Chhattisgarh: బోర్టు పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఇచ్చిన బహుమతి ఏంటో తెలుసా?.. ఆశ్చర్యపోవాల్సిందే
బోర్డు పరీక్షలో తమ పిల్లలు పాసైనా లేదా మంచి మార్కులు సాధించిన తల్లిదండ్రులు ఉప్పొంగిపోతుంటారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం 10,12 బోర్టు పరీక్షల్లో ప్రతిభ చూపిన వారికి అక్కడి ప్రభుత్వం అరుదైన బహుమతి ఇచ్చి ఆశ్చర్యపరిచింది. పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన 89 మంది విద్యార్థులను హెలికాప్టర్‌లో తిప్పి సంతోషపరిచింది.
బోర్డు పరీక్షలో తమ పిల్లలు పాసైనా లేదా మంచి మార్కులు సాధించిన తల్లిదండ్రులు ఉప్పొంగిపోతుంటారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం 10,12 బోర్టు పరీక్షల్లో ప్రతిభ చూపిన వారికి అక్కడి ప్రభుత్వం అరుదైన బహుమతి ఇచ్చి ఆశ్చర్యపరిచింది. పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన 89 మంది విద్యార్థులను హెలికాప్టర్‌లో తిప్పి సంతోషపరిచింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ విద్యార్థులకు మెరిటి సర్టిఫికేట్లు ఇచ్చారు. అంతేకాదు ఏకంగా రూ.1.5 లక్షల చొప్పున ప్రోత్సాహకం కూడా అందించారు.
అలాగే ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులను బంగారు, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థులను వెండి పతకాలతో సత్కరించారు. అయితే హెలికాప్టర్ ఎక్కే అవకాశాన్ని దక్కించుకున్నవారిలో కుమారి బైగా అనే ఓ బాలిక కూడా ఉంది. ఆమె వసతి గృహంలో ఉంటూ ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో చదివింది. చివరికి పదో తరగతిలో 88.16 శాతం మార్కులు సాధించింది. తన తల్లి వారి స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంట కార్మికురాలుగా పనిచేస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..