Balasore Accident: రైల్వే బాధితుల పరిహారంపై సోనూ సంచలన వ్యాఖ్యలు.. నెలనెలా స్థిరమైన ఆదాయం ఇవ్వాలని సూచన
ఈ ప్రమాదం తర్వాత మృతులకు, క్షతగాత్రులకు డబ్బులు అందజేస్తున్నారు. అయితే సోనూసూద్ ఇదే విషయంపై స్పందిస్తూ.. ఇలా ఒక్కసారి డబ్బులను ఇచ్చేసి.. బాధితుల భాద్యత నుంచి తప్పకుంటున్నారని చెప్పారు. ఇప్పుడు ఇచ్చిన డబ్బులు అయిపోతే బాధితుల నెక్స్ట్ పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించారు. ప్రమాదంలో కాలు విరిగిన వారు లేదా ఎప్పటికీ పని చేయలేని వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అందుకే బాధితులకు ప్రతి నెలా నిర్ణీత వేతనం ఇవ్వాలని సోనూసూద్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ ప్రమాదంలో 300 మందికి పైగా మరణించినట్లు, సుమారు 1000 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోదీ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ దుర్ఘటనపై పలువురు నటీనటులు కూడా స్పందిస్తున్నారు. తాజాగా నటుడు సోనూ సూద్ కూడా దారుణ ఘటనపై స్పందించారు. బాధితులకు సహాయం చేయడంలో తనవంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఈ ప్రమాదం తర్వాత మృతులకు, క్షతగాత్రులకు డబ్బులు అందజేస్తున్నారు. అయితే సోనూసూద్ ఇదే విషయంపై స్పందిస్తూ.. ఇలా ఒక్కసారి డబ్బులను ఇచ్చేసి.. బాధితుల భాద్యత నుంచి తప్పకుంటున్నారని చెప్పారు. ఇప్పుడు ఇచ్చిన డబ్బులు అయిపోతే బాధితుల నెక్స్ట్ పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించారు. ప్రమాదంలో కాలు విరిగిన వారు లేదా ఎప్పటికీ పని చేయలేని వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అందుకే బాధితులకు ప్రతి నెలా నిర్ణీత వేతనం ఇవ్వాలని సోనూసూద్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
Heartbroken by the news of the train tragedy in Odisha. Heartfelt deepest condolences ?? Time to show our support and solidarity for the unfortunates. ?#OdishaTrainAccident ?? pic.twitter.com/ZfuYYp8HK9
— sonu sood (@SonuSood) June 3, 2023
సోనూసూద్ బాధితుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఇప్పుడు బాధితులకు ఇస్తున్న పరిహారం 3-4 నెలల్లో అయిపోతుంది. మనం ట్వీట్ చేస్తాము, సంతాపాన్ని తెలియజేస్తాము.. తర్వాత ఎవరి జీవితంలో వారు బిజీగా మారిపోతాం.. మరి నెక్స్ట్ బాధితుల కుటుంబం పరిస్థితి ఏమిటి? వారి జీవనోపాధి ఏమిటి అంటూ ప్రశ్నించారు. అందుకనే బాధితుల భవిష్యత్ కోసం ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వం మంచి పని చేస్తున్నప్పటికీ బాధితులకు ఫిక్స్‌డ్ పెన్షన్ ఏర్పాటు చేయాలని కోరారు సోనూ సూద్.
ఈ ఘోర ప్రమాదం తర్వాత.. సోనూ సూద్ ఈ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని.. బాధితుల భవిష్యత్తు కోసం కొన్ని నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులకు జీవితకాల ప్రయోజనాలను అందించే కొన్ని విధానాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వానికి నేరుగా విజ్ఞప్తి చేశారు. సోనూ సూద్ చేసిన ఈ అభ్యర్థనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..