Unique Marriage: ఈ నవ దంపతులది దొడ్డమనసు.. గిఫ్ట్స్‌కు బదులు ఆహుతుల నుంచి రక్తదానం, ఆర్గాన్ డొనేషన్ ప్రతిజ్ఞ,..
గత కొంతకాలంగా వధూవరులు బిన్నంగా ఆలోచిస్తున్నారు. సామజిక దృక్వధకోణంలో వివాహ వేడుకను జరుపుకుంటున్నారు. తాజాగా నవ దంపతులు తమ పెళ్లి వేదికలో గిఫ్ట్ లకు బదులుగా భిన్నమైన పద్దతిని అనుసరించారు. ఈభిన్నమైన పెళ్లి గా ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
పెళ్లంటే మూడు ముళ్లు, ఏడడుగులు.. ఇరువు వ్యక్తులు ఏకం అయ్యే వివాహానికి మూర్తం పెట్టింది మొదలు.. కొత్త బట్టలు, నగలు కొనుగోలు చేయడం.. బ్యాండ్ మేళం, పందిరి, దీపాల వెలుగు ఆహుతుల, స్నేహితుల సందడి నెలకొంటుంది. తమ ఆర్ధిక శక్తి మేరకు వివాహ వేడుకను జరుపుకోవాలని.. బంధువులు, స్నేహితులను పిలవాలని కోరుకుంటారు. ఇక పెళ్లి వేడుకలో ఏర్పాటు చేసే విందు కోసం ఎంత చెప్పినా తక్కువే నేటి కాలంలో. రకరకాల వంటలతో విందును ఏర్పాట్లు చేసి మన్ననలను పొందాలని భావిస్తారు. ఇక పెళ్లికి వచ్చిన ఆహుతులు, స్నేహితులు వధూవరులకు గిఫ్ట్స్ ను అందజేస్తారు. అయితే గత కొంతకాలంగా వధూవరులు బిన్నంగా ఆలోచిస్తున్నారు. సామజిక దృక్వధకోణంలో వివాహ వేడుకను జరుపుకుంటున్నారు. తాజాగా నవ దంపతులు తమ పెళ్లి వేదికలో గిఫ్ట్ లకు బదులుగా భిన్నమైన పద్దతిని అనుసరించారు. ఈభిన్నమైన పెళ్లి గా ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
రాష్ట్రంలో ధమ్‌తారీ జిల్లాలో ఇటీవల జరిగిన ఓ పెళ్లి కొంచెం భిన్నంగా జరిగింది. సమాజానికి ఉపయోగపడేలా వివాహాన్ని కొత్తగా జరుపుకున్నారు వధూవరులు. జిల్లాలోని కాండెల్ గ్రామంలో ముకేష్, నేహాలు తమ పెళ్లిని అందరికీ స్ఫూర్తినిచ్చేలా జరుపుకున్నారు. తమ పెళ్లి వేదిక వద్ద వధూవరులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బ్లడ్ డొనేషన్ చేయడానికి గ్రామస్తులందరూ ముందుకు వచ్చి తమ వంతుగా మంచి పనికి తోడుగా నిలిచారు. అంతేకాదు అవయవదానం విశిష్టతను ప్రతి ఒక్కరికీ వివరించారు. బంధు, మిత్రులతో రక్తదానం, ఆర్గాన్ డొనేషన్ చేస్తామని ప్రతిజ్ఞ కూడా చేయించారు ముకేశ్, నేహా దంపతులు.
వీరి పెళ్లికార్డులపై కూడా రక్తదాన ప్రాముఖ్యతను పేర్కొన్నారు. ఈ విభిన్నమైన కార్యక్రమంతో వీరి పెళ్లి ఆదర్శవంతంగా జరిగిందని పలువురు అనుకుంటున్నారు.
ఈ ధమ్తరి జిల్లా స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖ స్థానం సంపాదించుకుంది. 1920లో గాంధీజీ ఇక్కడి నుంచే సత్యాగ్రహం ప్రారంభించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..