Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదం.. రైల్వే స్టేషన్‌కు సీల్ వేసిన సీబీఐ..

కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం జరిగిన బాహానగా బజార్‌ స్టేషన్‌ను సీబీఐ సీల్‌ వేసింది. కొద్దిరోజుల పాటు ఈ రైల్వేస్టేషన్‌లో రైళ్లు ఆగవని రైల్వే అధికారులు వెల్లడించారు. ఘోర ప్రమాదంలో 288 మంది చనిపోగా 1000 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. అయితే, రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందా?

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదం.. రైల్వే స్టేషన్‌కు సీల్ వేసిన సీబీఐ..
Bahanaga Railway Station
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 10, 2023 | 9:39 PM

కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం జరిగిన బాహానగా బజార్‌ స్టేషన్‌ను సీబీఐ సీల్‌ వేసింది. కొద్దిరోజుల పాటు ఈ రైల్వేస్టేషన్‌లో రైళ్లు ఆగవని రైల్వే అధికారులు వెల్లడించారు. ఘోర ప్రమాదంలో 288 మంది చనిపోగా 1000 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. అయితే, రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందా? అన్న అనుమానాలు రేకెత్తిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విచారణకు సీబీఐని ఆదేశించింది. దాంతో రంగంలోకి దిగిన సీబీఐ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిన బాహానగా బజార్‌ రైల్వేస్టేషన్‌ను తాజాగా సీల్‌ చేసింది.

అంతకుముందే స్టేషన్‌ లాగ్‌ బుక్‌, రిలే ప్యానెల్‌, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకుంది సీబీఐ. ప్రతిరోజు ఇక్కడ భద్రక్- బాలేశ్వర్‌, హావ్‌డా- భద్రక్, ఖరగ్‌పూర్- ఖుర్దా రోడ్ తదితర ఏడు ప్రయాణికుల రైళ్లతోపాటు అవసరమైన సందర్భాల్లో గూడ్సు రైళ్లు ఇక్కడ ఆగేవి. లాగ్ బుక్, రిలే ప్యానెల్, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్న తరువాత బాహానగా బజార్‌ రైల్వేస్టేషన్‌ను సీబీఐ సీల్‌ చేసిందని రైల్వే అధికారులు తెలిపారు. ‘రిలే ఇంటర్‌లాకింగ్ ప్యానెల్‌ను స్వాధీనం చేసుకున్నందున.. సిగ్నలింగ్‌ వ్యవస్థను నిర్వహించేందుకు స్టేషన్‌ సిబ్బందికి అవకాశం లభించదు. అందుకే తదుపరి నోటీసులు వచ్చే వరకు స్టేషన్‌లో ప్రయాణికుల, గూడ్సు రైళ్లు ఆగవు’ అని వెల్లడించారు అధికారులు.

‘ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ’లో మార్పులు చేయడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు రైల్వే శాఖ భావిస్తోంది. బాహానగా బజార్ స్టేషన్ మీదుగా రోజూ దాదాపు 170 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. మరోవైపు.. ప్రమాద బాధితుల్లో 709 మందికి ఇప్పటికే పరిహారం అందించినట్లు అధికారులు తెలిపారు. కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం వెనుక కుట్ర కోణం దాగి ఉందని ప్రముఖులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 270 మంది ప్రముఖులు ప్రధాని మోదీకి ఈవిషయంపై లేఖ రాశారు. రైలు ప్రమాదంపై లోతుగా దర్యాప్తు చేయాలని కోరారు. లేఖ రాసిన వారిలో రిటైర్డ్‌ ఐఏఎస్‌లు, రిటైర్డ్‌ జడ్జీలు కూడా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..