎంపిక చేసుకోవాలి. వీటిలో గుబురుగా, తర్వాత మధ్య తరహా మొక్కలు, మధ్యస్థం నుంచి కాస్త పెద్ద మొక్కలను ఎంపిక చేసుకోవాలి. మొక్కలు నాటిన తర్వాత గడ్డి, నేల రాలిన ఆకులను నేలపై పరచాలి. ఇలా చేయడం వలన ఎండ వేడి నుంచి భూమి తేమను కోల్పోదు. ఫలితంగా నేలలో తేమ ఉండి పచ్చగా ఉంటుంది.

గుజరాత్‌లో మియావాకి ఫారెస్ట్

గుజరాత్‌లోని కెవాడియాలో ప్రత్యేక మియావాకీ అడవిని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఇది పర్యాటక ప్రదేశంగా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. గతేడాది అక్టోబర్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం మియావాకీ టెక్నిక్ లక్ష్యం. ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ మియావాకి అడవి అనేక భాగాలుగా విభజించబడింది. ఇందులో కలప, పండ్లు, ఔషధ , పూల తోటలు ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..