Tiger Eating Grass: గడ్డి తింటున్న పులులు.. కెమెరాకు చిక్కిన అరుదైన దృశ్యం.. క్రూరమృగాలు ఎందుకు గడ్డితింటాయంటే..!
అడవి జంతువు పులి క్రూర జంతువు, మాంసాహారి! అలాంటి పులి గడ్డి తింటోందంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ ఇది సహజమేనని నిపుణులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా మతాని గ్రామ అడవుల్లో రెండు పులులు గడ్డి తింటూ కెమెరాకు చిక్కాయి.
సాధారణంగా మనుషులకు అనారోగ్యం చేస్తే డాక్టర్ దగ్గరకు పరుగెత్తుతారు. చిన్న చిన్న సమస్యలే అయితే ఇంటి చిట్కాలతో నయం చేసుకుంటారు. మరి పశుపక్ష్యాదులకు అనారోగ్యం చేయదా.. ఒకవేళ చేస్తే వాటికి వైద్యం ఎవరు చేస్తారు? ఈ ఆలోచన ఎప్పుడో అప్పుడు వచ్చే ఉంటుంది కదా.. అవును వాటికీ అనారోగ్యం చేస్తుంది. అయితే జంతువులు, పక్షులు వాటికవే వైద్యం చేసుకుంటాయి. ప్రకృతితో మమేకమై జీవించే వాటికి వనాల్లోని ఆకులు, అలములే వాటికి ఔషధాలు. అలా వాటికవే వైద్యం చేసుకుంటాయి. తాజాగా ఓ రెండు పులులు గడ్డి తింటూ కనిపించాయి. ఒక్క గాండ్రింపుతో వన్యప్రాణులను గడగడలాడించే పులి గడ్డితినమేంటి అనుకుంటున్నారా? అసలు విషయం ఏంటంటే..
అడవి జంతువు పులి క్రూర జంతువు, మాంసాహారి! అలాంటి పులి గడ్డి తింటోందంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ ఇది సహజమేనని నిపుణులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా మతాని గ్రామ అడవుల్లో రెండు పులులు గడ్డి తింటూ కెమెరాకు చిక్కాయి. ఈ దృశ్యాల్ని ఓ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ ఫొటో తీశారు.
అయితే పులులు, సింహాలు,ఇతర మాంసాహార జంతువులు అరుదుగా అనుబంధ పోషకాలను పొందడానికి గడ్డి, ఇతర మొక్కల పదార్థాలను తింటాయి. ముఖ్యంగా మాంసాహారం జీర్ణం కాక కడుపు నొప్పి వచ్చినప్పుడు పులి ఇలా గడ్డి తింటుందట. లేత గడ్డి తింటే ఆహారం త్వరగా జీర్ణమయ్యి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందట. అందుకే, పులులు అప్పుడప్పుడూ ఇలా చేస్తాయని, అయితే ఇలా చాలా అరుదుగా మాత్రమే జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..