Balasore Accident: రైలు ప్రమాదంలో కూడా షార్ప్‌గా ఆలోచించిన జవాన్.. లైవ్ లొకేషన్ పంపడమే కాదు.. ఫోన్ వెలుగులో అనేక మంది ప్రాణాలను రక్షించాడు

రైలు ప్రమాదం గురించి తన సీనియర్ ఇన్‌స్పెక్టర్‌కు తెలియజేశాడు. వెంకటేష్ తాను ఉన్న  లైవ్ లొకేషన్‌ను వాట్సాప్‌లో ఎన్‌డిఆర్‌ఎఫ్ కంట్రోల్ రూమ్‌కి పంపాడు. తద్వారా రెస్క్యూ టీమ్ స్పాట్ జరిగిన ఖచ్చితమైన లొకేషన్ గురించి తెలుసుకుంది. ఈ లైవ్ లొకేషన్‌ని ఉపయోగించి.. రెస్క్యూ టీమ్ స్పాట్‌కి ఖచ్చితంగా చేరుకుంది. 

Balasore Accident: రైలు ప్రమాదంలో కూడా షార్ప్‌గా ఆలోచించిన జవాన్.. లైవ్ లొకేషన్ పంపడమే కాదు.. ఫోన్ వెలుగులో అనేక మంది ప్రాణాలను రక్షించాడు
Odisha Train Accident
Follow us
Surya Kala

|

Updated on: Jun 04, 2023 | 1:01 PM

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం సృష్టించిన విధ్వసంతో యావత్ ప్రపంచం దిగ్భాంతికి గురైంది. అయితే ప్రమాదం జరిగినప్పుడు రైళ్లులో ఉన్న ప్రయాణీకులు సృహ కోల్పోయారు. కొందరు కేకలు వేశారు. మరికొందరు హాహాకారాలు మధ్య సహాయం కోసం ఎదురు చూశారు. అయితే ఇంత కష్టంలోనూ ఒక వ్యక్తి ఆ కష్టాన్ని ప్రపంచానికి తెలియజేయాలని భావించాడు. తమకు ఎదురైన కష్టాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు తన ప్రాణాలను కాపాడుకోవడమే కాదు.. చాలా మందిని మృత్యువు నోటికి చిక్కకుండా బయటికి తెచ్చాడు. ఈ వ్యక్తి మరెవరో కాదు.. దేశాన్ని రక్షించే NDRF జవాన్.. తాను ప్రమాదం జరిగిన రైలులో ఉన్నట్లు అందుకు సంబంధించిన ప్రతి వివరాలు చెప్పారు.

రైలులోనే ప్రయాణం చేస్తున్న జవాన్.. 

ఎన్‌డిఆర్‌ఎఫ్ జవాన్ పేరు ఎన్‌కే. వెంకటేష్ . ప్రమాదం జరిగిన రోజు సాయంత్రం వెంకటేష్ కూడా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాడు. ఏసీ కోచ్‌లోని సీటు నంబర్ 58పై కూర్చున్న వెంకటేష్ పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు వెళ్తున్నాడు. రైలు కుదుపును ముందుగా గుర్తించిన అతికొద్ది మంది ప్రయాణికుల్లో వెంకటేష్ ఒకరు. అంతేకాదు.. కొంతమంది ప్రయాణీకులు తమ సీట్లలో నుండి పడిపోవడం గమనించిన వెంకటేష్ రైలుకు పెద్ద ప్రమాదం జరిగిందని గ్రహించాడు. వెంటనే వెంకటేశన్ స్వయంగా ఎన్‌డిఆర్‌ఎఫ్ జవాన్ కావడంతో.. విషయం తీవ్రతను గ్రహించాడు. వెంటనే ప్రమాదం గురించిన సమాచారాన్ని తన సీనియర్ ఇన్‌స్పెక్టర్‌కు సమాచారం అందించాడు.

ఇవి కూడా చదవండి

రైలు ప్రమాదం గురించి తన సీనియర్ ఇన్‌స్పెక్టర్‌కు తెలియజేశాడు. వెంకటేష్ తాను ఉన్న  లైవ్ లొకేషన్‌ను వాట్సాప్‌లో ఎన్‌డిఆర్‌ఎఫ్ కంట్రోల్ రూమ్‌కి పంపాడు. తద్వారా రెస్క్యూ టీమ్ స్పాట్ జరిగిన ఖచ్చితమైన లొకేషన్ గురించి తెలుసుకుంది. ఈ లైవ్ లొకేషన్‌ని ఉపయోగించి.. రెస్క్యూ టీమ్ స్పాట్‌కి ఖచ్చితంగా చేరుకుంది.

మరోవైపు స్వయంగా రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించిన వెంకటేష్ 

వార్తా సంస్థ పిటిఐ ప్రకారం, రైలు ప్రమాదం గుర్తించిన వెంటనే రెస్క్యూ టీమ్ కు మొదటిగా సమాచారం అందించిన వెంకటేష్  ప్రమాదం నుంచి తన ప్రాణాలను కాపాడలనుకోలేదు. రెస్క్యూ టీమ్ కోసం వేచి ఉండకుండా స్వయంగా రంగంలోకి దిగి.. బాధితులకు సహాయం అందించడం మొదలు పెట్టాడు.

వెంకటేష్ రైల్వే బోగీల నుంచి ప్రయాణీకులను రక్షించడం ప్రారంభించాడు. ముందు ఒక ప్రయాణీకుడిని బయటకు తీసి రైల్వే ట్రాక్ సమీపంలోని ఒక దుకాణంలో కూర్చోబెట్టాడు. వెంటనే ఇతరుల ప్రయాణీకులకు  సహాయం చేయడానికి వెళ్ళాడు. అయితే చీకటిలో రైలులో చిక్కుకున్న వారిని కనిపెట్టడానికి.. సెల్ ఫోన్ లోని టార్చ్ సహాయాన్ని తీసుకున్నాడు. అవతలి వారికీ ఏ విధంగా సిగ్నల్ ఇవ్వాలో కూడా వెంకటేష్ చెప్పాడు.

జవాన్ వెంకటేష్ ప్రమాదం జరిగిన రాత్రిని గుర్తు చేసుకుంటూ.. మొదట తాను తీవ్ర కుదుపుకు గురైనట్లు చెప్పాడు. అదే సమయంలో తన కోచ్‌లోని సీటుపై నుంచి కొందరు వ్యక్తులు పడిపోవడం చూశానని పేర్కొన్నాడు. వెంటనే ఒక ప్రయాణికుడిని రైలు నుంచి బయటకు తీసి రైల్వే ట్రాక్‌కి సమీపంలోని దుకాణంలో కూర్చోబెట్టానని చెప్పాడు. తాను సెలవులో ఉన్నానని..  తమిళనాడులోని తన ఇంటికి వెళ్తున్నానని చెప్పాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..