- Telugu News Photo Gallery Cinema photos Ekta kapoor make career of these stars including smriti irani and ronit roy
Ekta Kapoor: స్మాల్ స్క్రీన్ క్వీన్ ఏక్తా కపూర్ ఈ తరాల అదృష్టాన్ని మార్చింది.. నేటికీ వీరికి స్పెషల్ గుర్తింపు
బుల్లితెర రాణి ఏక్తా కపూర్.. బాలాజీ టెలీఫిల్మ్స్ ను స్థాపించి సీరియల్స్ కు క్రేజ్ ను తెచ్చిన ఏక్తాకపూర్ ను బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. తాను నిర్మించిన సీరియల్స్ తో సూపర్ క్రేజ్ తీసుకుని రావడమే కాదు.. కబీ బహు థీ సీరియల్ తో బుల్లితెరపై సంచలమే..ఏక్తాకపూర్ బుల్లితెరపై నటులకు ఓ రేంజ్ లో క్రేజ్ ను స్మాల్ స్క్రీన్ పై స్టార్ యాక్టర్స్ ను గుర్తింపు తెచ్చి పెట్టింది ఏక్తా. ఈ రోజు ఏక్తా స్కూల్ నుంచి వచ్చిన స్టార్ నటీనటుల గురించి తెలుసుకుందాం.
Updated on: May 22, 2023 | 12:33 PM

నటి గౌరీ ప్రధాన్ .. ఏక్తా కపూర్ స్కూల్ నుంచి స్మాల్ స్క్రీన్ పై క్యుంకీ సాస్ భీ కభీ బహు థీతో నటిగా అడుగు పెట్టింది. ఫ్యామిలీ షోతో అడుగు పెట్టి.. దానినే తన ఇంటి పేరుగా మార్చుకుంది. ఏక్తా ఫ్యామిలీ షో క్యుంకీ సాస్ భీ కభీ బహు థీతో పరిచయం అయిన హితేన్ తేజ్వానీని .. ప్రేమించి పెళ్లి చేసుకుంది.

స్మృతి ఇరానీ, ఏక్తా కపూర్‌ల స్నేహం ఏళ్ల నాటిది. ఏక్తా సీరియల్ ' క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ' సీరియల్ స్మృతి జీవితాన్ని మార్చేసింది. ఈ సీరియల్ లో నటించిన స్మృతి అత్యంత ప్రేక్షకాధారణ సొంతం చేసుకుంది. ప్రస్తుతం స్మృతి నటన కు దూరమై రాజకీయాల్లో రాణిస్తుంది.

రాజీవ్ ఖండేల్వాల్ మొదట ఏక్తా కపూర్ సీరియల్ 'కహిన్ తో హోగా'తో బుల్లి తెరపై నటుడిగా ఆదరణ సొంతం చేసుకున్నాడు. ఈ సీరియల్ లో రాజీవ్ ఖండేల్వాల్ పేక్షకులకు బాగా నచ్చారు.రాజీవ్ అనేక సీరియల్స్, సినిమాల్లో కూడా నటించాడు. ఇప్పుడు రాజీవ్ బుల్లితెరపై షోకు హోస్ట్‌గా చేస్తున్నారు.

అనితా హసానందని (నటాషా) బుల్లితెర పై నటిగా అడుగు పెట్టి.. అనంతరం సినిమాల్లో కూడా నటించింది. అనిత కు కెరీర్ వెండి తెరపై కంటే స్మాల్ స్క్రీన్ పైనే హిట్ గా సాగింది.. ఆమె కెరీర్‌ను ఏక్తా కపూర్ మళ్ళీ సక్సెస్ బాట పట్టించిందని చెప్పవచ్చు. ఏక్తా కపూర్ అనితా హసానందానికి ఒకటి కాదు అనేక సీరియల్స్ లో అవకాశం ఇచ్చింది. చివరిగా నాగిన్‌లో కనిపించింది అనితా హసానందని.

ఏక్తా కపూర్ మరో పాపులర్ సీరియల్ 'కసౌటి జిందగీ కే' బుల్లితెరపై అత్యంత ప్రజాధారణ పొందిన సీరియల్.. ఈ సీరియల్ లో నటించిన నటీనటులు, క్యారెక్టర్స్ అత్యంత ప్రజాదరణ పొందాయి. మిస్టర్ బజాజ్ పాత్రలో నటించిన నటుడు రోనిత్ రాయ్ ఈ సీరియల్ ద్వారా చాలా పేరు తెచ్చుకున్నాడు. నేటికీ అభిమానులు ఆయనను మిస్టర్ బజాజ్ అని గుర్తుంచుకుంటారు.





























