AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Alert: తీవ్ర రూపం దాల్చుతున్న ‘బిపోర్ జాయ్’ తుపాను.. ఆ రాష్ట్రాలకు హెచ్చరిక

అరేబీయా సముద్రంలో ఏర్పడ్డ తీవ్ర తుపాను బిపోర్ జాయ్ మరో 12 గంటల్లో తీవ్ర రూపం దాల్చనుందని.. ఆ తర్వాత అతి తీవ్ర తుపానుగా మారనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తుపాను 24 గంటల్లో ఉత్తర - ఈశాన్య దిశగా కదులుతుందని తెలిపింది.

Weather Alert: తీవ్ర రూపం దాల్చుతున్న 'బిపోర్ జాయ్' తుపాను.. ఆ రాష్ట్రాలకు హెచ్చరిక
Baparjoy Cyclone
Aravind B
|

Updated on: Jun 11, 2023 | 10:57 AM

Share

అరేబీయా సముద్రంలో ఏర్పడ్డ తీవ్ర తుపాను బిపోర్ జాయ్ మరో 12 గంటల్లో తీవ్ర రూపం దాల్చనుందని.. ఆ తర్వాత అతి తీవ్ర తుపానుగా మారనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తుపాను 24 గంటల్లో ఉత్తర – ఈశాన్య దిశగా కదులుతుందని తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో ఉత్తర-పశ్చిమ దిశగా తుపాను కదులుతుందని చెప్పింది. అయితే ప్రస్తుతం ఈ తుపాను గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు 600 కిలోమీటర్ల దూరంలో ఉందని.. పోర్‌బందర్‌కు 200-300 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లిపోతుందని పేర్కొంది.

ఇప్పుడున్న అంచనాల ప్రకారం.. తుపాను గుజరాత్‌ను తాకే అవకాశం లేదని తెలిపింది. అయితే రానున్న 5 రోజుల్లో ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయని.. వచ్చే 5 రోజుల పాటు అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఈ తుపాను ప్రభావంతో కర్ణాటక, గోవా, మహారాష్ట్రల్లోని తీర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడతాయని.. బలమైన ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది. ఇదిలా ఉండగా భారీ అలల వల్ల గుజరాత్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశమేన తితాల్‌ బీచ్‌ను ఈ నెల 14 వరకూ మూసివేస్తున్నట్లు స్థానిక అధికారులు ప్రకటించారు. సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాల్లో 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయనే కారణంతో.. పోర్‌బందర్‌, గిర్‌, సోమనాథ్‌, వల్సాద్‌లకు అధికారులు జాతీయ విపత్తు దళ బృందాలను తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించిన భార్య.. హాస్పిటల్‌కు తీసుకెళ్ల
ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించిన భార్య.. హాస్పిటల్‌కు తీసుకెళ్ల
ఈ ఫేస్‌ ప్యాక్‌ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా చేస్తే అందరి చూపు మీపై
ఈ ఫేస్‌ ప్యాక్‌ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా చేస్తే అందరి చూపు మీపై
ఫాస్టాగ్ వాహనదారులకు అలర్ట్.. మార్చి 31 డెడ్‌లైన్
ఫాస్టాగ్ వాహనదారులకు అలర్ట్.. మార్చి 31 డెడ్‌లైన్
పుట్టగొడుగులు తింటున్నారా ?? అయితే ఈ భాగాన్ని అస్సలు తినకండి
పుట్టగొడుగులు తింటున్నారా ?? అయితే ఈ భాగాన్ని అస్సలు తినకండి
నువ్వు నేను సినిమాకు రాస్తే జయం మూవీతో హిట్టు..
నువ్వు నేను సినిమాకు రాస్తే జయం మూవీతో హిట్టు..
గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. వారికి నో బుకింగ్‌.. నో సిలిండర్‌
గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. వారికి నో బుకింగ్‌.. నో సిలిండర్‌
తండ్రిని బాక్స్‌లో పెట్టి కొరియర్ చేసిన యువతి.. ఎందుకో తెలిస్తే..
తండ్రిని బాక్స్‌లో పెట్టి కొరియర్ చేసిన యువతి.. ఎందుకో తెలిస్తే..
నూనె‌లో కాదు.. అక్కడ పూరీలను నీటిలో వేయిస్తారు.. నమ్మండి ఇది నిజం
నూనె‌లో కాదు.. అక్కడ పూరీలను నీటిలో వేయిస్తారు.. నమ్మండి ఇది నిజం
ఎవరికీ నచ్చకపోయినా హిట్టు కొట్టాను.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డ
ఎవరికీ నచ్చకపోయినా హిట్టు కొట్టాను.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డ
ఇరాన్‌ యుద్ధం.. సామాన్యుడి సొంతింటి కల భస్మం..! నిర్మాణ సామగ్రి
ఇరాన్‌ యుద్ధం.. సామాన్యుడి సొంతింటి కల భస్మం..! నిర్మాణ సామగ్రి